- Home
- Entertainment
- నాటు నాటుకి ఆస్కార్ అర్హత లేదేమో, రెహమాన్ 'జైహో' కూడా అంతే.. ఆర్జీవితో కీరవాణి షాకింగ్ కామెంట్స్
నాటు నాటుకి ఆస్కార్ అర్హత లేదేమో, రెహమాన్ 'జైహో' కూడా అంతే.. ఆర్జీవితో కీరవాణి షాకింగ్ కామెంట్స్
అసలు నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ సాధించే అర్హత ఉందా అని వర్మ కీరవాణిని ప్రశ్నించారు. వర్మ ప్రశ్నలకు కీరవాణి తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రాంగోపాల్ వర్మ ప్రతి అంశంపై తనదైన శైలిలో సెటైర్లు వేస్తుంటారు. తాజాగా వర్మ తన యూట్యూబ్ ఛానల్ లో నిజం అనే కొత్త షోని ప్రారంభించారు. ఈ షోలో భాగంగా వర్మ తాజాగా ఆస్కార్ విన్నర్, లెజెండ్రీ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణిని ఇంటర్వ్యూ చేశారు.
అసలు నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ సాధించే అర్హత ఉందా అని వర్మ కీరవాణిని ప్రశ్నించారు. మీ బెస్ట్ సాంగ్స్ లో కనీసం నాటు నాటు టాప్ 100 లో అయినా ఉండే అవకాశం ఉందా అని కూడా వర్మ ఆసక్తికరంగా ప్రశ్న సంధించారు. వర్మ ప్రశ్నలకు కీరవాణి తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు.
నాటు నాటు సాంగ్ కి అర్హత ఉందా అని చర్చించుకుంటే, కారణాలు వెతుక్కుంటే చాలా మాట్లాడుకోవాలి. కానీ కేవలం ఒక పాటగా మాత్రమే తీసుకుంటే నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ అర్హత లేదనే నేను ఫీల్ అవుతాను అంటూ కీరవాణి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏఆర్ రెహమాన్ 'జైహో' సాంగ్ కి కూడా ఆస్కార్ వచ్చింది. అప్పుడు కూడా నాకు అలాగే అనిపించింది. జైహోని మించేలా రెహమాన్ చేసిన అద్భుతమైన సాంగ్స్ ఎన్నో ఉన్నాయి. కాబట్టి జైహోకి ఎంత అర్హత ఉందో నాటు నాటుకి కూడా అంతే అర్హత ఉందని భావిస్తా.
MM Keeravani
మీ కెరీర్ లో టాప్ 100 బెస్ట్ సాంగ్స్ లో ఇది ఉంటుందా అని వర్మ ప్రశ్నించగా.. ఉండదు అని కీరవాణి నిర్మొహమాటంగా చెప్పారు. జనాలకు నచ్చే పాటలు చేయడం, నాకు నచ్చే పాటలీ చేయడం అనే డైలమా ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. ముందు పాట నాకే నచ్చకపోతే ప్రజలకు ఏం నచ్చుతుంది అనే ఫీలింగ్ ఉంటుంది.
ఇక వర్మ మాట్లాడుతూ నాటు నాటు సాంగ్ అనేది వెస్ట్రన్ ఆడియన్స్ కి ఒక డిఫెరెంట్ ఫీలింగ్. రాంచరణ్, ఎన్టీఆర్ డ్యాన్స్, కొరియోగ్రఫీ ఇవ్వన్నీ పక్కన పెడితే ఆ పాటే ఒక వైవిధ్యమైన అనుభూతిని వాళ్ళకి ఇచ్చింది. అందువల్లే ఈ పాటకి ఆస్కార్ వచ్చిందేమో అని వర్మ అన్నారు. వర్మ చెప్పిన పాయింట్ కొంతవరకు కరెక్ట్ అని చెప్పిన కీరవాణి తన వర్షన్ వినిపించారు.
వరల్డ్ వైడ్ గా ఆస్కార్ ఓటర్లు కొన్ని వేల మంది ఉంటారు. వాళ్ళకి నాటు నాటు సాంగ్ మాత్రమే చూపించి ఓటు అడగలేం. ఒక మనిషిలో ముక్కు బావుంది అని చెప్పాలంటే మూడు ఆ వ్యక్తిని చూడాలి. అలాగే నాటు నాటు సాంగ్ మాత్రమే చూస్తే ఆ ఇంపాక్ట్ ఉండదు. సినిమా మొత్తం చూసినప్పుడు అది వాళ్ళకి నచ్చితే ఆ ఇంపాక్ట్ సాంగ్ పై కూడా ఉంటుంది. ఆర్ఆర్ఆర్ చిత్రం బాగాలేకపోతే నాటు నాటు సాంగ్ ఎంత బావున్నా ఓటు వేస్తారా అంటే అనుమానమే అని కీరవాణి అన్నారు.