Brahmamudi: తల్లికి నిజం చెప్పేసిన కావ్య.. అపర్ణకు సూపర్ షాక్ ఇచ్చిన రాజ్!
Brahmamudi: స్టార్ మా లో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ ప్రేక్షకుల హృదయాలని గెలుచుకొని మంచి రేటింగ్ ని సంపాదించుకుంటుంది. తాను ప్రెగ్నెంట్ ని అని చెప్పి ఇంట్లో వాళ్ళందరినీ మోసం చేస్తున్న ఒక కోడలి కధ ఈ సీరియల్. ఇక ఈరోజు అక్టోబర్ 23 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.
ఎపిసోడ్ ప్రారంభంలో చిరిగిపోయిన చీరలు చూసి ఆవేశ పడిపోతుంది కనకం. చీరలు ఎలకలు కొట్టేసాయి అని రుద్రాణి చెప్పటంతో తిట్టరాని తిట్లన్నీ తిడుతుంది కనకం. ఆమెకి రుద్రాణియే ఆ పని చేసిందని తెలుసు. అందుకే తిట్ల దండకం అందుకుంటుంది. ఆ తిట్లు వినలేక ఆపమంటుంది రుద్రాణి. తిడుతున్నది ఎలకనే కదా మీరెందుకు ఆపమంటున్నారు అంటుంది కనకం.
నువ్వు ఎంత తిట్టినా ఎలుకలకి అర్థం కాదు కదా అంటుంది రుద్రాణి. కానీ నా కడుపు మంట తీరుతుంది కదా, ఇంత జరిగినా కూడా నేను ఈ గది దాటి బయటకు వెళ్ళను, ఈ గదిలోనే పడుకుంటాను అని స్థిరంగా చెప్తుంది. కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రుద్రాణి. ఉన్న నాలుగు మంచి చీరలు చింపేసింది అని రుద్రాణిని తిట్టుకుంటుంది కనకం. ఆ తర్వాత స్వప్నకి టాబ్లెట్స్ ఇచ్చి వేసుకోమంటుంది కనకం.
ఈ లోపు అటుగా వెళుతున్న కావ్యని జ్యూస్ అడుగుతుంది స్వప్న. తనకు ఎందుకు పని చేస్తున్నావు, నువ్వేమీ నెలలు నిండిన మనిషివి కాదు ఇలా తినేసి కూర్చుంటే లావెక్కి పోతావు. నీ పనులు నువ్వే చేసుకో లేకపోతే నన్ను అడుగు నేను చేస్తాను, నేను ఉన్నది అందుకే కదా అంటుంది కనకం. ఈ మాత్రానికే అంత క్లాస్ పీకాలా అంటుంది స్వప్న. ఇప్పటినుంచి కష్టపడితేనే డెలివరీ బాగా అవుతుంది అంటుంది కనకం.
అప్పుడే జ్యూస్ తీసుకు వస్తున్న కావ్య కడుపు ఉంటేనే కదా డెలివరీ అవ్వటానికి అంటుంది. ఒక్కసారిగా షాక్ అవుతారు స్వప్న, కనకం. అదేంటి అంత మాట అనేసావు అంటుంది కనకం. అవునమ్మా, నేను జాగ్రత్తగా ఉండటం లేదు కదా డెలివరీ అయిన వరకు ప్రెగ్నెన్సీ ఉంటుందో లేదో అని దాని అనుమానం అంటూ కవర్ చేసేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది స్వప్న. ఎప్పుడూ లేనిది నీ నోట్లోంచి అపశకునం మాటలు వచ్చాయి ఏంటి అంటుంది కనకం.
మనం ఎన్ని జాగ్రత్తలు చెప్పినా జాగ్రత్తగా ఉండాలని తనకనిపించాలి కదా అని తల్లికి చెప్పి మనసులో మాత్రం తల్లిని కూడా మోసం చేస్తుంది అని స్వప్నని తిట్టుకుంటుంది కావ్య. మరోవైపు అనామిక, కళ్యాణ్ అప్పు ని తీసుకొని ఫోటోషూట్ కి వస్తారు. మేము ఫోటోలు కి ఫోజులిస్తూ ఉంటాము, నువ్వు ఫోటోలు తీయు అని అప్పుకి చెప్తాడు కళ్యాణ్.వాళ్ళ ఫోజులు చూసి మనసులో బాధపడుతూ ఫోటోలు తీస్తూ ఉంటుంది అప్పు.
మరోవైపు ఇంట్లో శాంత పని చేయడం చూసి షాక్ అవుతుంది కావ్య. ఎవరు పిలిపించారు తనని, అత్తయ్య చూస్తే అంతే సంగతులు అని మనసులో అనుకుంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన అపర్ణ శాంతిని చూసి మండిపడుతుంది. నువ్వేనా తనని పనిలో పెట్టుకున్నావు అంటూ కావ్య మీద కేకలు వేస్తుంది. ఆ కేకలకి ఇంట్లో వాళ్ళందరూ అక్కడికి వస్తారు. ఇదే ఛాన్సుగా రుద్రాణి కూడా అత్త మాటకి ఆ మాత్రం విలువ ఇవ్వవా అంటూ అపర్ణని రెచ్చగొడుతుంది.
అప్పుడు శాంత కావ్యమ్మ పనిలో పెట్టుకోలేదు అంటుంది. మరి ఎవరు పెట్టారు అంటుంది అపర్ణ. నేనే అంటూ అక్కడికి వస్తాడు రాజ్. ఒక్కసారిగా షాక్ అవుతుంది అపర్ణ. నువ్వెందుకు పెట్టావు అని అడుగుతుంది. ఇంట్లో పని అంతా తను ఒక్కతే చేసుకోలేక పోతుంది అందుకే పెట్టాను అంటాడు రాజ్. అంటే తల్లిని అడగకుండా నువ్వే నిర్ణయాలు తీసేసుకున్నావంటే ఏమిటి నీ ఉద్దేశం అంటుంది రుద్రాణి.
ఇప్పుడు నేను ఏం చేశానని మా అమ్మని అలా రెచ్చగొడుతున్నావు, బాగా ఓవరాక్షన్ చేస్తున్నావ్ అత్త అని కోప్పడతాడు రాజ్. ధాన్యలక్ష్మి, ప్రకాష్ కూడా రుద్రాణిని మందలిస్తారు. అప్పుడు అపర్ణ పనిమనిషిని పెట్టాలనుకుంటే కొత్తావిడని పెట్టొచ్చుకదా తిననే ఎందుకు పెట్టుకున్నావు అంటుంది అపర్ణ. శాంతకి అన్నీ తెలుసు, మళ్లీ మనం ఏమి చెప్పక్కర్లేదు అంటాడు రాజ్. ఇంటి పనుల్లో బిజీ అయిపోయి తాతయ్య సంగతి మర్చిపోతుంది.తాతయ్యకి ఏ మందులు వేయాలో కావ్య కి మాత్రమే తెలుసు అంటాడు రాజ్.
నువ్వు చేసింది కరెక్టే కానీ మీ అమ్మకి చెప్పకుండా చేశావు అదే తప్పు అంటుంది రుద్రాణి. ఇందులో తప్పేముంది అంటూ రాజ్ ని వెనకేసుకొస్తూ రుద్రానికి చివాట్లు పెడుతుంది చిట్టి. తరువాయి భాగంలో చిట్టి తలుపు కొడుతుంటే కావ్య ఎక్కడ కింద పడుకునే విషయం తెలిసిపోతుందో అని గబగబా ఆ పరుపు తీసి మేడ మీద నుంచి కిందకి పడేస్తాడు రాజ్. చిట్టి వెళ్ళిపోయిన తర్వాత పరుపు తీసుకుందామని కిందకు చూస్తే పరుపు కింద వాళ్ళ బాబాయ్ స్పృహ తప్పి పడిపోయి ఉంటాడు.