- Home
- Entertainment
- Brahmamudi: వస్తూనే ఇంట్లోవాళ్ళకి గొడవలు పెట్టేసిన అనామిక.. భర్త ప్రవర్తనకి కారణం తెలుసుకొని కావ్య కన్నీరు!
Brahmamudi: వస్తూనే ఇంట్లోవాళ్ళకి గొడవలు పెట్టేసిన అనామిక.. భర్త ప్రవర్తనకి కారణం తెలుసుకొని కావ్య కన్నీరు!
Brahmamudi: స్టార్ మా లో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ మంచి టిఆర్పి రేటింగ్ తో టాప్ సీరియల్స్ కి గట్టి పోటీని ఇస్తుంది. భర్త ప్రవర్తనకి కారణం తెలుసుకొని కన్నీరు పెట్టుకుంటున్న ఒక భార్య కథ ఈ సీరియల్. ఇక ఈరోజు అక్టోబర్ 4 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.
- FB
- TW
- Linkdin
Follow Us
)
ఎపిసోడ్ ప్రారంభంలో ఇంటికి వచ్చిన కనకం దంపతులు కావ్యని చూసి ఆనంద పడుతూ ఉంటారు. ఏంటి ఈరోజు కనకం మొహం వెలిగిపోతుంది అప్పులు తీరిపోతున్నందుకా అని వెటకారంగా అడుగుతుంది రుద్రాణి. కాదు అందరితో కలిసి పండగ చేసుకుంటున్నందుకు అంటాడు కృష్ణమూర్తి. అల్లుడు దగ్గరికి వెళ్లి మేము ఈరోజు ఇలా ఇక్కడికి వచ్చామంటే అందుకు కారణం మీరే అని చెప్పి రాజ్ కి కృతజ్ఞతలు చెప్తాడు కృష్ణమూర్తి.
ఇందులో ఏముంది, కావ్యకి తల్లిదండ్రులైతే నాకు కూడా తల్లిదండ్రులే కదా అంటాడు రాజ్. ఆ మాటలకి ఆనందపడిన కృష్ణమూర్తి సీతారామయ్య దగ్గరికి వెళ్లి ఒక రాజు పుట్టుకతోనే రాజు కాలేడు ప్రజల కష్ట సుఖాలను తెలుసుకున్నప్పుడే రాజు అవుతాడు. ఇప్పుడు మీ మనవడు అదే పని చేస్తున్నాడు అంటూ ఆనందంగా చెప్తాడు. ఇంతలో అనామిక వాళ్ళు రావడం గమనించిన కళ్యాణ్ కావ్యకి సైగ చేస్తాడు. ఆమె వాళ్ళని వెళ్లి రిసీవ్ చేసుకుంటుంది.
సీతారామయ్య వాళ్లకి అనామిక పేరెంట్స్ ని పరిచయం చేసి మీతో మాట్లాడటానికి వచ్చారు అని చెప్తుంది. రండి అని చెప్పి అందరూ హాల్లో కూర్చుంటారు. మౌనంగా ఉన్న కళ్యాణ్, అనామికలని చూసి ఎవరో ఒకరు మాట్లాడండి అంటాడు సుభాష్. ఈ ప్లాన్ నాది కాదు తనదే తనే మాట్లాడుతుంది అంటాడు కళ్యాణ్. మీరు కూడా మెచ్చుకున్నారు కదా మీరే మాట్లాడండి అంటుంది అనామిక. మా తమ్ముడు ఏవో పిచ్చి కవితలు రాస్తున్నాడు అనుకున్నాం.
కానీ ఆ కవితలలోనే ప్రేమను పండించి ఇంటి వరకు తీసుకు వస్తాడు అనుకోలేదు అని తమ్ముడుని ఆటపట్టిస్తాడు రాజ్. కళ్యాణ్ మాటలు విన్న అనామిక తండ్రి వాళ్ళు ఏం మాట్లాడతారు కానీ నేను చెప్తాను అని ఇలా అంటాడు. మా అమ్మాయి మీ అబ్బాయి ప్రేమించుకున్నారు ఆ విషయమే మీతో మాట్లాడదామని వచ్చాను అంటాడు. అప్పుడు రుద్రాణి కలగజేసుకొని ప్రేమ దేముంది వయసు వచ్చిన ప్రతి వాళ్ళు ఇప్పుడు ప్రేమిస్తున్నారు.
మీ అమ్మాయి మా ఇంటి కోడలు కావాలంటే మీకున్న అర్హతలు ఏమిటి అని అడుగుతుంది. ఏమి లేని ఇంటి నుంచి కోడల్ని తెచ్చుకున్నారని విన్నాము. ఆ ధైర్యంతోనే ఇంతవరకు వచ్చాము. అయినా మీ అంత కాదు గాని మేము కూడా బాగానే సంపాదించాము అంటుంది అనామిక తల్లి. అవును మీరు విన్నది నిజమే ఆ వియ్యంకులు వాళ్లే అని కృష్ణమూర్తి వాళ్ళని చూపిస్తుంది రుద్రాణి. వాళ్ళు మట్టి బొమ్మను చేసి రంగులు వేసుకుంటారు అని వెటకారంగా మాట్లాడుతుంది.
నిజమే వాళ్లే మా వియ్యంకులు బొమ్మలు చేసుకుని రంగులు వేసుకుంటారు కానీ ముఖానికి రంగు వేసుకుని మనసులో ఒకలా బయట ఒకలాగా మాట్లాడరు అని వాళ్ళని వెనకేసుకొస్తాడు సుభాష్. మా సంబంధం రుద్రాణి గారికి నచ్చలేదేమో అంటుంది అనామిక తల్లి. అలాంటిదేమీ లేదు మా రుద్రాణి ఎప్పుడూ ప్రాక్టికల్స్ జోక్స్ వేస్తుంది. అయినా ఇంట్లో నిర్ణయం తీసుకోవాల్సింది మా తల్లిదండ్రులు అని సీతారామయ్య వైపు చూస్తాడు సుభాష్.
మేం పెద్దవాళ్ల మీద అయినా కన్న తల్లిదండ్రులుగా నిర్ణయం తీసుకోవాల్సింది ధాన్యలక్ష్మి వాళ్ళు అనడంతో వాళ్లు కళ్యాణ్ ఇష్టమే మా ఇష్టం అనటంతో అందరూ ఆనందపడతారు. సరే పెళ్లి ఖాయం అయిపోయింది కదా ఇప్పుడు పూజ ప్రారంభిద్దాం అంటాడు సీతారామయ్య. మేం రెడీ అని సుభాష్ వాళ్ళు అంటారు. మేము ఊరుకోము పొద్దున్నే లేచి అన్ని పనులు చేస్తే పూజ మాత్రం మీరు చేస్తారా పూజ కూడా మా ఆడవాళ్ళే చేయాలి అని రెవల్యూషన్ తీసుకువస్తుంది అనామిక.
ఆమెకి ఇంట్లో ఆడవాళ్ళందరూ సపోర్ట్ చేస్తారు. మేము ఫ్రీడమ్ ఫైటర్స్ వారసులం, మేము మాత్రం తక్కువా మేమే పూజ చేస్తాం అంటారు మగవాళ్ళు. అయితే ఒక పోటీ పెడతాను ఎవరు గెలిస్తే వాళ్ళే పూజ చేద్దురుగాని అని చెప్పి అందర్నీ బయటకు తీసుకువెళ్తాడు సీతారామయ్య. ఇదంతా చూస్తున్న రుద్రాణి ఇంట్లోకి రాకముందే ఇంత రెవల్యూషన్ తీసుకువచ్చింది, ఇక ఇంట్లోకి వస్తే ఇంకెన్ని గొడవలు వస్తాయో అని కొడుకుతో చెప్తుంది రుద్రాణి.
కళ్యాణ్ కి నోట్లో నాలుక లేదు, అనామికకి అసలు సహనమే లేదు భలే కుదిరారు ఇద్దరూ అంటాడు రాహుల్. అందరూ బయటకు వెళ్లిన తర్వాత కావ్య భర్త చీటీ తీయాలని ప్రయత్నిస్తుంది కానీ కనకం వచ్చి అలా చేయడం తప్పు నీ భర్త కోరిక నెరవేరదు అని చెప్పి అక్కడినుంచి తీసుకొని వెళ్ళిపోతుంది. ఆ తర్వాత సీతారామయ్య టగ్ ఆఫ్ వార్ పెడతాడు. అందులో మగవాళ్ళు గెలుస్తారు. ఈ గేమ్ మేము ఒప్పుకోము మగవాళ్ళకి బలం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్లే గెలుస్తారు అంటారు ఆడవాళ్లు.
ఆడవాళ్ళ గొప్పా,మగవాళ్ళు గొప్పా అనే సమస్య కి ఆనాటి నుంచి సమాధానం దొరకలేదు అంటాడు సీతారామయ్య. మరి దీనికి పరిష్కారం లేదా అంటాడు సుభాష్. ఆడ మగ కలిస్తేనే జీవితానికి పరిపూర్ణత అందుకే జంటలుగా విడిపోయి పోటీ చేయండి ఏ జంట గెలిస్తే ఆ జంట పూజ చేయొచ్చు అని చెప్తుంది చిట్టి. అప్పుడు ఆర్చరీ గేమ్ ఏర్పాటు చేస్తారు. తరువాయి భాగంలో భర్త మనసులో ఏముందో చీటీ ద్వారా తెలుసుకొని కన్నీరు పెట్టుకుంటుంది కావ్య.