Brahmamudi: నిజం తెలిసి షాకైన రుద్రాణి.. భయంతో వణికిపోతున్న కావ్య!
Brahmamudi: స్టార్ మా లో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ మంచి కథ కథనాలతో మంచి టిఆర్పి రేటింగ్ ని సంపాదించుకుంటుంది. కోడలి బండారం బయటపడటంతో షాకైన ఒక అత్త కథ ఈ సీరియల్. ఇక ఈరోజు అక్టోబర్ 28 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.
ఈరోజు ఎపిసోడ్ లో నిద్రలేపి తను ఆరోగ్యం గురించి అడుగుతున్న రాహుల్ మీద చిరాకు పడుతుంది స్వప్న. నన్ను డిస్టర్బ్ చేయకుండా పడుకో అని చెప్పి తను పడుకుండిపోతుంది. దేవుడు దీనిని ఏ పదార్థంతో తయారుచేసాడో విషాన్ని కూడా అరిగించేసుకుంటుంది అని తిట్టుకొని తను కూడా పడుకుంటాడు రాహుల్. లోపలి నుంచి అరుపులు కేకలు వినిపించడం లేదు అని స్వప్న గది బయటే తిరుగుతూ ఉంటుంది రుద్రాణి.
ఏం జరుగుతుందో అని తలుపుకు చెవులు ఆనించి వింటుంది. అంతలో అక్కడికి వచ్చింది కనకం మీకు ఇదేం పాడు బుద్ధి అంటుంది. నాకు ఎలాంటి పాడుబుద్దులు లేవు ఇందాక గొడవ పడ్డారు కదా అందుకే లోపల మళ్ళీ గొడవపడుతున్నారేమో అని చూస్తున్నాను అంటుంది. బాగానే కవర్ చేసుకున్నారు గాని రండి పడుకుందాం అని రుద్రాణిని లాక్కుపోతుంది కనకం. మరుసటి రోజు పొద్దున్నే స్నానం చేసి వచ్చిన కావ్య నిద్రపోతున్న భర్తని చూసి అతనితో సెల్ఫీ తీయడం కోసం ప్రయత్నిస్తుంది.
అయితే ఆమె తడి తల తగ్గటం వలన డిస్టర్బ్ అవుతాడు రాజ్. లేచిపోతాడేమో అనుకొని ఫోన్ అక్కడ పెట్టేసి వెళ్లి తల తుడుచుకుంటూ ఉంటుంది కావ్య. మెలకువ వచ్చిన రాజ్ కావ్యని అలా చూసి టెంప్ట్ అవుతాడు. లోపలి నుంచి అంతరాత్మ బయటకు వచ్చి ఆమెని హగ్ చేసుకోవటానికి వెళ్తాడు. తను నా భార్య నువ్వు ఎవరివి హగ్ చేసుకోవడానికి అంటూ అంతరాత్మని పట్టుకునే క్రమంలో కావ్యని హగ్ చేసుకుంటాడు రాజ్.
వాళ్ళిద్దరూ అలా ఉండగా అక్కడికి వచ్చిన ధాన్యలక్ష్మి కావ్యని పిలుస్తుంది. కానీ వాళ్ళిద్దర్నీ అలా చూసి అక్కడే ఉండిపోతుంది. రాజ్ సిగ్గుపడి పక్కకి తప్పుకుంటాడు. సిగ్గు పడుతున్న కావ్యని కింద సీమంతం పనులు ప్రారంభించాలి రా అని చెప్పి వెళ్ళిపోతుంది ధాన్యలక్ష్మి. కావ్య కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అప్పుడు అంతరాత్మ నువ్వు ఎవరినైనా బురిడి కొట్టించగలవు కానీ నన్ను బురిడీ కొట్టించలేవు, నువ్వు ఆమెని ప్రేమిస్తున్నావు అంటాడు.
మరోవైపు స్వప్న గది బయట వెయిట్ చేస్తూ ఉంటుంది రుద్రాణి. ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వనందుకు కొడుకుని తిట్టుకుంటుంది. ఇంతలో కనకం రావటం చూసి మళ్ళీ ఏమైనా అంటుంది అనుకొని చీపురు పట్టుకుని తుడుస్తుంది. ఆవిడని అలా చూసి ఆశ్చర్య పోతుంది కనకం. మన గదిలో కూడా చెత్త ఎక్కువగా ఉంది అంటుంది. ఇంతలో రాహుల్ బయటికి రావడం చూసిన రుద్రాణి నేను క్లీన్ చేస్తాలే గాని వెళ్లి నీ పని నువ్వు చేసుకో అంటుంది.
రుద్రాణిని ఆశ్చర్యంగా చూస్తూ అక్కడినుంచి వెళ్ళిపోతుంది కనకం. ఆ తర్వాత కొడుకుని ఏం జరిగింది అని అడుగుతుంది. ఏమీ జరగలేదు స్లీపింగ్ టాబ్లెట్ వేసినట్లుగా పడుకుంది. మీ డాక్టర్ ఏవో చీప్ టాబ్లెట్స్ రాసి ఉంటుంది వెళ్లి అడుగు అంటాడు రాహుల్. మరోవైపు భర్తకి కొత్త డ్రెస్ ఇస్తుంది కావ్య. నా దగ్గర చాలా ఉన్నాయి కదా అంటాడు రాజ్. కానీ మనిద్దరం ఒకలాంటి డ్రెస్సే వేసుకోవాలి అనిపించింది అందుకే తీసుకున్నాను.
మీకు నచ్చితేనే వేసుకోండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కావ్య. మరోవైపు రుద్రాణి డాక్టర్ కి ఫోన్ చేసి జరిగిందంతా చెప్తుంది. నేను ఇచ్చిన టాబ్లెట్స్ చాలా పవర్ఫుల్ వేసుకుంటే కచ్చితంగా అబార్షన్ అయి తీరుతుంది, లేదంటే మీ కోడలికి కడుపు లేకపోయి అయినా ఉండాలి అంటుంది డాక్టర్.ఆ మాటలకి షాక్ అవుతుంది రుద్రాణి. ఎవరు అబద్ధం చెబుతున్నారో అర్థం కావడం లేదు అనుకుంటుంది. మరోవైపు కృష్ణమూర్తి వాళ్ళు కావ్య వాళ్ళ ఇంటికి వస్తారు.
తరువాయి భాగంలో శృతి తీసుకొచ్చిన డిజైన్స్ చూసి డిజైన్ చాలా బాగుంది నేను ఆ డిజైనర్ని అప్రిషియేట్ చేస్తాను ఫోన్ చెయ్యు అంటాడు రాజ్. కంగారు పడుతూనే శృతి కావ్య కి ఫోన్ చేస్తుంది. శిరీష నిన్ను సార్ అప్రిషియేట్ చేస్తారంట అంటుంది శృతి. శృతి మాటలను బట్టి రాజ్ అక్కడ ఉన్నాడని అర్థం చేసుకుంటుంది కావ్య. శృతి దగ్గర నుంచి ఫోన్ తీసుకున్న రాజ్ శిరీష గారు కంగ్రాట్స్ అని వెటకారంగా చెప్తాడు. కంగారుపడుతుంది కావ్య.
ఇంత లేటుగా వచ్చారేమీ అని మందలిస్తుంది కనకం. మీ అక్క సీమంతానికి అన్ని దగ్గరుండి నువ్వే చేయాలి కదా అని అప్పుని మందలిస్తుంది.అప్పుడే వచ్చిన కావ్య మొన్నలా మధ్యలోనే వెళ్లిపోకు, నువ్వు చాలా పనులు చేయాలి అంటుంది. అలాగే అక్క నువ్వు చెప్తూ ఉండు, నేను చేస్తూ ఉంటాను అంటుంది అప్పు. ఇంతలో రాజ్ కోసం డ్రెస్ కొనిపెట్టాను అని చెప్పి కొత్త డ్రెస్ రాజు చేతిలో పెట్టి సాయంత్రం వేసుకో అని చెప్తుంది అపర్ణ. భార్య వైపు బాధగా చూస్తాడు రాజ్.
ఆ డ్రెస్ ఎక్కడ వేసుకోను అంటారో అని చెప్పి ఈ డ్రెస్ మీకు చాలా బాగుంటుంది అండి వేసుకోండి అంటుంది కావ్య. నువ్వేమీ రికమండేషన్ చేయక్కర్లేదు అంటుంది అపర్ణ. రుద్రాణిని పిలిచి గుడికి వెళ్లి అమ్మవారి కుంకుమ తీసుకు రమ్మన్నాను తీసుకువచ్చావా అని అడుగుతుంది అపర్ణ. స్వప్న గోల లో పడి వెళ్ళటం మర్చిపోయాను అలా అంటే మళ్ళీ నాకు బాధ్యత లేదు అని తిట్టుకుంటారు అని చెప్పి కావ్య నీకు చెప్పాను కదా..
వెళ్లి కుంకుమ తీసుకొచ్చావా అని అడుగుతుంది రుద్రాణి. మీరు నాకు చెప్పలేదు, నేను ఇప్పుడే గదిలోంచి వస్తున్నాను అంటుంది కావ్య. తరువాయి భాగంలో ఒకవైపు స్వప్నకి సీమంతం అవుతూ ఉంటుంది మరొకవైపు డాక్టర్ రుద్రాణి తో మీ కోడలికి కడుపు లేదు ఆ డాక్టర్ ఫేక్ రిపోర్ట్ ఇచ్చింది అని చెప్తుంది ఆమె ఫ్రెండ్. నువ్వు ఇంటికి వచ్చి స్వప్నకి కడుపు లేదని చెప్పాలి అంటుంది రుద్రాణి. ఆ మాటలు విన్న కావ్య భయంతో వణికి పోతుంది.