- Home
- Entertainment
- Karthika Deepam: మందు తాగి డ్యాన్స్ చేసిన వంటలక్క.. చనిపోయేముందు సంబరాలు అంటే ఇవే!
Karthika Deepam: మందు తాగి డ్యాన్స్ చేసిన వంటలక్క.. చనిపోయేముందు సంబరాలు అంటే ఇవే!
Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమయ్యే కార్తీకదీపం (Karthika Deepam) సీరియల్ మంచి కుటుంబ కథతో ప్రసారం అవుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.

Karthika Deepam
ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. దీప, కార్తీక్ (Karthik) తో కలిసి రెండు పెగ్గుల మందు వేసి వచ్చీరాని ఇంగ్లీషు తో హడావిడి చేస్తుంది. ఇక మందు వేసిన క్రమంలో ఇద్దరూ ఒకరికొకరు పొగుడుకుంటూ చిల్ అవుతూ ఉంటారు.
Karthika Deepam
ఇక దీప (Deepa) ఇంకో పెగ్గు పోయి అని కార్తీక్ తో అంటుంది. దాంతో కార్తీక్ ఫన్నీ గా స్టన్ అవుతాడు. ఈ క్రమంలో కార్తీక్ (Karthika) నీకు బాగా మందు ఎక్కువైంది అని దీపని అంటాడు. దాంతో దీప (Deepa).. ఊరికే ముందు ఎక్కువైందని అరవకురా.. అని మందుమత్తులో అనేస్తుంది.
Karthika Deepam
మరోవైపు కార్తీక్ ఫ్యామిలీ చిక్ మంగళూరు వెళ్లిన సంగతి తెలిసి మోనిత ఎంతో జలసీ గా ఫీల్ అవుతుంది. అంతేకాకుండా నువ్వెక్కడుంటే నేను అక్కడ ఉండాలి కదా అని మోనిత కార్తీక్ (Karthik) గురించి మనసులో అనుకుంటుంది.
Karthika Deepam
ఇక దీప (Deepa), చీర మార్చి ప్యాంట్ వేసుకొని మంచి ఫాస్ట్గా రెడీ అవుతుంది. ఇక అది చూసిన పిల్లలు అమ్మా నువు ఫ్యాంట్ వేసుకున్నావా అంటూ ఆశ్చర్యపోతారు. ఇక హిమ, సౌర్య (Sourya) లు ఒకరి పేర్లు ఒకరు పచ్చబొట్టు పొడిపుంచుకుంటారు.
Karthika Deepam
ఇక తర్వాత దీప (Deepa) మావా.. ఏక్ పెగ్ లా సాంగ్ కి ఒక రేంజ్ లో ఊగిపోతుంది. అది చూసిన పిల్లలు ఎంతో ఆనందంగా ఫీల్ అయ్యి వాళ్లు కూడా డాన్స్ చేస్తారు. ఈ క్రమంలో దీప, కార్తీక్ (Karthik) కి తెగ ముద్దులు పెట్టేస్తుంది.
Karthika Deepam
ఇక డాన్స్ చేసి చేసి.. దీప (Deepa) మత్తు మైకంలో కింద పడిపోతుంది. ఇక పొద్దున్నే దీప పడుకొని ఉండగా కార్తీక్, దీప నైట్ చేసిన హడావిడి గుర్తు తెచ్చుకొని జన్మ ధన్యమైంది అని అనుకుంటాడు. లేకపోతే మన ఇద్దరం కలిసి మందు కొట్టడం ఏమిటి? డాన్స్ చేయడం ఏమిటి? అంటూ కార్తీక్ (Karthik) నవ్వుకుంటాడు.
Karthika Deepam
రేపటి భాగంలో హిమ (Hima) కారు డ్రైవ్ చేయగా.. కారు ప్రమాదంలో పూర్తిగా బ్లాస్ట్ అవుతుంది. దాంతో ముగ్గురు చనిపోతారు. సౌర్య (Sourya) మాత్రమే ప్రాణాలతో మిగులుతుంది. ఇక ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలి అంటే రేపటి వరకు వేచి ఉండాల్సిందే.