వామ్మో! కార్తీకదీపం వంటలక్క ఒక్క రోజు రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
Premi Viswanath: కార్తీకదీపం సీరియల్ ఫేమ్ ప్రేమి విశ్వనాథ్ అలియాస్ వంటలక్క ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. ఒక్కో ఎపిసోడ్ లో నటించడానికి ఎంత పారితోషికం తీసుకున్నారు?

కార్తీకదీపం వంటలక్క రెమ్యునరేషన్ ?
బుల్లితెర నటి ప్రేమి విశ్వనాథ్ (Premi Vishwanath) అంటే గుర్తు పట్టడం కష్టమే. కానీ, కార్తీకదీపం (Karthika Deepam) వంటలక్క (Vantalakka)అంటే మాత్రం తెలుగు ప్రేక్షకులు ఇట్టే గుర్తుపడతారు. స్టార్ మా లో ప్రసారమైన కార్తీక దీపం సీరియల్‌తో ప్రేమి విశ్వనాథ్ విపరీతమైన పాపులారిటీని సంపాదించుకుంది.
తెలుగు రాష్ట్రాల్లో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుంది. తాజాగా ప్రేమి విశ్వనాథ్ ‘కార్తీకదీపం 2 - ఇది నవ వసంతం’ సీరియల్‌తో రీఎంట్రీ ఇచ్చింది. అయితే.. ప్రేమి విశ్వనాథ్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందనేది టెలివిజన్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్.
కార్తీక దీపంలో ఓ సెన్సేషన్
తెలుగు టెలివిజన్ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన సీరియల్ కార్తీక దీపం. ఈ సీరియల్ రంగంలో సృష్టించిన ప్రభంజనం గురించి చెప్పక్కర్లేదు. 2017లో మొదలైన ఈ సీరియల్ దాదాపు 7 సంవత్సరాలపాటు అంటే.. 1569 ఎపిసోడ్స్ కొనసాగింది. దీని బట్టి ఈ సీరియల్ కు ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇందులో నిరుపం పరిటాల (కార్తీక్ బాబు), ప్రేమీ విశ్వనాథ్ (దీపా/వంటలక్క) ప్రధాన పాత్రలు పోషించారు. డ్రామా, ఫ్యామిలీ ఎమోషన్స్ కలగలిసిన ఈ సీరియల్ రికార్డులు సృష్టించింది. ఆ రెస్పాన్స్ బట్టి కార్తీక దీపం 2 సీరియల్ ను రన్ చేస్తున్నారు. ఈ సీక్వెల్ దాదాపు అందరూ పాతవారే.
ప్రేమీ విశ్వనాథ్ వ్యక్తిగత జీవితం
ప్రేమీ విశ్వనాథ్ కేరళలో జన్మించారు. ఆమె భర్త వినీత్ భట్ ప్రముఖ జ్యోతిష్కుడు. మలయాళ స్టార్ హీరో జయసూర్య ఆమె బంధువు. ప్రేమీకి ఒక కొడుకు కూడా ఉన్నాడు. కుటుంబంతో కలిసి ఆమె ఆనందంగా జీవిస్తోంది. ఈ అమ్మడు 2014లో మలయాళ సీరియల్ ‘కరుతముత్తు’తో యాక్టింగ్ డెబ్యూ చేసింది. తర్వాత పలు మలయాళ సీరియల్స్‌లో నటించింది.
2017లో కార్తీక దీపం సీరియల్ తో తెలుగులో అడుగుపెట్టింది. తన నటనకు అదిరిపోయే రెస్పాన్స్ రాయడం, సీరియల్ హై టీఆర్పీతో దూసుకెళ్లి, సూపర్ హిట్ అయింది. గోరింటాకు, చెల్లెలి కాపురం వంటి సీరియల్స్ లో కూడా ప్రేమీ విశ్వనాథ్ నటించారు. సినిమాలవైపు కూడా అడుగుపెట్టి కస్టడీ (నాగచైతన్య), తమిళంలో సల్మాన్ 3D, మలయాళంలో ‘అకమే’ వంటి ప్రాజెక్ట్స్ చేసింది.
ప్రేమీ విశ్వనాథ్ కు టర్నింగ్ పాయింట్
కార్తీకదీపం సీరియల్ ప్రేమీ విశ్వనాథ్ కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ అనే చెప్పాలి. ఈ సీరియల్ లో వంటలక్క పాత్ర ద్వారా తెలుగు జనాలకు దగ్గరైంది ప్రేమి విశ్వనాథ్. ఈ ముద్దుగుమ్మ తన సహజమైన నటనతో అందరినీ కన్నీళ్లు పెట్టించింది. ఈ పాత్ర వల్లే ఆమె బుల్లితెరలో స్టార్ స్థాయికి చేరుకున్నారు. వంటలక్క పాత్రకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందంటే అతిశయోక్తి కాదు.
మొత్తానికి, మలయాళం నుంచి వచ్చి తెలుగులో “వంటలక్క”గా మిలియన్ హార్ట్స్ విన్ అయ్యింది. అలాగే.. ప్రేమీ విశ్వనాథ్ తన తొలి సీరియల్‌కే బెస్ట్ డెబ్యూట్ యాక్ట్రెస్ – ఏషియానెట్ అవార్డ్ గెలుచుకున్నారు. అలాగే జేసీ ఫౌండేషన్ అవార్డ్ కూడా దక్కింది. తెలుగులో కార్తీక దీపం సీరియల్‌కి “స్టార్ మా పరివార్ బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్” అందుకున్నారు.
రెమ్యూనరేషన్ సీక్రెట్
ప్రేమీ విశ్వనాథ్ నటనలో సహజత్వం, ఎమోషనల్ ఎక్స్ప్రెషన్స్, డైలాగ్ డెలివరీలో రియలిస్టిక్ టచ్ అన్నీ కలిసిపోవడంతో ఆమె పాత్రలు ప్రేక్షకుల హృదయాలను తాకుతాయి. అందుకే ఆమె పేరు కంటే “వంటలక్క” అనే పాత్ర పేరే ఎక్కువగా పాపులర్ అయింది. అందుకే ప్రస్తుతం తెలుగు టెలివిజన్‌లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే నటీమణులలో ప్రేమీ విశ్వనాథ్ టాప్ పొజిషన్ లో నిలిచింది.
వంటలక్క ఒక్క రోజు షూటింగ్‌కి సుమారు రూ. 50,000 తీసుకుంటారట. నెలలో 20–25 రోజులు షూటింగ్ చేస్తే.. ఆమె నెలకు రూ 10–12 లక్షలు వరకు సంపాదిస్తుంద. అంతేకాకుండా, కొన్ని స్పెషల్ ఈవెంట్స్, టీవీ ప్రమోషన్స్, యాడ్స్ ల్లో నటించడం ద్వారా కూడా భారీ మొత్తంలో సంపాదిస్తున్నారు.