MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • Karthika Deepam 2 Today Episode: జ్యోకు తిట్లు-శివన్నారాయణకు పోటీగా దక్షిణమూర్తి-సూరజ్ కు చెంప దెబ్బ

Karthika Deepam 2 Today Episode: జ్యోకు తిట్లు-శివన్నారాయణకు పోటీగా దక్షిణమూర్తి-సూరజ్ కు చెంప దెబ్బ

Karthika Deepam 2 Today Episode (జూలై 6వ తేదీ)లో జ్యోను శివన్నారాయణ దగ్గర ఇరికించిన సూరజ్. చివాట్లు పెట్టిన తాత. శివన్నారాయణకు పోటీగా దక్షిణమూర్తి. సూరజ్ ని దక్షిణమూర్తి ముందు చెంప దెబ్బ కొట్టిన శివన్నారాయణ. ఈ రోజు ఎపిసోడ్ లో ఇంకా ఏం జరిగిందంటే.. 

3 Min read
Author : Kavitha G
Published : Jul 06 2026, 10:29 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్
Image Credit : Jiohotstar

కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్

కార్తీక దీపం 2 సీరియల్ సోమవారం ఎపిసోడ్ లో హాయ్ డియర్ అంటూ జ్యోత్స్న దగ్గరకు వస్తాడు సూరజ్. నా పని అయిపోయింది, నేను వెళ్తున్నాను. పని కంప్లీట్ చేసుకొని రా అని చెప్తాడు. నాకు హెల్ప్ చేయవా అని క్యూట్ గా అడుగుతుంది జ్యోత్స్న. చేయను అంటాడు సూరజ్. మా తాతతో చెప్తాను అంటుంది జ్యోత్స్న. మీ తాత మీద గౌరవంతో నీకు హెల్ప్ చేయడానికి ఒప్పుకుంటున్నాను అని వర్క్ చేయడం స్టార్ట్ చేస్తాడు సూరజ్. జ్యో ఫోన్ లో రీల్స్ చూస్తూ టైంపాస్ చేస్తుంది. అది చూసిన సూరజ్ నీకు ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు అని మనసులో అనుకుంటాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
జ్యోకు చివాట్లు
Image Credit : Jiohotstar

జ్యోకు చివాట్లు

మరుసటి రోజు ఉదయం ఫైల్స్, శివన్నారాయణకు ఇస్తుంది జ్యోత్స్న. ఫైల్స్ చూసి జ్యోపై సీరియస్ అవుతాడు శివన్నారాయణ. ఈ తప్పులన్నీ ఏంటి.. నీకు అసిస్టెంట్ గా పని చేయడం కూడా చేతకాదా అంటూ చివాట్లు పెడతాడు. ఏమైందండీ అని అడుగుతుంది పారు. నువ్వెళ్లి కాఫీ తీసుకురా అని చెప్తాడు శివన్నారాయణ. పారు కాఫీ తేగానే.. దీపకు ఇవ్వమని చెప్తాడు. మీకెందుకు శ్రమ అంటుంది దీప. 

పారు కనీసం కాఫీ ఇచ్చేందుకైనా పనికొస్తుంది. ఈ జ్యోత్స్న ఎందుకు పనికొస్తుందో కూడా అర్థం కావట్లేదు అంటాడు శివన్నారాయణ. వర్క్ చేశాక చెక్ చేసుకోవాలి కదా.. అంటాడు శివన్నారాయణ. నేను కూడా అదే చెప్పానండి అంటూ లోపలికి వస్తాడు సూరజ్. ఫైల్స్ చెక్ చేద్దామంటే తను వినలేదు అని శివన్నారాయణ దగ్గర జ్యోని ఇరికిస్తాడు సూరజ్. ఈ తప్పులన్నీ సరిచేయమని చెప్తాడు శివన్నారాయణ.

Related Articles

Related image1
Karthika Deepam 2 Today Episode: సూరజ్, జ్యోల ముద్దు గోల- ద‌క్షిణమూర్తితో సూరజ్- శివన్నారాయణ డౌట్
Related image2
Karthika Deepam 2 Today Episode: జ్యోతో ఆడుకున్న శౌర్య-ఇరుక్కున్న పారు-సూరజ్ గురించి కార్తీక్ ఆరా
36
సూరజ్, జ్యో గొడవ
Image Credit : Jiohotstar

సూరజ్, జ్యో గొడవ

బయటకు వెళ్లిన జ్యోత్స్న, సూరజ్ తో గొడవ పడుతుంది. నువ్వు కావాలనే తప్పులు చేశావ్ కదరా అని అడుగుతుంది. పని మానేసి రీల్స్ చూస్తూ కూర్చుంటే రిజల్ట్ ఇలాగే ఉంటుంది అంటాడు సూరజ్. కోపంగా అరుస్తుంది జ్యోత్స్న. అరిస్తే పోయేది నీ పరువే. పని చూస్కో అని చెప్పి వెళ్లిపోతాడు సూరజ్. నీకు ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసురా అని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న.

46
పారును ఆటపట్టించిన కార్తీక్
Image Credit : Jiohotstar

పారును ఆటపట్టించిన కార్తీక్

మరోవైపు ఇళ్లు తుడుస్తుంటుంది పారు. వీడియో తీస్తుంటాడు కార్తీక్. ఏంట్రా ఎప్పుడైనా మంచిగా రెడీ అయినప్పుడు ఫోటో తీశావా.. ఇప్పుడెందుకు తీస్తున్నావు అంటుంది పారు. కాసేపు ఆటపట్టిస్తాడు కార్తీక్. ఇంతలో ఒకతను వచ్చి శివన్నారాయణ గారు ఉన్నారా.. రెస్టారెంట్ ఓనర్లు వారిని కలవాలి అనుకుంటున్నారు అని చెప్తాడు. ఆ తర్వాత వాళ్లందరూ వచ్చి కూర్చొంటారు. 

56
శివన్నారాయణకు పోటీగా దక్షిణమూర్తి
Image Credit : Jiohotstar

శివన్నారాయణకు పోటీగా దక్షిణమూర్తి

దీపను అందరికీ పరిచయం చేస్తాడు శివన్నారాయణ. ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా బెస్ట్ రెస్టారెంట్ ఆఫ్ ది ఇయర్ కాంపిటీషన్ పెడుతున్నాం. ఈ పోటీలో ఓ కొత్త రెస్టారెంట్ పోటీకి దిగుతోంది అని చెప్తాడు రెస్టారెంట్ ఓనర్స్ అసోసియేషన్ మెంబర్. ఎవరిది ఆ కొత్త రెస్టారెంట్ అని అడుగుతాడు శివన్నారాయణ. నాదే అంటూ ఎంట్రీ ఇస్తాడు దక్షిణమూర్తి. షాక్ అవుతాడు శివన్నారాయణ. 

ఆ తర్వాత తనని తాను పరిచయం చేసుకుంటాడు దక్షిణమూర్తి. కొత్తగా రెస్టారెంట్స్ ఓపెన్ చేశాను. ఈ పోటీలో గెలిస్తే మా రెస్టారెంట్స్ గురించి అందరికీ తెలుస్తుంది అని చెప్తాడు దక్షిణమూర్తి. కౌంటర్ ఇస్తాడు శివన్నారయణ. దక్షిణమూర్తి ఎవ్వరికోసమే వెతుకున్నట్లు చూస్తాడు. అది గమనించిన శివన్నారాయణ.. సూరజ్ కోసమేమో అని డౌట్ పడతాడు. ఆ తర్వాత అక్కడికి వచ్చిన అందరూ వెళ్లిపోతారు. దక్షిణమూర్తిని మాత్రం ఆగమని చెప్తాడు శివన్నారాయణ.

66
సూరజ్ కి చెంప దెబ్బ
Image Credit : Jiohotstar

సూరజ్ కి చెంప దెబ్బ

సూరజ్ ని పిలుచుకురమ్మని కార్తీక్ తో చెప్తాడు శివన్నారాయణ. కార్తీక్ వెళ్లి సూరజ్ ని పిలుచుకురాగానే దక్షిణమూర్తి ముందు సూరజ్ ని చెంప మీద లాగిపెట్టి కొడతాడు శివన్నారాయణ. అంతా షాక్ అవుతారు. దక్షిణమూర్తి ఎక్స్ ప్రెషన్స్ ని గమనిస్తుంటాడు శివన్నారాయణ. కానీ దక్షిణామూర్తి నార్మల్ గానే ఉంటాడు. ఆ తర్వాత దక్షిణమూర్తి వెళ్లిపోతాడు. సూరజ్ ని ఎందుకు కొట్టావని కార్తీక్ అడిగితే.. నాకు తెలుసు బ్రదర్ అంటాడు సూరజ్. ఎందుకు అని అడిగితే, నా మీద అనుమానం తీర్చుకోవడానికి నన్ను కొట్టారు అని చెప్తాడు.

అదేంటీ అంటాడు కార్తీక్. ఇప్పుడు వచ్చిన పెద్ద మనిషి నన్ను కొడితే ఎలా రియాక్టవుతారో చూద్దామనుకున్నారు. అంతేనా ఛైర్మన్ గారు అని అడుగుతాడు సూరజ్. అవును, సూరజ్.. ఇప్పుడు నా అనుమానం తీరిపోయింది.. కానీ నేను నా అనుకున్నవాళ్ల మీదే చేయి ఎత్తుత అని చెప్తాడు శివన్నారాయణ. మీరు నన్ను మీ మనిషి అన్నారు అది చాలు అని అక్కడినుంచి వెళ్లిపోతాడు సూరజ్. వీడితో కాస్త జాగ్రత్తగా ఉండాలి అనుకుంటారు జ్యోత్స్న, పారు. అంతటితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
వినోదం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Epic Movie: వైష్ణవిని తీసుకున్నది నాగవంశీనే, నా ఛాయిస్‌ ఆనంద్‌ మాత్రమే.. `ఎపిక్‌`లో అవి కూడా చూపించాం
Recommended image2
Movie Interval : సినిమా మధ్యలో ఇంటర్వెల్ ఎందుకు ఇస్తారు? దీని వెనుక పెద్ద కథే ఉంది!
Recommended image3
New Film Opening: విలేజ్‌లో హర్రర్‌ కథ.. కమిటీ కుర్రోడు సరికొత్త మూవీ.. డైరెక్టర్‌ ఎవరంటే?
Related Stories
Recommended image1
Karthika Deepam 2 Today Episode: సూరజ్, జ్యోల ముద్దు గోల- ద‌క్షిణమూర్తితో సూరజ్- శివన్నారాయణ డౌట్
Recommended image2
Karthika Deepam 2 Today Episode: జ్యోతో ఆడుకున్న శౌర్య-ఇరుక్కున్న పారు-సూరజ్ గురించి కార్తీక్ ఆరా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved