MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • Karthika Deepam 2 Today Episode: జ్యోతో ఆడుకున్న శౌర్య-ఇరుక్కున్న పారు-సూరజ్ గురించి కార్తీక్ ఆరా

Karthika Deepam 2 Today Episode: జ్యోతో ఆడుకున్న శౌర్య-ఇరుక్కున్న పారు-సూరజ్ గురించి కార్తీక్ ఆరా

Karthika Deepam 2 Today Episode (జూలై 4వ తేదీ)లో దక్షిణ మూర్తితో ఎందుకు మాట్లాడవని సూరజ్ ని నిలదీసిన శివన్నారాయణ. శౌర్యకు ట్యూషన్ టీచర్ గా జ్యో. ఓ ఆట ఆడుకున్న శౌర్య. సూరజ్ ఫ్యామిలీ గురించి ఆరా తీసిన కార్తీక్. ఈ రోజు ఎపిసోడ్ లో ఇంకా ఏం జరిగిందంటే.. 

2 Min read
Author : Kavitha G
Published : Jul 04 2026, 10:31 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్
Image Credit : Jiohotstar

కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్

కార్తీక దీపం 2 సీరియల్ శుక్రవారం ఎపిసోడ్ లో దక్షిణ మూర్తితో సూరజ్ మాట్లాడడాన్ని చూసి నువ్వు దక్షిణ మూర్తి మనిషివా అని అడుగుతాడు శివన్నారాయణ. దక్షిణ మూర్తి అంటే ఎవరని అడుగుతాడు సూరజ్. ఎవరో తెలియకుండానే నువ్వు ఇప్పటివరకు మాట్లాడావా.. అంటాడు శివన్నారాయణ. నిజంగా అతనెవరో నాకు తెలియదు. మీ ఫ్యామిలీ గురించి అడిగాడు. నేను చెప్పలేదు అంటాడు సూరజ్. సరే ఇంకెప్పుడు తనతో మాట్లాడకు అంటాడు శివన్నారాయణ. ఎందుకు అని సూరజ్ అడిగితే.. మాట్లాడొద్దని చెప్పానుగా మాట్లాడకు అని సీరియస్ అవుతాడు శివన్నారాయణ. సూరజ్ ని పక్కకు పిలిచి నేను తర్వాత చెప్తాను లోపలికి వెళ్లు అంటాడు కార్తీక్.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
శౌర్యకు జ్యో ట్యూషన్
Image Credit : Jiohotstar

శౌర్యకు జ్యో ట్యూషన్

ఆ తర్వాత దక్షిణ మూర్తి మాట్లాడిన మాటల గురించి ఆలోచిస్తూ ఉంటాడు శివన్నారాయణ. అంతలో శౌర్య వచ్చి పిలుస్తుంది. ఆఫీస్‌కు ఎందుకు వచ్చావ్ అని అడిగితే ప్రోగ్రెస్ కార్డు చూపిస్తుంది. మార్కులు ఇంత తక్కువ వచ్చాయేంటే అని అడుగుతాడు శివన్నారాయణ. ఐదో క్లాస్ చదివిని దీప కూతురు స్కూల్ ఫస్ట్ వస్తుందా ఏంటి అంటుంది జ్యోత్స్న. అయితే ఇకపై శౌర్యకు నువ్వే ట్యూషన్ చెప్. ఏ నోటితో శౌర్య చదువు గురించి ఎగతాళి చేశావో అదే నోటీతో శౌర్యకు ట్యూషన్ చెప్పాలి. ఇది నా ఆర్డర్ అని చెప్పి వెళ్లిపోతాడు శివన్నారాయణ.

Related Articles

Related image1
Karthika Deepam 2 Today Episode: సూరజ్, జ్యోల ముద్దు గోల- ద‌క్షిణమూర్తితో సూరజ్- శివన్నారాయణ డౌట్
Related image2
Karthika Deepam 2 Today Episode: నేనే నీ మొగుడిని అంటూ జ్యోకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన సూరజ్
36
జ్యోతో ఆడుకున్న శౌర్య
Image Credit : Jiohotstar

జ్యోతో ఆడుకున్న శౌర్య

వింత వింత ప్రశ్నలు అడిగి జ్యోత్స్నను విసిగిస్తుంది శౌర్య. అనవసరమైన విషయాల్లో వేలు పెడితే ఇలాగే ఉంటుందని జ్యోకు కౌంటర్ ఇస్తాడు కార్తీక్. అంతలో పారు వస్తుంది. ఏం చేస్తున్నారు అని అడిగితే జ్యో, నాకు ట్యూషన్ చెప్తోందని అంటుంది శౌర్య. అంతమంచి పని అది చేయదే అంటుంది పారు. సరే నువ్వు చేయమని చెప్పి పారును ఇరికించి వెళ్లిపోతుంది జ్యోత్స్న.

46
మీరే నా బంధువులు
Image Credit : Jiohotstar

మీరే నా బంధువులు

మరోవైపు సూరజ్ ఫ్యామిలీ గురించి ఆరా తీస్తారు దీప, కార్తీక్. సూరజ్ తనకు ఎవ్వరూ లేరని, ఇప్పుడు మాత్రం ఒక అన్నయ్య, వదినా ఉన్నారని, అది మీరే అని దీప, కార్తీక్ లతో చెప్తాడు. ఆ తర్వాత దక్షిణమూర్తి గురించి అడుగుతాడు. మా తాత, ఆయన బద్ధ శత్రువులు, ఆయనకు దూరంగా ఉండటం మంచిదని చెప్తాడు కార్తీక్. నా మీద అనుమానం అవసరం లేదు. మీతో ఉన్న ఈ బంధాన్ని నేను జీవితాంతం కాపాడుకుంటాను అని చెప్తాడు సూరజ్. ఏ బంధం అనుకుంటూ లోపలికి వస్తుంది జ్యోత్స్న. దీప, కార్తీక్ మా వదిన అన్నయ్య అని చెప్తాడు సూరజ్. అవసరానికి ఏర్పడే బంధాలు ఎక్కువ కాలం నిలబడవు అంటుంది జ్యోత్స్న. నీకు ఇలాంటివి అర్థం కావులే అని చెప్పి వెళ్లిపోతాడు సూరజ్. వెనకాలే దీప, కార్తీక్ కూడా వెళ్తారు.

56
పారుకు శౌర్య ట్యూషన్
Image Credit : Jiohotstar

పారుకు శౌర్య ట్యూషన్

మరోవైపు పారు పద్యాలు పాడుతూ, వాటి అర్థాలు చెప్తూ ఉంటుంది. పారిజాతం పద్యాలకు అర్థాలు తప్పుగా చెప్తే శౌర్య వాటిని సరిచేస్తూ ఉంటుంది. ఇంతలో శివన్నారాయణ అక్కడకు వచ్చి, చాలా బాగా చెప్తున్నావు శౌర్య. ఇకపై నువ్వే పారిజాతానికి ట్యూషన్ చెప్పు. అలాగైనా కొన్ని విషయాలు తెలుసుకుంటుంది అని చెప్తాడు. సరే అంటుంది శౌర్య.

66
ఇప్పటికైనా మారితే మంచిది
Image Credit : Jiohotstar

ఇప్పటికైనా మారితే మంచిది

ఇంకోవైపు పెండింగ్ ఫైల్స్ అన్నీ తీసుకొచ్చి జ్యోత్స్న టేబుల్‌ మీద పెట్టి చెక్ చేయమని చెప్తాడు కార్తీక్. నావల్ల కాదు అంటుంది జ్యోత్స్న. ఇదే మాట పెద్ద సారుతో చెప్తాను అంటాడు కార్తీక్. వద్దు బాబు.. చేస్తాను అంటుంది జ్యోత్స్న. రేపు ఉదయం లోపు ఇవ్వాలట. త్వరగా చేసెయ్ అంటాడు కార్తీక్. నువ్వు మీ ఆవిడ కలిసి నా మీద పగ తీర్చుకుంటున్నారా అంటుంది జ్యోత్స్న. 

ఒకవేళ నిజంగా పగ తీర్చుకోవాలనుకుంటే బాలరాజు గాడి గురించి సుమిత్ర అత్తకు ఎప్పుడో చెప్పేవాన్ని అంటాడు కార్తీక్. చెప్పలేదంటే మారడానికి నీకు ఓ అవకాశం ఇచ్చామని అర్థం. ఇప్పటికైనా మారితే మంచిది. లేకుంటే దీపను మీ నానమ్మ ఎక్కడ వదిలేసిందో నిన్ను అక్కడే వదిలేయాల్సి వస్తుంది అంటాడు కార్తీక్. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
వినోదం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Agnipariksha 2: రైతు బిడ్డ సింగర్‌ ఝాన్సీ సంచలనం.. బిగ్‌ బాస్‌ తెలుగు 10 ఫస్ట్ కంటెస్టెంట్‌ కన్ఫమ్‌
Recommended image2
Actor Soori: నాతో నటించడానికి హీరోయిన్లు భయపడ్డారు.. సూరి షాకింగ్ కామెంట్స్
Recommended image3
Raj Tarun: రాజ్‌ తరుణ్‌ `టార్జాయిస్‌` నుంచి అదిరిపోయే మెలోడీ.. కట్టిపడేస్తున్న `నీ పరిచయం` సాంగ్‌
Related Stories
Recommended image1
Karthika Deepam 2 Today Episode: సూరజ్, జ్యోల ముద్దు గోల- ద‌క్షిణమూర్తితో సూరజ్- శివన్నారాయణ డౌట్
Recommended image2
Karthika Deepam 2 Today Episode: నేనే నీ మొగుడిని అంటూ జ్యోకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన సూరజ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved