MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Karthika Deepam 2 Today Episode: సూరజ్, జ్యోల పూజ-వరుస కలిపిన మాలిని-దీపకు మాలిని ఆఫర్-కార్తీక్ షాక్

Karthika Deepam 2 Today Episode: సూరజ్, జ్యోల పూజ-వరుస కలిపిన మాలిని-దీపకు మాలిని ఆఫర్-కార్తీక్ షాక్

Karthika Deepam 2 Today Episode (జూలై 10వ తేదీ) లో శివన్నారాయణ ఫ్యామిలీతో వరుస కలిపి మాట్లాడిన మాలిని. భార్య భర్తలుగా శని నివారణ పూజ చేసిన సూరజ్, జ్యో. దీపకు అదిరిపోయే ఆఫర్ ఇచ్చిన మాలిని. షాక్ అయిన కార్తీక్. ఈ రోజు ఎపిసోడ్ లో ఇంకా ఏం జరిగిందంటే..

2 Min read
Author : Kavitha G
Published : Jul 10 2026, 10:25 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్
Image Credit : Jiohotstar

కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్

కార్తీక దీపం 2 సీరియల్ శుక్రవారం ఎపిసోడ్ లో శివన్నారాయణ ఫ్యామిలీ వెళ్తుంటే.. దక్షిణమూర్తి వాళ్ల దగ్గరికి వస్తాడు. నా కూతురి కోసం ఈ శాంతి హోమం ఎందుకు చేయించానో నా కూతురికి తెలియకపోయినా పర్వాలేదు. కానీ నీకు తెలియాలి శివన్నారాయణ అంటాడు దక్షిణమూర్తి. కనీసం వచ్చే జన్మలోనైనా నేను బతికినంత కాలం నా కూతురు నన్ను ప్రేమగా నాన్న అని పిలిచే అదృష్టం కోసం ఈ హోమం చేశాను అంటాడు దక్షిణమూర్తి. 

నీదెంత రాతి గుండె నాన్న. అమ్మ అనే పిలుపును నాకు దూరం చేసి, నువ్వు నాన్న అని పిలిపించుకోవాలని ఆరాటపడుతున్నావా? ప్రాణం లేని ఈ బంధానికి శాంతిహోమం అవసరమా? అంటుంది సుమిత్ర. అవసరమే సుమిత్ర అనుకుంటూ వాళ్ల దగ్గరకు వస్తుంది మాలిని. ఎలా ఉన్నారంటూ ఒక్కొక్కరిని వరుస పెట్టి పిలుస్తూ బాగోగులు అడుగుతుంది. మీరు ఇక్కడ మాట్లాడుతున్నారని నేను గతాన్ని మర్చిపోలేను. అనుకోకుండా ఎదురుపడ్డాం, మీ పని మీరు చూసుకోండి. మా పని మేము చూసుకుంటామంటూ వెళ్లిపోతాడు శివన్నారాయణ.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఆ రోజు కచ్చితంగా వస్తుంది
Image Credit : Jiohotstar

ఆ రోజు కచ్చితంగా వస్తుంది

మీరు మీ కూతురికి దగ్గర కావాలని ఎంత ఆరాటపడుతున్నారో.. సుమిత్ర మీకు దూరంగా ఉండాలని అంతే కోరుకుంటోంది అంటుంది మాలిని. నా కూతురు నాన్న అని పిలిచే రోజు వస్తుందా అంటాడు దక్షిణమూర్తి. తప్పకుండా వస్తుంది మామయ్య. మీ మధ్య దూరం తగ్గాలని శాంతి హోమం చేయించమన్నాను. చూడు తనే మీ దగ్గరకు వచ్చింది. ఏదో ఒక రోజు మిమ్మల్ని ప్రేమగా నాన్న అని పిలుస్తుందని చెప్తుంది మాలిని. మనం వాళ్లకు చాలా రుణపడి ఉన్నామని మనసులో అనుకుంటుంది మాలిని.

35
జ్యో, సూరజ్ ల పూజ
Image Credit : Jiohotstar

జ్యో, సూరజ్ ల పూజ

మరోవైపు నవ గ్రహాల పూజ కోసం వెళ్లిన సూరజ్, జ్యోత్స్నలను చూసి భార్యాభర్తలు అని సంబోధిస్తాడు పంతులు. నాకు ఇంకా పెళ్లి కాలేదని కోపంగా చెప్తుంది జ్యోత్స్న. ఎవరి పూజ వాళ్లు చేద్దామంటుంది జ్యోత్స్న. తను ఎలా చేస్తే అలాగే చేస్తాడు సూరజ్. ఆ తర్వాత సూరజ్ తన జీవితంలో ఉండకూడదని జ్యోత్స్న మొక్కుకుంటుంది. జ్యోత్స్న అనుకున్నది జరగొద్దని సూరజ్ కోరుకుంటాడు. పూజ అయిపోయింది కదా పంతులు గారు.. ఇప్పుడు నేను కోరుకున్న అమ్మాయితో పెళ్లి జరుగుతుందా అని అడుగుతాడు సూరజ్. తప్పకుండా జరుగుతుందని చెప్తాడు పంతులు.

45
పారును ఆటపట్టించిన కార్తీక్
Image Credit : Jiohotstar

పారును ఆటపట్టించిన కార్తీక్

సూరజ్, జ్యోత్స్న నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. వాళ్లను దూరం నుంచి చూస్తూ సూరజ్ ని తిట్టుకుంటూ ఉంటుంది పారు. అప్పుడే అక్కడికి వచ్చిన కార్తీక్.. శివన్నారాయణ వాయిస్ తో పారును ఆటపట్టిస్తాడు. కార్తీక్ నవ్వుతూ దగ్గరికి వచ్చి ఏం చూస్తున్నావ్ అని అడుగుతాడు. ఈ రోజు బాగా రెడీ అయ్యావేంటీ అని కాసేపు సరదాగా మాట్లాడుతాడు. తర్వాత దీప ఎక్కడుందని అడుగుతుంది పారు. ప్రసాదం పంచుతోంది పదా అంటూ పారును లాక్కొని వెళ్తాడు కార్తీక్.

55
దీపకు మాలిని ఆఫర్
Image Credit : Jiohotstar

దీపకు మాలిని ఆఫర్

దీప మాలిని దగ్గరకు వెళ్లి ప్రసాదం ఇస్తుంది. ప్రసాదం రుచి చూసిన మాలిని.. దీపను పిలిచి మా రెస్టారెంట్ లో చెఫ్ గా పని చేస్తావా? మంచి శాలరీ ఇస్తాను అని అడుగుతుంది. దీప చిన్న స్మైల్ ఇచ్చి.. మీరు ఎంత ఇచ్చిన రాలేను అని చెప్తే ఏమంటారు అని అడుగుతుంది. ఎక్కడో నిజాయతీగా పని చేస్తుంటావు అని అనుకుంటాను అంటుంది మాలిని. ఎక్కడైనా వంట మనిషిగా పని చేస్తున్నవా? అని అడుగుతుంది మాలిని. 

అప్పుడే వచ్చిన కార్తీక్ తను వంట మనిషి కాదు, జ్యోత్స్న రెస్టారెంట్స్ సీఈఓ, నా భార్య కూడా అని పరిచయం చేస్తాడు. ఈ విషయం మాలినికి తెలియదనుకుంటున్నావా? అంటూ వస్తాడు శివన్నారాయణ. ఆ మనిషికి అన్ని తెలిసే కావాలని అడుగుతుందని అంటాడు. కార్తీక్, దీప షాక్ అవుతారు. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
వినోదం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bhogi Teaser: భోగి టీజర్ రివ్యూ, శర్వానంద్ మాస్ ట్రాన్స్ఫర్మేషన్..కెరీర్‌లో తొలిసారి వణుకు పుట్టించేలా
Recommended image2
Nani: ఇక జీవితంలో బిగ్ బాస్ జోలికి వెళ్లను..నాని సంచలన కామెంట్స్, కారణం ఏంటంటే?
Recommended image3
NTR మార్ఫింగ్ వీడియో వివాదం.. సెలబ్రిటీలదే తప్పు.. రామ్ గోపాల్ వర్మ షాకింగ్ కామెంట్స్
Related Stories
Recommended image1
Karthika Deepam 2 Today Episode: జ్యోతో షర్ట్ ఉతికించిన సూరజ్-కాంచన సంతోషం-సుమిత్ర కోసం తండ్రి హోమం
Recommended image2
Karthika Deepam 2 Today Episode: జ్యోతో ఓ రేంజ్ లో ఆడుకున్న సూరజ్- మాలిని కుట్ర- అసలు మాలిని ఎవరంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved