MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Karthika Deepam 2 Today Episode: జ్యోతో షర్ట్ ఉతికించిన సూరజ్-కాంచన సంతోషం-సుమిత్ర కోసం తండ్రి హోమం

Karthika Deepam 2 Today Episode: జ్యోతో షర్ట్ ఉతికించిన సూరజ్-కాంచన సంతోషం-సుమిత్ర కోసం తండ్రి హోమం

Karthika Deepam 2 Today Episode (జూలై 9వ తేదీ) శారీ కాల్చేస్తానని బెదిరించి జ్యోతో షర్ట్ ఉతికించిన సూరజ్. చదువు మానేసి జాబ్ చేస్తానన్న శౌర్య. కాంచన సంతోషం. కూతురి కోసం దక్షిణమూర్తి హోమం. ఈ రోజు ఎపిసోడ్ లో ఇంకా ఏం జరిగిందంటే..  

3 Min read
Author : Kavitha G
Published : Jul 09 2026, 10:42 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్
Image Credit : Jiohotstar

కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్

కార్తీక దీపం 2 సీరియల్ గురువారం ఎపిసోడ్ లో షర్ట్ ఉతక్కపోతే శారీ కాల్చేస్తాను అని బ్లాక్ మెయిల్ చేస్తాడు సూరజ్. నీకు నచ్చింది చేస్కోపోరా అంటుంది జ్యోత్స్న. ఏం చేయాలో నాకు బాగా తెలుసు అంటాడు సూరజ్. నేను మా ఇంట్లో చెప్తాను అంటుంది జ్యోత్స్న. నువ్వు ముందు చెప్పు. ఆ తర్వాత ఏం చెప్పాలో నాకు బాగా తెలుసు అంటాడు సూరజ్. ఏం చెప్తావురా అంటుంది జ్యోత్స్న. పని మనిషి బుజ్జిని క్యారేజ్‌తో రూమ్‌కి ఎవరు తీసుకొచ్చారో, లాక్ ఎవరు వేశారో అన్నీ చెప్తాను అని బెదిరిస్తాడు సూరజ్. నీ చిల్లర బెదిరింపులకు ఈ జ్యోత్స్న భయపడదు అని ఫోన్ కట్ చేస్తుంది జ్యోత్స్న.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
చదువు మానేస్తానన్న శౌర్య
Image Credit : Jiohotstar

చదువు మానేస్తానన్న శౌర్య

మరోవైపు శౌర్య నిద్ర మత్తులో హోంవర్క్ చేస్తుంటుంది. దీప ఆఫీస్ వర్క్ చూసుకుంటూ ఉంటుంది. ఇంతలో కాంచన వచ్చి శౌర్యను కాసేపు ఆటపట్టిస్తుంది. నేను ఇక చదవలేను. చదువు మానేసి జాబ్ చేస్తానని అంటుంది శౌర్య. నాలుగో తరగతి చదివిన నీకు జాబ్ ఎవరిస్తారు అని అడుగుతుంది కాంచన. మీ నాన్న ఇస్తాడు అంటుంది శౌర్య. ఐదో తరగతి చదివిన మా అమ్మకు సీఈఓ పోస్ట్ ఇచ్చినప్పుడు నాలుగో తరగతి చదివిన నాకు ఏ మేనేజర్ పోస్టో ఇవ్వడా అంటుంది శౌర్య. మీ అమ్మ మీదే సెటైర్లు వేస్తున్నావా అంటాడు కార్తీక్. 

లేదు నాన్న. పెద్దయ్యాక జాబ్ చేయడం కంటే ఇప్పుడే మొదలు పెట్టడం మంచిది అంటుంది శౌర్య. దీన్ని ట్యూషన్ లో వేయాలి బావ అంటుంది దీప. ఈ చదువులు నా వల్ల కాదు అని వెళ్లి పడుకుంటుంది శౌర్య. నువ్వు కూడా వెళ్లి పడుకో దీప అంటుంది కాంచన. నాకు కాస్త పని ఉంది అత్తయ్య అంటుంది దీప. ఆఫీసు పనులు ఆఫీసులోనే పూర్తి చేయి ఇంటి వరకు మోసుకురాకు అంటుంది కాంచన. భార్యాభర్తలు రోజులో కొంత సమయం అయినా వాళ్ల కోసం వాళ్లు కేటాయించుకోవాలి అని చెప్తుంది కాంచన. నేను కూడా నీ గురించి అలాగే కోరుకుంటే నువ్వు ఏం చెప్తావమ్మా అని అడుగుతాడు కార్తీక్.

Related Articles

Related image1
Karthika Deepam 2 Today Episode: కార్తీక్‌ అనుమానం- సూరజ్ పెళ్లి ప్రపోజల్- కొత్త క్యారెక్టర్ ఎంట్రీ
Related image2
Karthika Deepam 2 Today Episode: జ్యోతో ఓ రేంజ్ లో ఆడుకున్న సూరజ్- మాలిని కుట్ర- అసలు మాలిని ఎవరంటే?
36
సూరజ్ షర్ట్ ఉతికిన జ్యో
Image Credit : Jiohotstar

సూరజ్ షర్ట్ ఉతికిన జ్యో

మరోవైపు సూరజ్ షర్ట్ ఉతుకుతూ ఉంటుంది జ్యోత్స్న. సూరజ్, పారిజాతం పక్కన కూర్చొని స్నాక్స్ తింటూ చూస్తుంటారు. పప్పు కావాలనే చాలా ప్లాన్డ్ గా పోసింది అంటాడు సూరజ్. అవునా అంటుంది పారు. మీకు కన్నుకొట్టాకే కదా పప్పు పోసింది తెలియనట్లు అడుగుతారేంటి అంటాడు సూరజ్. లేదు.. తన కంట్లో ఏదో పడినట్లు ఉంది. నాకేమి కన్ను కొట్టలేదు అని కవర్ చేస్తుంది పారు. 

షర్ట్ ని బండకేసి బాది వాటర్ లో తీసి సూరజ్ చేతిలో పెడుతుంది జ్యోత్స్న. సూరజ్ దగ్గర ఉన్న తన చీరను తీసుకుంటుంది జ్యోత్స్న. సూరజ్ షర్ట్ తీసి చూస్తే చినిగిపోయి ఉంటుంది. నాతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది అంటుంది జ్యోత్స్న. నీ పొగరే నాకు ఇష్టం. నీ మెడలో మూడు ముళ్లు వేసేవరకు వదిలిపెట్టను అని మనసులో అనుకుంటాడు సూరజ్.

46
కాంచన సంతోషం
Image Credit : Jiohotstar

కాంచన సంతోషం

చెప్పమ్మా.. మాదేనా జీవితం నీది కాదా అంటాడు కార్తీక్. అంతలో కాంచన ఫోన్ కి మెసేజ్ వస్తుంది. తీసి చూసి నీకే నాన్న వీడియో మెసేజ్ పంపాడని చెప్తాడు కార్తీక్. కాంచన సంతోషిస్తుంది. సరే మేము వెళ్తాం ఆ మెసేజ్ ఏంటో చూడు అంటాడు కార్తీక్. పర్లేదు అందరం కలిసే చూద్దాం అంటుంది కాంచన. కాంచన ఎలా ఉన్నావ్. నా గురించే ఆలోచిస్తున్నావని తెలుసు. నా ఆపరేషన్‌ సక్సెస్ అయింది. నేను ఇప్పుడు బాగున్నాను. రేపే ఇండియా వస్తున్నాను. రాగానే మొదట నిన్నే కలుస్తానని వీడియోలో చెప్తాడు శ్రీధర్.

నాన్నకు నువ్వంటే ప్రాణం అందుకే ముందు నిన్నే కలవాలి అనుకుంటున్నాడు. నీకు కూడా సంతోషంగా ఉందని నాకు తెలుసు అంటాడు కార్తీక్. రేపు మీరు ఇంట్లోనే ఉండండి అంటుంది కాంచన. నాన్న వచ్చేది నీకోసం, మాకోసం కాదు అని కాసేపు తల్లిసని ఆటపట్టిస్తాడు కార్తీక్. రేపు జ్యోత్స్న కోసం గుడికి వెళ్లాలి. తాత రమ్మన్నాడు అని చెప్పి వెళ్లిపోతాడు కార్తీక్. నిజంగా నాకు ఈ రోజు నిద్రపట్టదు. ఎప్పుడు తెల్లారుతుందా అని మీకోసం ఎదురుచూస్తాను అని మనసులో అనుకుంటుంది కాంచన.

56
ఎదురుపడ్డ మాలిని, సుమిత్ర
Image Credit : Jiohotstar

ఎదురుపడ్డ మాలిని, సుమిత్ర

మరుసటి రోజు ఉదయం శివన్నారాయణ ఫ్యామిలీతో కలిసి గుడికి వెళ్తాడు. అక్కడ జరుగుతున్న అన్నదానం కార్యక్రమం గురించి అడుగుతాడు. మీలాగే ఓ పెద్ద కుటుంబం వారు ఈ కార్యక్రమం చేస్తున్నారని చెప్తాడు పంతులు. ఎవరు వాళ్లు అని అడిగితే హోమం చేస్తున్న దక్షిణమూర్తిని చూపిస్తాడు పంతులు. అంతా షాక్ అవుతారు. శివన్నారాయణ వాళ్లను చూసి దక్షిణామూర్తి కూడా షాక్ అవుతాడు. పక్కనే మాలిని కూడా ఉంటుంది. 

66
కూతురి కోసం దక్షిణమూర్తి హోమం
Image Credit : Jiohotstar

కూతురి కోసం దక్షిణమూర్తి హోమం

దక్షిణమూర్తిని మీకు ఎంతమంది సంతానం అని అడుగుతాడు పంతులు. ఒక కొడుకు, కూతురు అని చెప్తాడు దక్షిణామూర్తి. కొడుకు పేరు చెప్పండి అంటాడు పంతులు.. మాలిని బాధతో మొహం పక్కకు తిప్పుకుంటుంది. ఇది నా కూతురి కోసం చేయిస్తున్న హోమం.. తను, తన కుటుంబం క్షేమంగా ఉండాలని చెప్తాడు దక్షిణమూర్తి. హోమం చుట్టూ ప్రదక్షిణలు చేసి పూర్ణాహుతిని హోమంలో వేయమంటాడు పంతులు. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
వినోదం
ఏషియానెట్ న్యూస్
Latest Videos
Recommended Stories
Recommended image1
Chiranjeevi Hits: చిరంజీవికి అదృష్టం తెచ్చిన స్టార్ హీరోల భార్యలు, ఆ నాలుగు మామూలు బ్లాక్ బస్టర్లు కాదు
Recommended image2
Salman Khan Fee: దిల్ రాజుతో సినిమా, సల్మాన్ ఖాన్ రెమ్యునరేషన్ లో భారీ కోత.. ఎందుకో తెలుసా
Recommended image3
Dhandha Review: దందా రివ్యూ.. చిన్న మోసాల నుంచి పొలిటీషియన్స్ వరకు, నయా క్రైమ్‌ థ్రిల్లర్‌ ఎలా ఉందంటే?
Related Stories
Recommended image1
Karthika Deepam 2 Today Episode: కార్తీక్‌ అనుమానం- సూరజ్ పెళ్లి ప్రపోజల్- కొత్త క్యారెక్టర్ ఎంట్రీ
Recommended image2
Karthika Deepam 2 Today Episode: జ్యోతో ఓ రేంజ్ లో ఆడుకున్న సూరజ్- మాలిని కుట్ర- అసలు మాలిని ఎవరంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved