MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Entertainment
  • 'కార్తీక దీపం 2': 'వంటలక్క' కు రోజుకు అంత ఇస్తున్నారా? గిట్టుబాటు అవుతుందా

'కార్తీక దీపం 2': 'వంటలక్క' కు రోజుకు అంత ఇస్తున్నారా? గిట్టుబాటు అవుతుందా

 కార్తీకదీపం 2 - ఇది నవ వసంతం పేరుతో మార్చి 25 నుంచి స్టార్ మా ఛానల్‌లో ప్రసారమవుతోంది. సోమవారం నుంచి శనివారం వరకు డైలీ సీరియల్‌గా స్టార్ మాలో ..

3 Min read
Author : Surya Prakash
Published : Apr 09 2024, 05:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
premi Viswanath

premi Viswanath

స్టార్ మాలో ప్రసారమైన కార్తీకదీపం (Karthika Deepam) సీరియల్ తెలయని తెలుగు వాళ్లు లేరు అనటంలో అతిశయోక్తి లేదు. ఆ  రేంజ్ లో ఆ సీరియల్  హిట్టయింది. జాతీయ స్థాయిలో సంచలన రికార్డులు సృష్టిస్తూ రేటింగ్ విషయంలో సరికొత్త ఫీట్స్ అధిగమించింది. ఈ సీరియల్ లో డాక్టర్ బాబు, వంటలక్క లకు అయితే పిచ్చ ఫాలోయింగ్ ఏర్పడింది. ముఖ్యంగా వంటలక్క  స్క్రీన్ ప్రెజెన్స్ అన్ని వర్గాలను ఆకట్టుకుంది.   ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సీరియల్ మాయలో పడిపోయారు. దాదాపు ఆరేళ్ల పాటు ప్రేక్షక లోకాన్ని టీవీలకు అతుక్కునేలా చేసిన ఈ సీరియల్ ఇప్పుడు మళ్ళీ వస్తోంది. ఈ నేపధ్యంలో వంటలక్క పాత్ర చుట్టూ తిరిగే ఈ సీరియల్ నిమిత్తం  ప్రేమీ విశ్వనాథ్‌ కు ఎంత రెమ్యునరేషన్ ఇస్తున్నారనేది హాట్ టాపిక్ గా మారింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

ఇక కార్తీకదీపం 2 సీరియల్ రానుందంటూ గత కొన్ని రోజులుగా ప్రోమోలు వస్తున్న నేపథ్యంలో.. మరోసారి అందరి చూపు దీనిపై పడింది. ఎప్పుడెప్పుడు కార్తీకదీపం 2 మొదలవుతుందా అనే కుతూహలం షురూ అయింది. ఈ నేపథ్యంలో దీనిపై అఫీషియల్ స్టేట్‌మెంట్ ఇచ్చి ప్రోమో కూడా రిలీజ్ చేశారు. ఎట్టకేలకు డేట్ అండ్ టైమ్‌ ఫిక్స్ చేసి ప్రసారం మొదలెట్టారు. మార్చి 25 రాత్రి 8 గంటల నుంచి కార్తీకదీపం 2 స్టార్ మా ఛానల్‌లో ప్రసారం అవుతోంది. 
 

38

కార్తీక దీపం వంటలక్క అంటే తెలియని తెలుగు ఇల్లు లేదంటే అతిశయోక్తి కాదు. ఒకే ఒక్క సీరియల్‌తో ఆమె ప్రతి ఇంట్లోనూ మనిషి అయిపోయింది ఈ మలయాళీ అందం ప్రేమి విశ్వనాథ్. ఈ భామ ఈ సీరియల్ నిమిత్తం భారీగానే వసూలు చేస్తోందని వినికిడి. ఒక్క రోజు సీరియల్‌లో నటించినందుకు గాను 35 వేల రూపాయలు తీసుకొంటున్నారు.  ఈ సీరియల్ కోసం సుమారుగా నెలలో  20 రోజులు షూటింగులో పాల్గొంటారు. దాంతో నెలకు ఆమె ఆదాయం 7 నుంచి 8 లక్షల రూపాయలు ఉంటుంది అని టీవీ ట్రేడ్  అంటోంది. 

48

అయితే అంత రేటు ఆమెకు ఇచ్చేస్తే వర్కవుట్ అవుతుందా అంటే అవుతుందని చెప్తున్నారు. బుల్లితెరపై 'కార్తీక దీపం' సీరియల్‌ మరోసారి సత్తా చాటుకుంది. హిస్టరి రిపీట్‌ అంటూ మళ్లీ తన స్థానానికి చేరుకుంది. ఇలా వచ్చిందో లేదో అప్పుడే రికార్డుల వేట మొదలు పెట్టేసింది. మార్చి 25 నుంచి బుల్లితెరపై 'కార్తీక దీపం' సీరియల్‌ సందడి మళ్లీ మొదలైన సంగతి తెలిసిందే. 

58
<p>premi Viswanath</p>

<p>premi Viswanath</p>

'కార్తీక దీపం 2- ఇది నవవసంతం' (Karthika Deepam 2 Idi Nava Vasantham) అంటూ ఫస్ట్‌ పార్ట్‌కు సీక్వెల్‌గా వచ్చింది. ఇది దానికి కొనసాగింపు కాదు. ఇది కొత్త కథ. అదే కార్తీక్‌, దీపలు. మిగతా వారంత కొత్త వారు. ఆడియన్స్‌కి కూడా కావాల్సింది కూడా అదే. వంటలక్క, డాక్టర్‌ బాబు జంటను తెరపై కనిపిస్తే చాలు రచ్చ ఓ రేంజిలో ఉంటోంది.

68

 ఈ సీరియల్‌ అప్పుడే టాప్‌లో దూసుకుపోతుంది. అన్ని సీరియల్స్‌ని వెనక్కి నెట్టి అగ్రస్థానం కొట్టేసి దట్‌ ఈజ్‌ 'కార్తీక దీపం' అనిపించుకుంటుంది. సీరియల్‌ రిలీజ్‌ అయిన ఫస్ట్‌ వీక్‌లోనే టాప్‌ టీఆర్పీ రేటింగ్‌ను సొంతం చేసుకుంది. అలా తొలివారం ఈ కార్తీక దీపం 2 ఇది నవవసంతం..  12.93 టీఆర్పీ(Karthika Deepam TRP Rating) రేటింగ్ సాధించింది. అర్బన్‌లో 10.40 రేటింగ్ నమోదు చేసుకోగా.. రూరల్‌లో 12.93 టీఆర్పీ రేటింగ్‌ సాధించింది.  

78

బలమైన కథలో కార్తీక దీపం 2 సీరియల్‌ని తీసుకువచ్చారు. తొలి ఎపిసోడ్‌లోనే స్టార్‌ సినిమా రేంజ్‌లో ట్విస్ట్‌ ఇచ్చారు. దీప పుట్టుక చూట్టూ కథ అల్లుతూ ఆడియన్స్‌లో క్యూరియసిటీ పెంచారు. ఒక్కో ఎపిసోడ్‌లో ఒక్కో ట్విస్ట్‌ ఇస్తూ తొలివారంలో ఆడియన్స్‌ని టీవీలకే అతుక్కుపోయేలా చేశాడు డైరెక్టర్‌. దీంతో ఈ సీరియల్‌ టాప్‌ టీఆర్పీ రేటింగ్‌ నమోదు చేసుకుని మళ్లీ బుల్లితెరపై రికార్డు వేట కొనసాగిస్తుంది.  ఈ సారి కొత్త కథతో వచ్చినా.. పాత రికార్డ్స్‌నే రిపీట్‌ చేస్తుంది. దీంతో మరోసారి వంటలక్క, డాక్టర్‌ బాబు జంటకు ఉన్న క్రేజ్‌ను ఎలాంటి ఈ టీఆర్పీ రేటింగ్‌ గుర్తుచేసింది. 

88

ఆ రోజు నుంచి సోమవారం నుంచి శనివారం వరకు డైలీ సీరియల్‌గా కార్తీకదీపం 2 ప్రసారం అవుతోంది. కార్తీకదీపం 2 గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన  నేపథ్యంలో ప్రస్తుతం అదే సమయంలో వస్తున్న నాగ పంచమి సీరియల్‌ను సాయంత్రం 6 గంటలకు షిఫ్ట్ చేసేశారు. దీంతో   నాగ పంచమి సీరియల్‌ కార్తీకదీపం 2 అలరిస్తోంది.

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.

Latest Videos
Recommended Stories
Recommended image1
Raviteja Remuneration: ఇరుముడి మూవీకి రవితేజ పారితోషికం ఎంతో తెలుసా? చిరంజీవిని మించి.. టీమ్‌ ఫీజు వివరాలు
Recommended image2
Superstar Krishna: కృష్ణ నటించిన ఏకైక సీరియల్‌ ఏంటో తెలుసా? బుల్లితెరపై అదో బ్లాక్‌ బస్టర్‌
Recommended image3
Venu Swamy: సినిమా జ్యోతిష్యుడు వేణు స్వామి ఎంత ఫీజు వసూలు చేస్తాడో తెలుసా? ఆయనే స్వయంగా ఏమన్నాడంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved