MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Karthika Deepam: సౌర్య పరిస్థితి చూసి కుమిలిపోతున్న కార్తీక్.. దీప కార్తీక్ లను వెతకడానికి వెళుతున్న సౌందర్య?

Karthika Deepam: సౌర్య పరిస్థితి చూసి కుమిలిపోతున్న కార్తీక్.. దీప కార్తీక్ లను వెతకడానికి వెళుతున్న సౌందర్య?

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ మంచి రేటింగ్ తో దూసుకెళ్తుంది. ఒకటే కథతో నిత్యం ట్విస్ట్ ల మీద ట్విస్టులతో ప్రసారమవుతున్న ఈ సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు డిసెంబర్ 13వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. 

4 Min read
Author : Navya G
Published : Dec 13 2022, 08:04 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

ఈరోజు ఎపిసోడ్ లో సౌందర్య పనిమనిషితో ఫోన్ మాట్లాడుతూ నేను ఇవాళ బయలుదేరుతున్నాను సాయంత్రం నుంచి వచ్చి పనులు జాయిన్ అవ్వు అని మాట్లాడుతూ ఉండగా ఇంతలో ఆనందరావు అక్కడికి వచ్చి ఎవరితో మాట్లాడుతున్నావు అని అనగా పార్వతమ్మ అని పనిమనిషి తో మాట్లాడుతున్నాను ఉదయం సాయంత్రం వచ్చి పని చేసి వెళ్తుంది నువ్వు హిమని జాగ్రత్తగా చూసుకోండి చాలు అని అంటుంది. నువ్వెక్కడికి వెళ్తున్నావు అని ఆనందరావు అడగడంతో కొడుకు కోడల్ని వెతకడానికి వెళుతున్నాను ఎక్కడ ఉన్నా సరే తీసుకు వస్తాను.

28

  వెంటనే ఆనంద్ రావు నాకు రావడం ఇష్టం కాదు సౌందర్య ఎంత వెతికిన ఫలితం కనిపించదు.  ఎందుకు అనవసరంగా సమయం వృధా అని అంటాడు. అది కాదండి కార్తిక్ వాళ్లు బతికే ఉన్నారు కాబట్టి ఇంద్రుడు సౌర్యని తీసుకొని అటు ఇటు తీసుకొని వెళుతున్నాడు. మనం ఇంతవరకు ఆ ఇంటిలోనే కనిపెట్టలేకపోయాం కదా అని అనగా ఒకవేళ కార్తీక్ వాళ్ళు బతికే ఉంటే ఇన్ని రోజులు మన ఇంటి దగ్గరికి రాకుండా ఎందుకు ఉంటారు అని ప్రశ్నిస్తాడు ఆనందరావు. వాళ్లు ప్రాణాలతో ఉన్నారు అని మనకు తెలిసేలా చేసే వాళ్ళు కదా అనగా ఆ మౌనిక వాళ్ళిద్దర్నీ కిడ్నాప్ చేసి దాచి పెట్టిందేమో అండి అది ఎంతకైనా తెగిస్తుంది అని కార్తీక్ వాళ్ళ గురించి వాళ్ళిద్దరూ వాదించుకుంటూ ఉంటారు
 

38

 సౌందర్య ఎన్ని మాట్లాడినా కూడా ఆనందరావు వాళ్ళు బతికి లేరు నువ్వు వెళ్లొద్దు అని చెబుతాడు. మరొకవైపు కార్తీక్ జాగింగ్ కి బయలుదేరుతూ ఉండగా ఇంతలోనే అక్కడికి ఒక ఆమె వచ్చి మీరు వెళ్లడానికి వీల్లేదు ఈరోజు శుక్రవారం అని అనగా ఎవరు నువ్వు అని అడుగుతాడు కార్తీక్. ఈరోజు శుక్రవారం మీరు ఎక్కడికి వెళ్ళకూడదు. దీపము కలిసి పూజ చేయాలి, వెళ్లి స్నానం చేసి రండి దీపమ్మ ఇప్పుడే స్నానం చేసేది అయిపోయింది అనగా ఇంతలో దీప అక్కడికి వచ్చి ఎవరు నువ్వు అనడంతో చారుశీల పంపించింది అనగా అవునా సరే అని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు కార్తీక్.
 

 

48

ఆ తర్వాత దీప రెడీ అవుతుండగా ఇంతలో అక్కడికి పండరీ వచ్చి దీపమ్మ అలా బొట్టు పెట్టుకోకూడదు అని చెప్పగా సరే అని దీప ఆమె వివరాలు అడుగుతుండగా వేరే విషయాల గురించి మాట్లాడి ఇడ్లీ చేస్తాను అని అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోతుంది. మరొక వైపు చంద్రమ్మ  ఇంటికి వచ్చి జ్వాలమ్మ నీకోసం ఇష్టమని క్యారెట్టు ఫ్రూట్స్ తీసుకొచ్చాను అని అనగా అవి బాబాయ్ కి ఇష్టం లేదు కదా పిన్ని అనడంతో బాబాయ్ కి దోసకాయలు తీసుకొచ్చాను దోసకాయ పచ్చడి చేసి పెడతాను అని అనగా వెంటనే సౌర్య దోసకాయలను తీసుకొని విసిరిపారేస్తుంది. ఏమైందమ్మా అనడంతో నాకు దోసకాయలు నచ్చదు అని చెప్పాను కదా పిన్ని అనడంతో సరే అని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది చంద్రమ్మ.
 

58

 ఆ తర్వాత సౌర్య ఇంటి బయట పూలు కోస్తూ ఉంటుంది. అప్పుడు జాగ్రత్త సౌర్యమ్మ అని చంద్రమ్మ చెప్పగా సరే పిన్ని అని సౌర్య పైకి ఎక్కి పూలు కోస్తూ ఉండగా అనుకోకుండా కింద పడిపోతుంది. దాంతో చంద్రమ్మ అక్కడికి పరుగులు తీస్తుంది. మరోవైపు దీప ఇల్లు శుభ్రం చేస్తూ ఉండగా ఇంతలో పండరి అక్కడికి వచ్చి ఈ పనులన్నీ నీకెందుకు చెప్పు దీపమ్మ నేను ఉన్నాను కదా అని దీపని కూర్చోబెట్టి కాఫీ తీసుకొని రావడానికి వెళుతుంది. అప్పుడు దీప ఆమె గురించి వివరాలు అడగగా ఏదో ఒక విషయం చెప్పి తప్పించుకుంటూ ఉండటంతో దీప నీ విషయాలు చెబుతావా లేదా అని అనగా బట్టలు ఉతకాలి మర్చిపోయాను అని అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోతుంది.
 

68

 అప్పుడు పండరీ గురించి దీప  ఆలోచనలో పడుతుంది. మరొకవైపు కార్తీక్ దీర్ఘంగా ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే చారుశీల అక్కడికి వస్తుంది. దీపనీ ఎలా అయినా కాపాడుకోవాలి అని కార్తీక్ చారుశీల తో మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలోనే ఇంద్రుడు ఫోన్ చేసి సౌర్య గురించి చెప్పడంతో కార్తీక్ షాక్ అవుతాడు. అప్పుడు ఇంద్రుడికి ఫోన్ చేసి ఒక అడ్రస్ చెప్పి అక్కడికి రమ్మని చెప్పి చెబుతాడు. అప్పుడు కార్తీక్ చారుశీల తో చెబుతూ దేవుడు నాకు దీప రూపంలో చాలదని ఇప్పుడు పాప రూపంలో కూడా నాకు ఇబ్బందులు పెడుతున్నాడు అని టెన్షన్ పడుతూ ఉండగా చారుశీల ఓదారుస్తూ ఉంటుంది.
 

78

పాప స్పృహ లో లేకపోతే నేను ట్రీట్మెంట్ చేస్తాను లేదంటే నువ్వు ట్రీట్మెంట్ చేయాలి అంటాడు కార్తీక్. మరొకవైపు సౌందర్య ఆనందరావులో బట్టలు సర్దుకుంటూ ఉంటారు. అప్పుడు ఆశతో వెళ్లడం నిరాశ తో తిరిగి రావడం అప్పుడు బాధపడడం ఇవన్నీ జరిగేవి కదా సౌందర్య అని అంటాడు ఆనందరావు. అప్పుడు ఆనందరావు ఫ్లైట్లో వెళ్లమని చెప్పగా లేదు కారులో వెళ్తాను అని అంటుంది సౌందర్య. నువ్వు కార్ డ్రైవ్ చేస్తూ వెళ్తే నాకు టెన్షన్ గా ఉంటుంది అనడంతో లేదు అని గతంలో డ్రైవర్ గా పనిచేసిన అంజిని అక్కడికి పిలిపిస్తుంది సౌందర్య. దాంతో ఆనందరావు కాస్త ధైర్యంగా ఉంటాడు. అప్పుడు సౌందర్య అక్కడికి నుంచి బయలుదేరుతుంది.
 

88

మరొకవైపు ఇంద్రుడు వాళ్ళు సౌర్య హాస్పిటల్ కి తీసుకొని రావడంతో కార్తీక్ చెక్ చేస్తూ ఉంటాడు. అప్పుడు జరిగిన విషయం గురించి చంద్రమ్మని అడిగి చెందిన చంద్రమ్మ పై సీరియస్ అవుతాడు కార్తీక్. తర్వాత చారిశీల సౌర్యకి ట్రీట్మెంట్ చేయడంతో కార్తీక్ శౌర్యను చూసి బాధపడుతూ ఉంటాడు. అప్పుడు చారుశీల కార్తీక్ అన్న పేరుని పలకడంతో ఇప్పుడు సౌర్య కి మెలుకువ రావడంతో కార్తీక్ పక్కకు వెళ్లి దాక్కుంటాడు. అప్పుడు చంద్రమ్మ సౌర్యనీ చూసి బాధపడుతూ ఉండగా నాకేం కాలేదు పిన్ని కానీ ఇక్కడ ఎవరూ కార్తీక్ అన్న పేరును పలికారు అని అంటుంది శౌర్య. నాన్న పేరు కార్తీక్ పిన్ని మా నాన్న ఇక్కడికి వచ్చారా అని అడగగా కార్తీక్ చాటుగా ఉండి ఎమోషనల్ అవుతూ ఉంటాడు.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Sourav Ganguly Biopic: దాదా బయోపిక్ షూటింగ్ మొదలుపెట్టిన రాజ్‌కుమార్ రావు, ఫస్ట్ గ్లింప్స్ ఇదే!
Recommended image2
AA22 x A6: అల్లు అర్జున్, దీపికా సినిమా సెట్ చూసి రివ్యూ చెప్పేసిన ధురంధర్ స్టార్.. బంపర్ హిట్ పక్కా
Recommended image3
Ajay Devgn Expensive Things: ఒకదానిని మించి మరొకటి.. లగ్జరీ థింగ్స్ కోసం కోట్లల్లో ఖర్చు చేస్తున్న ఆర్ఆర్ఆర్ నటుడు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved