- Home
- Entertainment
- Karthika Deepam: మోనితకు వార్నింగ్ ఇచ్చిన కార్తీక్.. హిమ, శౌర్య లను చూసి బాధపడుతున్న హేమచంద్ర?
Karthika Deepam: మోనితకు వార్నింగ్ ఇచ్చిన కార్తీక్.. హిమ, శౌర్య లను చూసి బాధపడుతున్న హేమచంద్ర?
Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ మంచి రేటింగ్ తో దూసుకెళ్తుంది. ఒకటే కథతో నిత్యం ట్విస్ట్ ల మీద ట్విస్టులతో ప్రసారమవుతున్న ఈ సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు జనవరి 6వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఈరోజు ఎపిసోడ్ లో దీప వంట చేస్తూ మోనిత గురించి ఆలోచిస్తూ ఉంటుంది. మోనిత అన్న మాటలు ఆలోచిస్తూ పరద్యానంలో ఉండగా ఇంతలో కార్తీక్ అక్కడికి వచ్చి ఏం ఆలోచిస్తున్నావు దీప వంట గదిలోకి రావద్దని చెప్పాను కదా, పైగా స్టవ్ ముందు ఏదో పర ధ్యానంగా ఉన్నావు అని అంటాడు కార్తీక్. పండరీ రాలేదా అని అడగగా చుట్టాలు వచ్చారని రాలేదు అయినా ఈ ఒక్క పూటకి వంట చేస్తే ఏం కాదులే డాక్టర్ బాబు అనడంతో నువ్వు బయటకు వెళ్లి దీప నేను వంట చేస్తాను అని అంటాడు కార్తీక్. ఏం కాదులే డాక్టర్ బాబు నన్ను కాస్త ఒంటరిగా వదిలేయండి నాకు అంత అయోమయంగా ఉంది మనసు ఏం బాగోలేదు బ్రతికీనన్ని రోజులు సంతోషంగా బతుకుతాము అనుకుంటే దేవుడు ఆ సంతోషాన్ని కూడా ఇవ్వలేదు అంటుంది.
ఆ మోనిత అన్న మాటలు గురించి ఆలోచిస్తున్నావా దీప అని అంటాడు కార్తీక్. జైలుకు వెళ్ళింది అనుకున్న ఆ మోనిత మళ్ళీ వచ్చింది. ఏదేదో మాట్లాడుతోంది అలాంటప్పుడు ఎలా సైలెంట్ గా ఉండాలి ఎలా ఆలోచించకుండా ఉండాలి డాక్టర్ బాబు దాని పీడ విరగడ అవుతుందో అని అనుకుంటూ ఉంటుంది దీప. అప్పుడు కార్తీక్ నువ్వు ఆ మోనిత గురించి ఆలోచించొద్దు దాని అడ్డు ఎలా తొలగించుకోవాలో నేను చూసుకుంటాను అంటాడు. అప్పుడు ఇది దీప ఏం చేస్తారు డాక్టర్ బాబు అది జైల్లో ఉన్నప్పుడే మనల్ని విడిచిపెట్టకుండా ఒక మనిషిని పెట్టి మన విషయాలు అన్నీ ఎంక్వయిరీ చేసింది. ఇప్పుడు నేను ఎప్పుడెప్పుడు చనిపోతాను అని నా చావు కోసం ఎదురు చూస్తుంది అని అంటుంది దీప.
అప్పుడు కార్తీక్ నువ్వు లేకపోతే నేను ఉండను అన్న విషయాన్ని ఆ మోనితకూ అర్థం అయ్యేలా చెప్తాను అని అనడంతో ఆపండి డాక్టర్ బాబు మీకు దండం పెడతాను. పదేపదే అలా మాట్లాడకండి వినడానికి నాకు ఎలాగో ఉంది అనడంతో సర్లే సరే దీప అని కార్తీక్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరొకవైపు మోనిత తన ఇంటికి వెళ్తుండగా ఇంతలోనే కార్తీక్ అక్కడికి వెళ్తాడు. అప్పుడు కార్తీక్ ని చూసి ఇది నిజమా లేక కలనా కార్తిక్ నువ్వు నాకోసం వెతుక్కుంటూ వచ్చావా నాకు చాలా సంతోషంగా ఉంది అనడంతో నేను నీతో కొంచెం సేపు మాట్లాడాలి అనడంతో కొద్దిసేపు ఏంటి కార్తీక్ నాకున్న పని అది ఎంతసేపైనా మాట్లాడు అని మౌనిక ఆనంతో ఇదిగో ఇలా మాట్లాడకు మోనిత నాకు కోపం వస్తుంది అని అంటాడు.
లోపలికి వెళ్దాం రా కార్తిక్ అనడంతో పర్లేదు ఇక్కడే మాట్లాడుతాను అనగా అదేంటి కార్తీక్ నీకు గతం గుర్తుకు రాకముందు మనిద్దరం ఇంట్లో ఎంత సంతోషంగా గడిపామో గుర్తు తెచ్చుకో, కూడా నీ మనిషి లాగే ఫీలవు అనడంతో కార్తీక్ కోపంతో మాట్లాడగా మోనిత నేను ఏ పరిస్థితిలో ఉన్నాను తెలిసి కూడా నువ్వు ఎలా ఇలా మాట్లాడగలుగుతున్నావు ఛీ అని అసహ్యించుకుంటాడు. అయినా కూడా మోనిత అలాగే మాట్లాడడంతో నువ్వు మనిషివేనా ఇలా మాట్లాడగలుగుతున్నావు అని అనగా నువ్వు ఏం చేసినా నేను ఇలాగే మాట్లాడుతాను కార్తీక్ అంటుంది మోనిత.
అప్పుడు మోనిత నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయను అందుకు ఒక కండిషన్ నేను మీతో పాటు కలిసి ఉంటాను. దీప బతికినన్ని రోజులు దీప తో ఉండు దీప చనిపోయాక నాతో సంతోషంగా ఉండు అంటుంది మోనిత. నీ బుద్ధి మారదు అని తెలిసి నీతో మాట్లాడడానికి వచ్చే నాకు బుద్ధి లేదు ఛీఛీ అంటాడు కార్తీక్. ఇప్పుడు దీప కండిషన్ బాగాలేదు కాబట్టి నేను మర్యాదగా వదిలేస్తున్నాను కానీ నీ వల్ల తనకు ఏమైనా హాని జరిగిందో ప్రాణాలు తీసేస్తాను అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు కార్తీక్. మరొకవైపు సౌర్య, హిమ ఇద్దరు కార్తీక్ దీప లను వెతుక్కుంటూ వెళ్తూ ఉంటారు. అప్పుడు సౌర్యకి దాహంగా అనిపించడంతో హిమ తనకు దాహం వేస్తుందని అబద్ధం చెప్పి వాటర్ బాటిల్ తీసుకుంటుంది.
అప్పుడు సౌర్యకావాలనే హిమ తాగిన నీళ్లు తాగకుండా మరొక వాటర్ బాటిల్ తీసుకుంటుంది. అదేంటి శౌర్య అనడంతో ఇంకా చాలా ఇండ్లు వెతకాలి కదా అందుకే రెండు వాటర్ బాటిల్ తీసుకున్నాను అంటూ కవర్ చేస్తుంది. అప్పుడు హిమ మొండిది బాగా కవర్ చేసుకుంటుంది అని మనసులో అనుకుంటూ ఉంటుంది. మరొకవైపు దీప కార్తీక్ కోసం ఎదురు చూస్తుండగా ఇంతలో మోనిత అక్కడికి వెళ్లి ఓవర్ యాక్షన్ చేస్తూ డాక్టర్ బాబు రాలేదా అనగా నీకెందుకు నువ్వు ఫస్ట్ బయటికి వెళ్ళు అని అంటుంది దీప. ఇదిగో ఇలా నువ్వు ఆవేశపడే జీవితంలో చాలా నష్టపోయావు అంటూ దీప చావు గురించి నోటికొచ్చిన విధంగా మాట్లాడుతూ ఉంటుంది మోనిత.
అప్పుడు దీప,మోనిత కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అప్పుడు మోనిత నేను ఒకటి చెబుదామని వచ్చాను ఇందాకే కార్తీక్ నా దగ్గరికి వచ్చాడు అనగా ఆయన నీ దగ్గరికి ఎందుకు వస్తాడే పిచ్చిపిచ్చిగా వాగకు అని అంటుంది దీప. చెప్పేది విను దీపక్క కార్తీక్ ఇందాక నా దగ్గరికి వచ్చి, దీప పరిస్థితి బాగోలేదు తనని ఇప్పుడైనా ప్రశాంతంగా బతకనివ్వు అని బ్రతిమలాడాడు అని అంటుంది మోనిత. అప్పుడు దీప సీరియస్ గా మాట్లాడి బయటికి వెళ్తావా లేదా అనడంతో మోనిత అలాగే మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు దీప,నిన్ను ముట్టుకోవాలి అంటేనే నాకు ఎలాగో ఉంది..
మర్యాదగా వెళ్తావా లేదా అని అక్కడ ఉన్న వస్తువు తీసి విసరి పోతుండగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరొకవైపు శౌర్య హిమ ఇద్దరూ కార్తీక్ దీపల కోసం రోడ్డు మీద అందరికీ ఫోటోలు చూపిస్తూ వెతుకుతూ ఉంటారు. అది చూసిన హేమచంద్ర బాధపడుతూ ఈ వయసులో మీకు ఎంత కష్టం వచ్చింది తల్లి, లేరు అనుకున్న మనుషులను దూరంగా ఉన్న మనుషులను వెతికితే ఒక రకం కళ్ళముందే ఉండి కూడా ఇలా వెతికితే చాలా బాధగా ఉంటుంది అని బాధపడుతూ ఉంటాడు.