Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Entertainment
  • Karthika Deepam: సౌందర్యని మోసం చేసిన ఇంద్రుడు.. దీప కోసం వెతుకుతున్న కార్తీక్?

Karthika Deepam: సౌందర్యని మోసం చేసిన ఇంద్రుడు.. దీప కోసం వెతుకుతున్న కార్తీక్?

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ మంచి రేటింగ్ తో దూసుకెళ్తుంది. ఒకటే కథతో నిత్యం ట్విస్ట్ ల మీద ట్విస్టులతో ప్రసారమవుతున్న ఈ సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు నవంబర్ 29 వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం..  

Navya G | Published : Nov 29 2022, 08:36 AM
3 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
16
Asianet Image

ఈరోజు ఎపిసోడ్లో కార్తీక్ ఈ నెంబర్ ఎవరిదో కనుక్కొని నేరుగా వెళ్తాను అని అనగా తప్పకుండా వెళ్తారు కదా అని అంటుంది దీప. అప్పుడు దీప నేను ఒక మాట అడుగుతాను ఏమనుకోరు కదా అని అనగా చెప్పు దీప ఏంటో అనడంతో నాకు ఒకవేళ ఏమైనా అయితే సౌర్యను వెతుకుతారు కదా అని అనడంతో వెంటనే కార్తీక్ ఎందుకు దీప అలా మాట్లాడతావు అని అనగా, నాకు ఏమైనా అయితే తర్వాత పరిస్థితి ఏంటి అని అడుగుతున్నాను డాక్టర్ బాబు నిజంగా తాను నీ కూతురే నేను ఉన్నా లేకపోయినా తను నీ బాధ్యత అని అనగా అప్పుడు కార్తీక్ తన మనసులో దీప నాకు గతం గుర్తుకు వచ్చింది ఆ విషయం చెబితే సంతోషం తట్టుకునే స్టేజ్ లో నీ గుండె లేదు అందుకే చెప్పడం లేదు అనుకుని బాధపడుతూ ఉంటాడు.
 

26
Asianet Image

అప్పుడు కార్తీక్ ఏం చెప్పాలి దీప, సౌర్య నా బాధ్యత అని అప్పుడే చెప్పాను కదా నువ్వు ధైర్యంగా ఉండు అని అంటాడు. మరి మీరు నా దగ్గర ఉంటే ఆ మోనిత ఊరుకుంటుందా అని అడగగా ఫోన్ చేసి విసిగించడం లేదా అని అడగగా నేను తన ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు సౌర్య దొరికే వరకు నీకు బాగా అయ్యేవరకు నేను ఇక్కడే ఉంటాను అని అంటాడు కార్తీక్. అప్పుడు దీప మీకు నిజంగానే గతం గుర్తుకు వచ్చి ఉంటే ఎంత బాగుండేదో డాక్టర్ బాబు అనుకొని బాధపడుతూ ఉంటుంది. అప్పుడు దుర్గా గురించి అడగగా వెంటనే కార్తీక్ ఆ మోనిత దుర్గని అరెస్టు చేయించింది అని చెబితే నువ్వు తట్టుకోలేవు అనుకోని మనసులో అనుకుంటూ ఉంటాడు.
 

36
Asianet Image

 మరొకవైపు సౌందర్య ఆలోచిస్తూ ఉండగా ఇంతలో హిమ అక్కడికి వచ్చి వెళ్దాం పద నానమ్మ పొద్దున్నే ఎవరో ఫోన్ చేస్తానన్నారు కదా అని అనగా ఇంకా రాజమ్మ ఫోన్ చేయలేదే అని అంటుంది. అప్పుడు సౌందర్య రాజమ్మకు ఫోన్ చేస్తుంది. అప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో సౌందర్య ఆనందరావు అక్కడికి బయలుదేరుతారు. మరొకవైపు కార్తీక్ హాస్పిటల్ కి వెళ్ళగా అక్కడ దీప బెడ్ పై లేకపోవడంతో హాస్పిటల్ మొత్తం వెతుకుతూ టెన్షన్ పడుతూ ఉంటాడు. ఎక్కడికి వెళ్ళిపోయావు దీప అసలే ని ఆరోగ్యం బాగోలేదు అని ఏడుస్తూ బాధపడుతూ ఉంటాడు కార్తీక్. మరొకవైపు ఆనంద్ రావు, సౌందర్య వాళ్ళు రాజమ్మ ఇంటికి వెళతారు. అక్కడ రాజమ్మ వాళ్ళు ఇల్లు ఖాళీ చేశారు అనడంతో సౌందర్య షాక్ అవుతుంది.
 

46
Asianet Image

అప్పుడు ఆనందరావు జరిగిన విషయాలు తలుచుకొని నాకు ఇదేదో అనుమానంగా ఉంది సౌందర్య అని అంటాడు. అప్పుడు సౌందర్య ఆ ఇంటి ఆమెను ఎంత బెదిరించి అడిగినా కూడా ఆమె అబద్దాలు చెబుతూ ఉంటుంది. అప్పుడు మోనిత ఈ ఇంద్రుడు ఇద్దరి లెక్కలు తేలుద్దాం అని కోపంతో మాట్లాడుతుంది సౌందర్య. ఆ తర్వాత ఆ ఇంటి ఆమె ఇంద్రుడికి ఫోన్ చేసి అసలు విషయం చెబుతుంది. అప్పుడు ఇంద్రుడు వాళ్ళు ఎన్నిసార్లు వచ్చి ఎన్నిసార్లు అడిగినా కూడా నువ్వు అదే మాట మీద ఉండు భయపడకు అంత నేను చూసుకుంటాను అని అంటాడు. మరొకవైపు శౌర్య బాబాయ్ పిన్నిలను ఎందుకు ఇబ్బంది పెట్టడం నేనే వెతుకుతాను అనుకుంటూ దీప వాళ్ళ కోసం వెతుకుతూ ఉంటుంది.
 

 

56
Asianet Image

మరొకవైపు దీప శౌర్య ఫోటో చేతిలో పట్టుకొని రోడ్డుపై నడుచుకుంటూ వెళుతూ ఉంటుంది. అలా ఒకరికి తెలియకుండా సౌర్య దీప ఇదురు పక్కపక్కనే నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. అప్పుడు ఇంద్రుడు కావాలనే సౌర్యని అక్కడి నుంచి లాక్కొని వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఇంద్రుడు వాళ్ళు ఆటలు వెళుతుండగా దీప రోడ్డు పక్కన పడిపోయి ఉంటుంది. అప్పుడు ఆటో డ్రైవర్ ఎవరు ఆవిడ అక్కడ పోయారు అనగా ఈ పని చూసిన ఇంద్రుడు ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇప్పుడు ఇంద్రుడు ఒడిలో పడుకున్న శౌర్య ఎవరు బాబాయ్ అనడంతో ఎవరూ లేమ్మా అని అబద్ధం చెపుతాడు.
 

66
Asianet Image

మరోవైపు కార్తీక్ కార్లో వెళ్తూ దీప గురించి ఆలోచిస్తూ ఎక్కడికి వెళ్లావు దీప అనుకుంటూ వెళ్తూ ఉంటాడు. మరొకవైపు సౌందర్య వాళ్ళు వెళుతూ ఉండగా శౌర్య అతికించిన పోస్టర్లు చూసి కావాలనే ఎవరో వాళ్ళ పనులకు అడ్డంకి పడుతున్నారు అనుకుంటూ ఉంటాడు ఆనంద్ రావు. అప్పుడు సౌందర్య, ఆనంద్ రావ్ లు దీప శౌర్య వాళ్ళ గురించి తలచుకొని ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటారు.

Navya G
About the Author
Navya G
 
Recommended Stories
Top Stories