- Home
- Entertainment
- Karthika Deepam: మోనిత బిడ్డను దత్తత ఇచ్చేసిన సౌందర్య.. నాకు నా తమ్ముడు కావాలంటూ హిమా గోలాగోలా!
Karthika Deepam: మోనిత బిడ్డను దత్తత ఇచ్చేసిన సౌందర్య.. నాకు నా తమ్ముడు కావాలంటూ హిమా గోలాగోలా!
Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమయ్యే కార్తీకదీపం (Karthika Deepam) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది ఇక ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే.. ఆ బాబు కన్నతల్లిని అని మోనిత చెప్పగా కార్తీక్ కి ఏమీ అర్థంకాదు. ఇక సౌందర్య కూడా ఆనంద్.. మోనిత (Monitha) బిడ్డే అని చెబుతుంది. అంతేకాకుండా ఈ విషయం తన నోటి నుంచి తానే ఒప్పుకోవాలి అని ఈ దత్తత నాటకం ఆడాను అని సౌందర్య (Soundarya) చెబుతుంది.
ఇక మోనిత నాటకాన్ని అందరిముందు బయట పెట్టి నువ్వు మామూలు నటి అయితే నేను మహానటి అని సౌందర్య ప్రౌడ్ గా మోనిత (Monitha) తో చెబుతుంది. ఇక కార్తీక్ (Karthik) నువ్వు పొరపాటు పడుతున్నావు మమ్మి మోనిత బిడ్డ మన దగ్గరికి ఎలా వస్తాడో అని అడగగా సౌందర్య జరిగినదంతా చెబుతుంది. దాంతో కార్తీక్ మరింత స్టన్ అవుతాడు.
ఇక రత్న సీత ద్వారా కార్తీక్ కి ఒక వీడియో చూపించి మోనిత (Monitha) ను గట్టిగా చెంప మీద కొడుతుంది సౌందర్య. అంతేకాకుండా బిడ్డను మోనిత (Monitha) కు ఇచ్చేసి నువ్వు ఎప్పటికీ మా ఇంటి కోడలు కాలేవని చీ కొట్టి నట్టు చెబుతుంది సౌందర్య. ఇక ఇంటికి వచ్చిన ఫ్యామిలీ దీనంగా ఆలోచిస్తూ ఉండగా తమ్ముడు ఏడి అని హిమ అడుగుతుంది.
దాంతో తమ్ముని వాళ్ళ బంధువులు తీసుకెళ్లారని సౌందర్య (Soundarya) చెబుతుంది. అయినా తమ్ముడిని మీరు ఎలా ఇస్తారు? నాకు తమ్ముడు కావాలి అంటూ గట్టిగా ఏడ్చేస్తుంది హిమ (Hima). ఇక హిమ.. అంటూ దీప దగ్గరకు రాగా దీప (Deepa) పై ఒక రేంజ్ లో విరుచుకు పడుతుంది హిమ.
నేను ఏమీ వినను అని హిమ (Hima) ఇంట్లో వాళ్ళ పై ఘాటుగా విరుచుకు పడుతుంది. మరో వైపు సౌర్య (Sourya) కూడా అలానే ఏడుస్తూ ఉంటుంది. ఇక ఈ క్రమంలో రేపటి భాగం లో ఏం జరుగుతుందో చూడాలి .