- Home
- Entertainment
- స్పిరిట్‌లో ప్రభాస్‌కి జోడిగా కరీనా.. రెమ్యూనరేషన్ తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే.. స్టార్ హీరోలను మించి
స్పిరిట్‌లో ప్రభాస్‌కి జోడిగా కరీనా.. రెమ్యూనరేషన్ తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే.. స్టార్ హీరోలను మించి
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుసగా బాలీవుడ్ హీరోయిన్లతో జోడీ కడుతున్నారు. ఇప్పుడు కరీనా కపూర్‌తో రొమాన్స్ కి సిద్ధమయ్యారు. అందుకు కరీనాకి చెల్లించబోతున్నా పారితోషికం వింటేనే దిమ్మతిరిగిపోతుంది.

ప్రభాస్(Prabhas) వరుసగా పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయన ఇప్పుడు `సలార్`(Salaar), `ఆదిపురుష్`, `ప్రాజెక్ట్ కే` చిత్రాల్లో నటిస్తున్నారు. ఆయా చిత్రాలు శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. ఈ సినిమాలపై భారీ అంచనాలున్నాయి.
మరోవైపు ప్రభాస్ వరుసగా బాలీవుడ్ హీరోయిన్లతో రొమాన్స్ చేస్తున్నారు. `సాహో`లో శ్రద్ధా కపూర్, జాక్వెలిన్ ఫెర్నండేజ్, `ప్రాజెక్ట్ కే`లో దీపికా పదుకొనెల(Deepika Padukone)తో నటిస్తున్నారు. నార్త్ మార్కెట్‌ని టార్గెట్‌గా చేసుకుని బాలీవుడ్ భామలను దించుతున్నారు. తాజాగా నెక్ట్స్ సినిమా కోసం మరో బాలీవుడ్ హీరోయిన్‌ని రంగంలోకి దించుతున్నారు.
ప్రభాస్ నెక్ట్స్ `అర్జున్‌రెడ్డి` ఫేమ్ సందీప్ రెడ్డి వంగాతో ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. `స్పిరిట్`(Spirit) పేరుతో ఈ చిత్రం తెరకెక్కనుంది. సైకలాజికల్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం తెరకెక్కనుందని తెలుస్తుంది. అయితే ఇందులో హీరోయిన్ ఎవరనేది సస్పెన్స్ నెలకొంది. తాజాగా హీరోయిన్ కన్ఫమ్ అయినట్టు తెలుస్తుంది.
`స్పిరిట్` చిత్రంలో ప్రభాస్ కి జోడీగా మరో బాలీవుడ్ భామ కరీనా కపూర్(Kareena Kapoor)ని ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. ఆల్మోస్ట్ కన్ఫమ్ అయ్యిందట. ప్రభాస్‌తో బాలీవుడ్ బెబో కరీనా ఫైనల్ అంటూ ప్రముఖ ఓవర్సీస్ క్రిటిక్స్ ఉమైర్ సందు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కరీనా కపూర్ కూడా సైన్ చేసిందట. తాజాగా ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇదిలా ఉంటే `స్పిరిట్`లో ప్రభాస్‌తో కలిసి నటించేందుకు కరీనా కపూర్‌కి భారీ పారితోషికం ఇస్తున్నారట. కరీనా రెమ్యూనరేషన్ తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే అని అంటున్నారు. ఆమెకు ఏకంగా రూ.17కోట్లు రెమ్యూనరేషన్‌గా ఇచ్చేందుకు యూనిట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం సంచలనంగా మారింది. తెలుగులో ఓ స్టార్ హీరోకి ఇచ్చేంత పారితోషికం కావడం విశేషం. ఈ వార్త నెట్టింట, బాలీవుడ్‌తోపాటు టాలీవుడ్‌లోనూ దుమారం రేపుతుంది.