- Home
- Entertainment
- Vishwak Sen: వివాదంలోకి అనసూయని లాగిన కరాటే కళ్యాణి.. విశ్వక్ సేన్ కే నా మద్దతు, హాట్ కామెంట్స్
Vishwak Sen: వివాదంలోకి అనసూయని లాగిన కరాటే కళ్యాణి.. విశ్వక్ సేన్ కే నా మద్దతు, హాట్ కామెంట్స్
టాలీవుడ్ వ్యవహారాల్లో నటి కరాటే కళ్యాణి యాక్టివ్ గా ఉంటారు. తాజాగా ఆమె విశ్వక్ సేన్ వివాదం గురించి చేసిన సోషల్ మీడియా పోస్ట్ వైరల్ గా మారింది.

యంగ్ హీరో విశ్వక్ సేన్, ప్రముఖ టీవీ ఛానల్ యాంకర్ దేవి నాగవల్లి మధ్య వివాదం రోజు రోజుకు ముదురుతోంది. ఇటీవల విశ్వక్ సేన్ తన సినిమా ప్రమోషన్ కోసం.. సినిమా అభిమానిగా పాపులర్ అయిన లక్ష్మణ్ తో రోడ్డుపై ఫ్రాంక్ చేయించాడు. నడిరోడ్డుపై న్యూసెన్స్ కావడంతో ఇది కాస్త వైరల్ గా మారింది.
ఈ అంశంపై డిబేట్ లో పాల్గొనేందుకు విశ్వక్ సేన్ ప్రముఖ చానల్ కి వెళ్ళాడు. అక్కడ దేవి నాగవల్లి యాంకర్ గా చేస్తున్నారు. విశ్వక్ సేన్ ని మానసికంగా డిప్రెషన్ లో ఉన్న వ్యక్తి.. పాగల్ సేన్ అంటూ దేవి నాగవల్లి వ్యక్తిగతంగా విమర్శించారు. దీనితో ఆగ్రహం తెచ్చుకున్న విశ్వక్ సేన్ జాగ్రత్తగా మాట్లాడాలి అంటూ స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చాడు. దీనితో నాగవల్లి గెట్ అవుట్ అనడం.. విశ్వక్ సేన్ అసభ్యకరమైన పదం వాడడంతో వివాదం మరింత ముదిరింది.
ఇప్పుడు ఎవరిది తప్పు.. ఎవరిది ఒప్పు అంటూ సోషల్ మీడియాలో నెటిజన్ల మధ్య హాట్ హాట్ గా చర్చ జరుగుతోంది. ఈ వివాదంలో సెలెబ్రిటీల నుంచి విశ్వక్ సేన్ కి క్రమంగా మద్దతు పెరుగుతోంది. విశ్వక్ సేన్ తన సినిమా ప్రమోషన్స్ కోసం ప్రాంక్ వీడియో చేస్తే.. సదరు ఛానల్ గతంలో టిఆర్పి కోసం చేసిన ఫ్రాంక్ వీడియోల్ని కూడా నెటిజన్లు వైరల్ చేస్తున్నారు. ఇది పబ్లిక్ న్యూసెన్స్ కాదా అంటూ కౌంటర్ ఇస్తున్నారు.
ఇదిలా ఉండగా టాలీవుడ్ వ్యవహారాల్లో నటి కరాటే కళ్యాణి యాక్టివ్ గా ఉంటారు. తాజాగా ఆమె విశ్వక్ సేన్ వివాదం గురించి చేసిన సోషల్ మీడియా పోస్ట్ వైరల్ గా మారింది. ఆమె విశ్వక్ సేన్ కే తన మద్దతు ప్రకటించారు. ఊహించని విధంగా ఆమె ఈ వివాదంలోకి అనసూయని లాగారు.
టీవీ 3*3 వర్సెస్ సేన్ వివాదంలో పూర్తిగా టివి వాళ్లదే తప్పు. నేను హీరోకే సపోర్ట్ చేస్తా. అనసూయ అన్నిసార్లు F పదం వాడినప్పుడు.. నువ్వు రోడ్డు మీద డ్యాన్స్ చేసినప్పుడు ఏమైంది అమ్మా' అంటూ కరాటే కళ్యాణి సెటైరికల్ పోస్ట్ పెట్టారు. గతంలో అర్జున్ రెడ్డి మూవీ సమయంలో అనసూయ టివి 9 స్టూడియోలో సరదాగా ఎఫ్ అనే పదాన్ని ఉపయోగించారు. ఆ వీడియోల్ని నెటిజన్లు వైరల్ చేస్తూ సదరు టివి ఛానల్ ని నిలదీస్తున్నారు.
ఇదిలా ఉండగా బాబు గోగినేని కూడా ఈ వివాదంలో ఇద్దరిది తప్పు ఉందని.. విశ్వక్ సేన్ చేసింది తప్పు అయితే.. గతంలో ఈ టివి ఛానల్ వాళ్ళు చేసిన ఫ్రాంక్ వీడియోలు కూడా తప్పే అంటూ బాబు గోగినేని కామెంట్స్ చేశారు.