MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • కాంతారను నీడలా వెంటాడుతున్న వరుస ప్రమాదాలు, ఏం జరుగుతోంది?

కాంతారను నీడలా వెంటాడుతున్న వరుస ప్రమాదాలు, ఏం జరుగుతోంది?

కాంతార టీమ్ ను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఒకటి తరువాత మరొకటి ఏదో ఒక ప్రమాదం రూపంలో ఈ సినిమా షూటింగ్ కు ఆటంకాలు కలుగుతున్నాయి. తాజాగా కాంతార నటుడి మరణం మూవీ టీమ్ లో విషాదం నింపింది. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Aug 08 2025, 11:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Image Credit : instagram

కాంతార టీమ్ లో మరో విషాదం

ఏముహుర్తంలో కాంతార ఛాప్టర్ 1మూవీ స్టార్ట్ చేశారోన తెలియదు కాని.. వరుస ప్రమాదాలు ఈమూవీ టీమ్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఏదో ఒక సంఘటన జరగడం, ఎవరో ఒకరు చరిపోవడం, లేదా షూటింగ్ కు ఆటంకం కలగడం ఇలా కాంతార టీమ్ ను విషాదాలు నీడలా వెంటాడుతున్నాయి. కాంతార చాప్టర్ 1 సినిమా షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచీ వరుసగా ప్రమాదాలు, విషాద సంఘటనలు ఈ సినిమా టీమ్ ను కలవరపెడుతున్నాయి తాజాగా ఈ టీమ్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ కన్నడ థియేటర్ ఆర్టిస్ట్, నటుడు టి ప్రభాకర్ కళ్యాణి గుండెపోటుతో హఠాత్తుగా కన్నుమూశారు.ఆగస్టు 8 (శుక్రవారం) ఉదయం 8:30 గంటల సమయంలో ఆయన ఉడిపిలోని హిరియడ్కలోని తన నివాసంలో కుప్పకూలిపోయారు. గతంలో ఆయనకు గుండె సంబంధిత చికిత్స జరిగినట్టు తెలుస్తోంది. స్టంట్లు కూడా వేసినట్టు సమాచారం. మూడు రోజుల క్రితం ఆయన తలతిరుగుతూ పడిపోవడంతో ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. చికిత్స అనంతరం ఆయన ఆరోగ్యం మెరుగుపడినట్టు తెలిసింది. అయితే, అనూహ్యంగా శుక్రవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
Image Credit : Asianet News

వెంటాడుతున్న వరుస ప్రమాదాలు

కాంతార టీమ్ ఇలాప్రమాధాలు ఫేస్ చేయడం ఇది మొదటిసారి కాదు. కాంతార చాప్టర్ 1 టీమ్ పలు ప్రమాదాలతో ఇప్పటికే తీవ్రంగా ప్రభావితమైంది. గత నవంబర్‌లో జూనియర్ ఆర్టిస్టులను తీసుకెళ్తున్న వ్యాన్‌కి జరిగిన ప్రమాదం, మళయాళీ జూనియర్ ఆర్టిస్ట్ కపిల్ (33) నదిలో మునిగి చనిపోవడం, హాస్యనటుడు రాకేష్ పూజారి (33) గుండెపోటుతో మరణించడం వంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి.

34
Image Credit : Social Media

భారీ ప్రమాదం నుంచి బయటపడ్డ రిషబ్ శెట్టి..?

ఇటీవల మరో మిమిక్రీ ఆర్టిస్ట్ కళాభవన్ నిజూ కూడా గుండెపోటుతో మరణించినట్టు శాండల్ వుడ్ వర్గాలు తెలిపాయి. ఇప్పుడు టి ప్రభాకర్ కళ్యాణి మృతి ఈ వరుసలో చేరింది. ఇంతే కాకుండా, ఇటీవల కర్ణాటక రాష్ట్రం శివమొగా జిల్లా మణి జలాశయంలో షూటింగ్ జరుగుతున్న సమయంలో బోటు తిరగబడి నటుడు-దర్శకుడు రిషబ్ శెట్టితో పాటు 30 మంది నీటిలో పడిపోయారని వార్తలు వచ్చాయి. అయితే, హోంబాలే ఫిలింస్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఆదర్శ్ ఈ వార్తలను ఖండించారు. “గాలి వాన వల్ల సెట్ కూలింది కానీ, ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు,” అని ఆయన స్పష్టం చేశారు.

44
Image Credit : stockPhoto

కాంతార చాప్టర్ 1 రిలీజ్

అలానే గతంలో ఒకసారి నిర్మించిన భారీ సెట్ గాలి వానతో కాంతార టీమ్ వేసిన సెట్ కూలిపోయింది. అదృష్టవశాత్తూ ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. కానీ వరుస సంఘటనలు వల్ల కాంతార చాప్టర్ 1 టీమ్ టెన్షన్‌లో పడింది. ఈసినిమాకోసం చాలా కష్టపడుతున్నాడు హీరో కమ్ డైరెక్టర్ రిషబ్ శెట్టి. ప్రత్యేకమైన యుద్ధ కళను కూడా నేర్చుకున్నాడు, భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో ఈసినిమాను తెరకెక్కిస్తున్నాడు రిషబ్. రిలీజ్ కు టైమ్ దగ్గరపడుతుంది. అక్టోబర్ 2 విడుదలకు రెడీ అవుతున్న కాంతారా చాప్టర్ 1కు ఇకనైన గండాలు గట్టెక్కుతాయా లేదా చాడాలి.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Michael Jackson: రజనీకాంత్ కోసం మైఖేల్ జాక్సన్ పాడాల్సింది.. 16 ఏళ్ల తర్వాత తమన్ చెప్పిన సీక్రెట్!
Recommended image2
P N Ramachandra Rao: సీనియర్ దర్శకుడికి అరుదైన పురస్కారం.. గవర్నర్‌ చేతుల మీదుగా ప్రదానం
Recommended image3
Samantha: 7 నెలల ప్రెగ్నెన్సీ తో సమంత.. అభిమానుల కోసం ఇంత రిస్క్ చేస్తోందా?
Related Stories
Recommended image1
4k లో శివ సినిమా రీ రిలీజ్, నాగార్జున-ఆర్జీవీ మూవీకి AI టచ్ , రిలీజ్ ఎప్పుడంటే?
Recommended image2
60 లక్షలు బడ్జెట్, గీతా సింగ్ హీరోయిన్, 10 కోట్లు వసూలు చేసిన కామెడీ మూవీ ఏదో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved