- Home
- Entertainment
- Kantara Chapter1 Day 2 Collections: కాంతార 2 రెండో రోజు బాక్సాఫీసు కలెక్షన్లు.. వంద కోట్లతో రచ్చ
Kantara Chapter1 Day 2 Collections: కాంతార 2 రెండో రోజు బాక్సాఫీసు కలెక్షన్లు.. వంద కోట్లతో రచ్చ
kantara chapter1 Collections: `కాంతారః చాప్టర్ 1` మూవీ బాక్సాఫీసు వద్ద రచ్చ చేస్తోంది. ఈ సినిమాకి రెండో రోజు కూడా భారీ కలెక్షన్లు వచ్చాయి. దీంతో ఇది వంద కోట్ల క్లబ్‌లో చేరింది.

`కాంతార 2` మూవీ కలెక్షన్లు
రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన మూవీ `కాంతారః చాప్టర్ 1`. దసరా కానుకగా విడుదలైన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద రచ్చ చేస్తోంది. మంచి వసూళ్ల దిశగా వెళ్తోంది. ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటించింది. గుల్షన్ దేవయ్యా, జయరాం నెగటివ్ రోల్స్ చేశారు. ఈ సినిమాకి కన్నడలో మంచి టాక్ వచ్చింది. కానీ తెలుగులో మిశ్రమ స్పందన లభించింది. `కాంతార` మూవీ స్థాయిలో లేదనే టాక్ వినిపించింది. కాకపోతే ఫస్డ్ డే మంచి వసూళ్లని రాబట్టింది. ఊహించని కలెక్షన్లు రావడం విశేషం.
`కాంతారః చాప్టర్ 1` రెండో రోజుల కలెక్షన్లు
విడుదలైన రోజే 'కాంతార చాప్టర్ 1' మొదటి రోజు రూ.87కోట్లు వసూలు చేసింది. రెండో రోజే 100 కోట్ల క్లబ్‌లో చేరింది. ఇండియాలో సినిమా అంచనా కలెక్షన్ రూ.106 కోట్లు. ప్రపంచ వ్యాప్తంగా రూ.115 కోట్లు వసూలు చేసే అవకాశం ఉంది. ఇంత వేగంగా 100 కోట్ల క్లబ్‌లో చేరిన రెండో కన్నడ సినిమాగా 'కాంతార 1' నిలిచింది.
ఇండియాలో దుమ్ములేపిన కాంతార 2
కర్ణాటకలో మొదటి రోజు 32.7 కోట్లు వసూలు చేసి 'కేజీఎఫ్ 2' రికార్డును బద్దలు కొట్టింది. కన్నడ చిత్ర పరిశ్రమలో ఈ స్థాయి కలెక్షన్లు సాధించిన తొలి సినిమాగా `కాంతార చాప్టర్ 1` నిలిచింది. రెండో రోజు కూడా మంచి వసూళ్లు రాబట్టింది. ఇది ప్రపంచ వ్యాప్తంగా రెండో రోజు రూ.49కోట్ల వరకు వసూళు చేసిందని సమాచారం. మొత్తంగా ఇది ఇండియాలోనే రూ.106 కోట్ల నెట్ వచ్చాయట.
వెయ్యి కోట్లలో చేరుతుందా?
`కాంతార 2` మూవీ ప్రస్తుతం వసూళ్ల జోరు చూపిస్తోంది. వీకెండ్ డేస్ కావడంతో కలెక్షన్లు స్టడీగా ఉన్నాయి. శుక్రవారం గట్టిగా ఆడింది. శనివారం ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఆదివారం మూవీకి తిరుగులేదు. ప్రస్తుతం ఈ చిత్రానికి స్పందన చూస్తుంటే ఇది త్వరలోనే రెండు వందల కోట్లలో చేరబోతుందని అనిపిస్తుంది. మొదటి వీకెండ్‌లోనే ఈజీగా రెండు వందల కోట్లు దాటబోతుంది. అదే సమయంలో ఈ సినిమా వెయ్యి కోట్ల వరకు వసూలు చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు, చిత్ర బృందం భావిస్తుంది. లాంగ్ రన్‌లో మూవీ ఈ టార్గెట్‌ని రీచ్ చేసుకుంటుందని ఆశిస్తున్నారు. మరి నిజంగానే ఆ టార్గెట్‌ని చేరుకుంటుందా అనేది చూడాలి. అయితే కన్నడ నుంచి వెయ్యి కోట్లు దాటిన సినిమాగా `కేజీఎఫ్ 2` రికార్డు సృష్టించింది. ఆ తర్వాత `కాంతార` మొదటి భాగం నాలుగు వందల కోట్లకుపైగా రాబట్టింది. ఇప్పుడు `కాంతారః చాప్టర్ 1` ఆ రికార్డుని బ్రేక్ చేస్తుందా అనేది చూడాలి.
`కాంతారః చాప్టర్ 1` తెలుగు రిజల్ట్ ఏంటి?
`కాంతార 2` తెలుగులోనూ మంచి ఓపెనింగ్స్ ని రాబట్టింది. ఇది మొదటి రోజు రూ.16కోట్ల గ్రాస్, సుమారు రూ.11 నెట్‌ని వసూలు చేసింది. రెండో రోజు కూడా ఫర్వాలేదు. అయితే ఈ చిత్రానికి తెలుగులో మిశ్రమ స్పందన లభించింది. మొదటి పార్ట్ రేంజ్‌లో లేదనే టాక్ వినిపించింది. దీంతో ఆ ప్రభావం కనిపిస్తోంది. తెలుగులో శనివారం, ఆదివారం వరకు డీసెంట్‌గానే కలెక్షన్లని రాబట్టే అవకాశం ఉంది. కానీ సోమవారం వసూళ్లని బట్టి ఈ మూవీ సక్సెస్ ఆధారపడి ఉంది. తెలుగులో ఈ చిత్రానికి దాదాపు రూ.90 కోట్ల వ్యాపారం జరిగిందన్నారు. ఇంకా ఎనభై కోట్ల వరకు నెట్ కలెక్షన్లు రావాలి. ఇది కష్టమనే టాక్ వినిపిస్తోంది. ఏం జరుగుతుందో చూడాలి.