సౌందర్య నుంచి కృతి శెట్టి వరకూ టాలీవుడ్ లో సక్సెస్ అయిన కన్నడ హీరోయిన్లు
టాలీవుడ్ ఇండస్ట్రీ కన్నడ హీరోయిన్లతో నిండిపోతుంది. తెలుగు నాట స్టార్ డమ్ ఉన్న హీరోయిన్లు చాలా మంది కన్నడవారే కావడం విశేషం. అప్పుడు సౌందర్య దగ్గర నుంచి ప్రస్తుతం కృతి శెట్టి వరకూ టాలీవుడ్ లో స్టార్ డమ్ సాధించిన కన్నడ హీరోయిన్లు ఎవరు....?

సౌందర్య ఎన్నో అద్భుతమైన పాత్రల్ని చేశారు. అచ్చ తెలుగు అమ్మాయిలా కనిపించే సౌందర్య తెలుగు చిత్ర పరిశ్రమలో గొప్ప నటిగా పేరు తెచ్చుకున్నారు. సహజనటనతో ఆకట్టుకున్నారు. రాజా, జయం మనదేరా, అమ్మోరు, పవిత్ర బంధం ఇలా ఎన్నో సినిమాల్లో సౌందర్య నటించారు. 2004లో యాక్సిడెంట్ లో మరణించారు.
ప్రేమ కన్నడ నటి అయిన తెలుగులో మంచి పాపులారిటీని పొందింది. అయోధ్య, అంజనీ పుత్రుడు, దేవి లాంటి ఎన్నో అద్భుతమైన సినిమాల్లో ప్రేమ నటించి మెప్పించారు. ఇప్పటికీ.. అదే గ్లామర్ తో.. రీ ఎంట్రీకి ప్లాన్ చేస్తున్నారు ప్రేమ.
ఇడియట్ సినిమాతో సెన్సేషన్ క్రీయేట్ చేసిన కన్నడ నటి రక్షిత తెలుగులో కూడా అద్భుతమైన సినిమాలు చేసి మంచి పాపులారిటీ పొందింది. ఇడియట్, నిజం, లక్ష్మీనరసింహ ఆంధ్రావాలా వంటి తెలుగు సినిమాల్లో ఈమె నటించి మెప్పించింది.
అనుష్క గురించి చెప్పక్కర్లేదు. తెలుగు నాట సెన్సేషన్ అనుష్క. అరుంధతి, బాహుబలి సినిమాలతో తెలుగువారి మనసుల్లో చెరగని ముద్రలా ఫిక్స్ అయిపోయింది అనుష్క. సూపర్, అరుంధతి,బాహుబలి మొదలైన ఎన్నో అద్భుతమైన తెలుగు చిత్రాల్లో అనుష్క నటించిన మెప్పించింది. తెలుగు చిత్ర పరిశ్రమలో ఈమె మంచి ఫాలోయింగ్ ని కూడా పొందింది.
ఇక ఇప్పుడు ఉన్న స్టార్ హీరోయిన్లలో పూజా హెగ్డే కూడాఒకరు. ముఖ్యంగా తెలుగులో అనేక సినిమాల్లో నటించి టాలీవుడ్ ప్రేక్షకుల్ని ఎంతగానో ఈమె తన నటనతో మెప్పించింది. ఒక లైలా కోసం, ముకుందా, దువ్వాడ జగన్నాథం, అల వైకుంఠపురం, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఇలా ఎన్నో సినిమాల్లో పూజా అద్భుతం చేసింది.
ఛలో, భీష్మ , గీత గోవిందం, కిరాక్ పార్టీ, అంజనీ పుత్ర, సుల్తాన్ లాంటి సినిమాలలో నటించి.. స్టార్ హీరోల సరసన ఛాన్స్ కొట్టేసింది రష్మిక. సరిలేరు నీకెవ్వరు సినిమాలో మహేష్ సరసన, పుష్ప సినిమాలో బన్నీ జోడీగా నటించి మెప్పించి.. పాన్ ఇండియా స్టార్ గామారిపోయంది కన్న కస్తూరి. అంతే కాదు ఫిలిం ఫేర్ అవార్డు మరియు సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డు కూడా ఈమె పొందింది.
ఉప్పెన సినిమాతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చి.. ఒక్క సినిమాతోనే స్టార్ డమ్ సంపాధించుకుంది కృతి శెట్టి. వెంట వెంటనే స్టార్ హీరోల సరసన ఛాన్స్ కొట్టేసింది బ్యూటీ. ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీ బిజీగా గడిపేస్తోంది కృతి శెట్టి.
కన్నడ బ్యూటీ ప్రణీత కూడా తెలుగు సినిమాల్లో నటించి పాపులర్ అయ్యింది. అత్తారింటికి దారేది, బావ, పాండవులు పాండవులు తుమ్మెద, రభస మొదలైన తెలుగు సినిమాల్లో అద్భుతమైన నటన ప్రదర్శించింది. ప్రస్తుతం పెళ్లి చేసుకుని ఫ్యామీలీ లైఫ్ ను లీడక్ చేస్తోంది.
మరో వైపు టాలీవుడ్ లో ఇస్మార్ట్ బ్యూటీ గా పేరు తెచ్చున్న హీరోయిన్ నాభా నటేష్ తెలుగు, కన్నడ సినిమాల్లో వరుస సినిమాల్లో నటించింది. ఇస్మార్ట్ శంకర్, నన్ను దోచుకుందువటే, సోలో బ్రతుకే సో బెటర్ వంటి తెలుగు సినిమాల్లో నాభా నటేష్ నటన అద్భుతం. ఇలా కన్నడ నాట నుంచి టాలీవుడ్ కు ఇంకా హీరోయిన్లు వస్తూనే ఉన్నారు.