- Home
- Entertainment
- Director Kangana: డైరెక్టర్ గా సెటిల్ అవుతానంటున్న కంగనా రనౌత్.. సినిమా స్టార్ట్ చేసిన బాలీవుడ్ బ్యూటీ
Director Kangana: డైరెక్టర్ గా సెటిల్ అవుతానంటున్న కంగనా రనౌత్.. సినిమా స్టార్ట్ చేసిన బాలీవుడ్ బ్యూటీ
బాలీవుడ్ లో కాంట్రవర్సీ అంటే కంగనా.. కంగనా అంటే కాంట్రవర్సీ. హీరోయిన్ గా నిర్మాతగా బీటౌన్ లో వివాదాలకు పెట్టింది పేరుగా ఉన్న కంగనా ఇక కంప్లీట్ గా మెగా ఫోన్ పట్టుకోబోతుంది.

ఇక కంప్లీట్ గా డైరెక్ట్ అవతారం ఎత్తబోతోంది కంగనా రనౌత్. ఆ రకంగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నది బాలీవుడ్ బ్యూటీ. ఇప్పటికే మణికర్ణిక ద క్వీన్ ఆఫ్ ఝాన్సీ సినిమాను క్రిష్‌తో కలిసి డైరెక్ట్ చేసింది కంగనా. ఈసినిమాన కంప్లీట్ అయిపోయింది అనుకున్న టైమ్ లో క్రిష్ దగ్గర నుంచి ఆమె తీసుకుని కంప్లీట్ చేసింది.
అయితే ఈ సినిమాకు ఆమె ఆపద్ధర్మంగా దర్శకురాలు అయ్యిందనుకున్నారు కాని మెగా ఫోన్ ను అలాగా పట్టుకుని, డైరెక్షన్ ను కొనసాగిస్తుంది అని అనుకోలేదు. కానీ తాను ఓ కొత్త సినిమాను తన దర్శకత్వంలోనే తెరకెక్కించబోతున్నట్టు కంగనా రనౌత్ ప్రకటించింది.
ఇక ఈ విషయం గురించి ఆమె మాట్లాడుతూ..నేను ఓ కొత్త సినిమాను నిర్మిస్తూ దర్శకత్వం వహించబోతున్నాను.. అంతే కాదు ఈ సినిమాలో నటిస్తాను కూడా అన్నది బ్యూటీ. గతేడాదే నిర్మాతగా మారిన కంగనా.. మణికర్ణిక ఫిలింస్ పతాకంపై టికు వెడ్స్ షేరు అనే సినిమాను నిర్మించింది.
డార్క్ కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో నవాజుద్దీన్ సిద్ధికీ, అన్విత్ కౌర్ జంటగా నటించారు.ఇక ఈసినిమా త్వరలో ఓటీటీలో రిలీజ్ కానుందీ. ఎమర్జెన్సీ, మణికర్ణిక రిటర్న్స్, ద లెజెండ్ ఆఫ్ దిడ్డ అనే మరో రెండు సినిమాలు ఆమె సొంత ప్రొడక్షన్‌లో నిర్మిస్తున్నారు.
ఇలా నిర్మాణం, దర్శకత్వంలో తీరిక లేని కంగనా... అటు నటిగా కూడా బిజీగానే ఉంది. తేజస్, దాకద్ సినిమాలతో త్వరలో ఆడియన్స్ ను మెప్పించడానికి రెడీ అవుతుంది. ఇలా మల్టీ టాలెంట్ తో ఆడియన్స్ ను ఆకట్టుకుంటుంది కంగనా.