- Home
- Entertainment
- బాలీవుడ్ ఖాన్లు, కుమార్ లపై కారాలు, మిర్యాలు నూరుతున్న కంగనా రనౌత్ , అంతా వాళ్లే చేశారట
బాలీవుడ్ ఖాన్లు, కుమార్ లపై కారాలు, మిర్యాలు నూరుతున్న కంగనా రనౌత్ , అంతా వాళ్లే చేశారట
కాంట్రవర్సీ అంటే కంగనా... కంగనా అంటే కాంట్రవర్సీ అన్నట్టు ఉంటుంది బాలీవుడ్ బ్యూటీ. ఏ అంశంలోనైనా ఒక స్టాండ్ తీసుకుని స్టార్ట్ చేసిందంటే.. అవతలివాళ్శకు చెమటలు పట్టాల్సిందే. ఇక ప్రస్తుతం తన పరిస్థితికి ఖాన్లే కారణం అంటోంది.

బోల్డ్ స్టేట్‌మెంట్స్ ఇవ్వడంలో ఎప్పుడూ ముందుంటుంది కంగనా రనౌత్. సంచలన వ్యాఖ్యలతో బాలీవుడ్ లో బాంబులు పేలుస్తూ ఉంటుంది కంగనా. ఆమె సృష్టించే ప్రకంపనలు భారీ వివాదాలకు దాని తీసిన రోజులు ఉన్నాయి. ఇక తాజాగా మరో వివాదానికి తెర తీసింది బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్. తాజాగా కంగనా బాలీవుడ్ ఖాన్‌లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
బిగినింగ్ నుంచి కష్టాల పడుతూ పైకి వచ్చింది కంగనా. అయితే కెరీర్‌లో తాను ఎదుర్కొన్న ఒడిదుడుకులపై ఓ ఇంటర్వ్యూలో సంచలన విషయాలు వెల్లడించింది. తాను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఇప్పుడున్న స్ధితికి చేరుకున్నానని తెలిపింది. బాలీవుడ్ లో ఖాన్‌ల సినిమాల నుంచి కుమార్‌ల ప్రోద్బలంతో తీసే సినిమాలను తాను తిరస్కరించడంతో గడ్డు పరిస్ధితిని ఎదుర్కొన్నానని చెప్పింది.
బాలీవుడ్‌లో మేల్ డామినేషన్ మూవీస్ ను తాను దీటుగా ఫేస్ చేశానని.. అలా వాళ్ళను ఎదిరిస్తూ..ఎదిగేవరకూ ఎన్నో ఎత్తుపల్లాలను చూశానని తెలిపింది. లేకుంటే చాలా తక్కువ టైమ్ లోనే తాను ఉన్నత స్థితికి వచ్చేదాన్నంటోంది కంగనా.
అంతే కాదు తాను ఇది ప్లాన్‌తో చేసింది కాదని, రజనీష్ ఘయ్, దీపక్ ముకుత్, సోహెల్ మక్లై వంటి ఎందరో నిర్మాతలు, పురుషుల మద్దతుతో తన ప్రస్ధానం ఇక్కడ వరకూ సాగిందని అంటోంది కంగనా. మహిళ విజయం వెనుక పురుషుడి సహకారం ఉంటుందని మగువల విజయం ఎన్నో అంశాలతో ముడిపడిఉన్నదని బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ అన్నారు.
అంతే కాదు ఈ మధ్య బాలీవుడ్ ను ఏకి పడేస్తుంది కంగనా. సౌత్ సినిమాలు ఇండియన్ బాక్సాఫీస్ ను కొల్లగొడుతుంటే.. వాళ్ళను చూసి బుద్ది తెచ్చుకోమంటూ.. బాలీవుడ్ కు హితబోధ కూడా చేసింది కంగనా. మన హీరోలు, మన మేకర్స్ తెలివితేటను ఆమె సోషల్ మీడియా వేధికగా పొగడ్తలతో ముంచెత్తింది.