అయోధ్య రామ మందిరం వద్ద ఫైర్ బ్రాండ్.. ఎంతో అందంగా కంగనా రనౌత్ ఫోజులు
నటిగా, ఫైర్ బ్రాండ్ గా కంగనా రనౌత్ నేషనల్ వైడ్ క్రేజ్ సొంతం చేసుకుంది. నటిగా జాతీయ అవార్డులు సొంతం చేసుకున్న కంగనా రనౌత్ విభిన్నమైన చిత్రాలతో దూసుకుపోతోంది.
నటిగా, ఫైర్ బ్రాండ్ గా కంగనా రనౌత్ నేషనల్ వైడ్ క్రేజ్ సొంతం చేసుకుంది. నటిగా జాతీయ అవార్డులు సొంతం చేసుకున్న కంగనా రనౌత్ విభిన్నమైన చిత్రాలతో దూసుకుపోతోంది. కంగనా రనౌత్ వరుసగా బోల్డ్ స్టేట్మెంట్స్ ఇస్తూ వివాదాల్లో ఉండడం చూస్తూనే ఉన్నాం.
కంగనా రనౌత్ ఈ మధ్యనే పద్మశ్రీ అవార్డు కూడా అందుకుంది. బాలీవుడ్ సెలెబ్రిటీలపై, ప్రస్తుతం రాజకీయాలపై కంగనా రనౌత్ ఓపెన్ గా స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటుంది. ఎన్ని విమర్శలు ఎదురైనా కంగనా తన దూకుడు మాత్రం తగ్గించడం లేదు.
ఇటీవల కంగనా రనౌత్ ఎక్కువగా గుడులు గోపురాల చుట్టూ తిరుగుతోంది. కంగనా రనౌత్ కొన్ని నెలల క్రితం తిరుమల శ్రీవారిని అలాగే శ్రీకాళహస్తిని సందర్శించింది.
బాలీవుడ్ లో కంగనా రనౌత్ కు గిట్టని వారు చాలా మందే ఉన్నారు. కొందరి పేర్లు వింటేనే కంగనా కోపంతో రగిలిపోతుంది. ఇక మీడియా ముందు కూడా కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు చేస్తుండడం చూస్తూనే ఉన్నాం.
అయితే నేడు అయోధ్యలో రామమందిరం ప్రాణ ప్రతిష్ట సందర్భంగా కంగనా అక్కడికి చేరుకుంది. చాలా కాలంగా కంగనా హిందూ భావజాలంతో తరచుగా పోస్ట్ లు చేయడం చూస్తూనే ఉన్నాం.
అయోధ్య రామమందిరం వద్ద కంగనా రనౌత్ సాంప్రదాయ వస్త్ర దాహరణలో మెరిసింది. అక్కడ స్వామిజీలని కలుసుకుంది. ఆలయ ప్రాంగణంలో చీపురు పట్టి శుభ్రం చేసింది.
ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయోధ్య రామ మందిరం కనిపించేలా కంగనా ఎంతో అందంగా ఈ ఫోటోలు దిగింది. శ్రీరాముడి జన్మభూమి ఇదే అంటూ కంగనా కామెంట్ పెట్టింది.