కమల్ హాసన్ తో జయసుధ పెళ్ళి మిస్ అయ్యిందా..? ఈ విషయంలో సహజనటి ఏమంటుందంటే..?
కమల్ హాసన్ జయసుధ పెళ్ళి చేసుకోవాలి అనుకున్నారా..? ఇద్దరు అప్పట్లో ప్రేమించుకున్నారా..? మరి ఎందుకు వీరి పెళ్ళి జరగలేదు..? ఈ విషయంలో సహజనటి జయ సుధ ఏమంటున్నారు..?

జయసుధ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సహజ నటిగా కొన్ని దశాబ్ధాల నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఎన్టీఆర్ నుంచి కమల్ హాసన్ వరకు... ఎంతో మంది నటుల సరసన మెరిశారు జయసుధ. ఈ ప్రయాణంలో ఎన్నో సత్కారాలు, అవార్డ్ లు, రివార్డ్ లు, సన్మానాలు.. ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక మార్క్ ను క్రియేట్ చేసుకున్న నటి జయసుధ.
సెకండ్ ఇన్నింగ్స్ లో తల్లిగా, బామ్మగా.. ఇలా ఎన్నో పాత్రలకు ప్రాణం పోస్తూ వస్తోన్న జయసుధ.. రాజకీయాల్లో కూడా అడుగు పెట్టి.. ఎమ్మెల్యేగా పనిచేశారు. ఇక తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించిన సహజనటి.. ఓ ప్రశ్నకు మాత్రం అసహనం వ్యక్తం చేసింది. తనకు కమల్ హాసన్ కు పెళ్ళి అని ప్రచారం జరిగిన సంఘటనపై ఆమెకు ప్రశ్న ఎదురయ్యింది.
కమల్ తో ఆమె పెళ్లంటూ అప్పట్లో జరిగిన ప్రచారంపై ఆమెకి ప్రశ్న ఎదురైంది. ఆ మాటకి ఆమె చాలా అసహనానికి లోనయ్యారు. ఓ వైపు కోపంతో ఉన్నా..ఇటు ఈ ప్రశ్నకు జవాబు కూడా ఇచ్చారు. ఆమె మాట్లాడుతూ.. ఇప్పుడు ఆ విషయం అవసరమా? చాలామంది ఏనాటి సంగతులను గురించో ఇప్పుడు అడుగుతున్నారు. నేను .. కమల్ అప్పట్లో బాలచందర్ గారి సినిమాల్లో వరుసగా నటించాము. ఆ సినిమాలకి సంబంధించిన పాటలను స్టేజ్ పై పాడాము. అప్పుడు జరిగిన ప్రచారం అది.
నిజానికి కమల్ హాసన్ చాలా మంచి సింగర్. ఆయనతో పాటు నేను కూడా పాటలు పాడేదానిని. చూడటానికి మా జంట బాగుండేది. దాంతో మేము జంటగా ఉంటే బాగుంటుందని కొంతమంది అనుకుని ఉండొచ్చు... అప్పుడు అలా జరిగిన ప్రచారమే ఇది. అంతే కాని మేమేపి పెళ్ళి చేసుకోవాలి అని అనుకోలేదు అన్నారు జయసుధ.
అయితే ఈ ప్రచారం జరగడానికి.. అప్పట్లో ఈ విషయం తమిళ పేపర్లలో రావడమే కారణం. వాళ్లు ఏదో ఒకటి రాయాలి కదా..? అందువలన అలాంటి ప్రచారం జరిగి ఉంటుంది అన్నారు. ఈ ప్రశ్న అడగడంపై కూడా ఆమె కాస్త ఫైర్ అయ్యారు.
అసలు ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నారనే చాలామంది ఇంటర్వ్యూలు ఇవ్వడం లేదు. నేను ఉన్నది ఉన్నట్టుగా చెబుతున్నానని నన్ను అడుగుతున్నారు. నేను గొప్పనటిని అన్నందుకు సంతోషం. కానీ ఇలాంటి తిరకాసు ప్రశ్నలు అడిగితే మాత్రం సమాధానం చెప్పను అన్నారు జయసుధ.