- Home
- Entertainment
- అందుకే ఆ రొమాంటిక్ సీన్ చేయాల్సి వచ్చింది.. పొలిమేర సినిమాపై హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
అందుకే ఆ రొమాంటిక్ సీన్ చేయాల్సి వచ్చింది.. పొలిమేర సినిమాపై హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
Kamakshi Bhaskarla: డాక్టర్ అనిల్ విశ్వనాధ్ తెరకెక్కించిన చిత్రం 'మా ఊరి పొలిమేర'. ఈ సినిమాలో సత్యం రాజేష్, కామాక్షి భాస్కర్ల హీరోహీరోయిన్లుగా నటించారు. ఇక ఇందులోని ఓ సీన్ గురించి ఇప్పుడు తెలుసుకుందామా..

కరోనా టైంలో ప్రభంజనం..
డాక్టర్ నుంచి దర్శకుడిగా మారి అనిల్ విశ్వనాధ్ తెరకెక్కించిన చిత్రం 'మా ఊరి పొలిమేర'. కరోనా సెకండ్ వేవ్ అంటే 2021 ఎండింగ్‌లో ఓటీటీలో విడుదలైన ఈ చిత్రం.. మొదట ఎవరూ పట్టించుకోకపోయినా.. ఆ తర్వాత పాజిటివ్ రివ్యూస్ రావడంతో జనాలు ఎగబడి మరీ చూశారు. బ్లాక్ మ్యాజిక్ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ చిత్రం క్లైమాక్స్ ట్విస్టులు మైండ్ బ్లాంక్ అయ్యేలా చేస్తాయి. ఇక ఓటీటీలో సూపర్ హిట్ కావడంతో నెక్స్ట్ పార్ట్‌ను థియేట్రికల్‌గా విడుదల చేశారు మేకర్స్.
'పొలిమేర 2 కూడా హిట్'..
పొలిమేర 2 థియేటర్లలో విడుదల చేస్తే.. అది బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది. దాదాపుగా రూ. 20 కోట్లు కలెక్ట్ చేసిన ఈ మూవీ మంచి టాక్ తెచ్చుకోవడమే కాదు.. పార్ట్ 3పై కూడా ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది. ఇదిలా ఉంటే పొలిమేర ఫస్ట్ పార్ట్‌లో పలు సీన్స్ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆ సీన్స్ అందుకే చేశా..
మా ఊరి పొలిమేర మూవీలో ఇంటిమేట్ సీన్స్ ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా హీరోయిన్ కామాక్షి భాస్కర్ల, హీరో సత్యం రాజేష్ మధ్య వచ్చిన ఓ ఇంటిమేట్ సీన్‌పై.. అప్పట్లో పెద్ద రచ్చ జరిగింది. అంతేకాకుండా నెగటివ్ కామెంట్స్ కూడా వచ్చాయి. అయితే తాజాగా ఆ సీన్ గురించి హీరోయిన్ కామాక్షి భాస్కర్ల పలు కీలక కామెంట్స్ చేసింది.
'ఆ సీన్ కావాలని చేయలేదు'
ఆ సీన్ కావాలని చేసింది కాదని అంటోంది హీరోయిన్ కామాక్షి భాస్కర్ల. పొలిమేర మొదటి భాగంలో ఉన్న ఇంటిమేట్ సీన్ ఉద్దేశపూర్వకంగా పెట్టింది కాదు. కథలో భాగంగా ఆ సీన్ వస్తుందని.. అది కథకు కీలకం అని పేర్కొంది. అయితే ఆ సీన్‌కు మా ప్రొడక్షన్ వాల్యూస్ తక్కువగా ఉండటం వల్ల.. జనాలకు సరిగ్గా కన్వే చేయలేకపోయామని చెప్పుకొచ్చింది. మా దగ్గర సరైన బడ్జెట్ ఉండి ఉంటే.. అది రైట్‌గా వెళ్లేదేమో.. సెకండాఫ్‌లో కూడా కొమురయ్య ఉండే రూల్స్ గురించి చెబుతూ.. ఈ సీన్ ప్రస్తావన ఉంటుందని తెలిపింది.
ఏడాదిలో మూడు చిత్రాలు..
కామాక్షి భాస్కర్ల.. ఈ ఏడాది మూడు చిత్రాల్లో నటించింది. విశ్వక్ సేన్ 'లైలా', అల్లరి నరేష్‌తో '12ఏ రైల్వే కాలనీ', నవీన్ చంద్రతో 'షోటైమ్' చిత్రాల్లో నటించింది. నటనకు ఆస్కారం ఉన్న పాత్రల్లో నటించి.. తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది.

