MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • ఎన్బీకే 111లో బాలయ్య కనిపించేది ఇలానే.. 50 ఏళ్ల కెరీర్‌లోనే ఫస్ట్ టైమ్‌, గూస్‌బంమ్స్

ఎన్బీకే 111లో బాలయ్య కనిపించేది ఇలానే.. 50 ఏళ్ల కెరీర్‌లోనే ఫస్ట్ టైమ్‌, గూస్‌బంమ్స్

బాలకృష్ణ.. గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. బుధవారం ప్రారంభమైన ఈ మూవీకి సంబంధించిన పోస్టర్‌ క్యూరియాసిటీని క్రియేట్‌ చేస్తోంది. పలు షాకింగ్‌ విషయాలను రివీల్‌ చేస్తోంది. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Nov 26 2025, 06:52 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో బాలయ్య కొత్త సినిమా
Image Credit : Twitter

గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో బాలయ్య కొత్త సినిమా

నందమూరి బాలకృష్ణ నటించిన `అఖండ 2` మూవీ మరో వారంలో విడుదల కాబోతుంది. దీన్ని పాన్‌ ఇండియా రేంజ్‌లో విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా మరో కొత్త సినిమాని ప్రారంభించారు. గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో బాలయ్య సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. `వీరసింహారెడ్డి` వంటి విజయవంతమైన సినిమా తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న చిత్రమిది. `ఎన్బీకే111` వర్కింగ్‌ టైటిల్‌తో షూటింగ్‌ జరుపుకోనున్న ఈ సినిమా నేడు బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
నయనతారతో నాల్గో సారి బాలయ్య రొమాన్స్‌
Image Credit : Asianet News

నయనతారతో నాల్గో సారి బాలయ్య రొమాన్స్‌

ఇందులో హీరోయిన్‌గా లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. `శ్రీరామరాజ్యం`, `సింహ`, `జై సింహా` వంటి చిత్రాల తర్వాత బాలయ్య, నయనతార కలిసి నటిస్తోన్న చిత్రమిది. వీరి కాంబినేషన్‌లో దాదాపు అన్ని చిత్రాలు విజయం సాధించాయి. `జై సింహా`నే ఆశించిన ఫలితాన్ని రాబట్టుకోలేకపోయింది. పైగా కంటెంట్ స్ట్రాంగ్‌గా ఉంటేనే నయనతార సినిమాలు చేస్తుంది. దీంతో ఈ చిత్రంపై అంచనాలు ఏర్పడ్డాయి. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై నిర్మాత వెంకట సతీష్ కిలారు గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.

Related Articles

Related image1
నయనతార వద్ద అత్యంత ఖరీదైన కారు, ధర తెలిస్తే ఫ్యూజులు ఔట్‌.. విజయ్‌ కారు కంటే కాస్ట్లీ
Related image2
ఆంధ్ర కింగ్‌ తాలూకా మూవీ బాక్సాఫీసు టార్గెట్‌.. రామ్‌ పారితోషికం వెనక్కి ఇవ్వాలంటూ నిర్మాతల డిమాండ్‌
35
గ్రాండ్‌గా ప్రారంభమైన ఎన్బీకే 111 మూవీ
Image Credit : Asianet News

గ్రాండ్‌గా ప్రారంభమైన ఎన్బీకే 111 మూవీ

బుధవారం గ్రాండ్‌గా ప్రారంభమైన ఈ మూవీకి సంబంధించిన ఓపెనింగ్‌ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మంత్రులు అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్ స్క్రిప్ట్‌ను నిర్మాతలకు అందజేశారు. బాలకృష్ణతో అనేక బ్లాక్‌బస్టర్‌లను అందించిన దర్శకుడు బి గోపాల్ క్లాప్ కొట్టారు. బాలయ్య కుమార్తె తేజస్విని కెమెరా స్విచ్ ఆన్ చేశారు. మొదటి షాట్‌కు బోయపాటి శ్రీను, బాబీ, బుచ్చి బాబు  దర్శకత్వం వహించారు.

45
మైండ్‌ బ్లాక్‌ చేస్తోన్న `ఎన్బీకే111` పోస్టర్‌
Image Credit : Asianet News

మైండ్‌ బ్లాక్‌ చేస్తోన్న `ఎన్బీకే111` పోస్టర్‌

దర్శకుడు గోపీచంద్‌ మలినేని ఈ మూవీని హిస్టారికల్‌ కథాంశంతో రూపొందిస్తున్నారు. ఆయన మొదటిసారి ఇలాంటి హిస్టారికల్‌ కథతో రాబోతుండటం విశేషం. ఈ సందర్భంగా ఓ పోస్టర్‌ని విడుదల చేశారు. ఎన్బీకే111 వర్కింగ్‌ టైటిల్‌తో ఈ లుక్‌ ఉంది. ఇందులో బాలయ్య రెండు గెటప్స్ లో ఉన్నారు. ఓ లుక్‌లో యోధుడిగా కనిపిస్తున్నారు, మరో లుక్‌లో రాజులా కనిపిస్తున్నారు. బాలయ్య రాజుగా పలు సినిమాలు చేశారు. కానీ యోధుడిగా మొదటిసారి కనిపిస్తున్నారు. ఆయన లుక్‌ చూస్తుంటే మైండ్‌ బ్లాక్‌ అవ్వాల్సిందే.

55
ద్విపాత్రాభినయం చేస్తోన్న బాలయ్య
Image Credit : Asianet News

ద్విపాత్రాభినయం చేస్తోన్న బాలయ్య

కమర్షియల్ బ్లాక్‌బస్టర్స్ రూపొందించే తన ప్రత్యేక మాస్ టచ్‌ను ఒక భారీ చారిత్రక కథలో మిళితం చేస్తూ, నందమూరి బాలకృష్ణను ఇప్పటివరకు చూడని ఓ కొత్త అవతార్ చూపించబోతున్నారట దర్శకుడు. స్పెషల్ పోస్టర్‌లో బాలకృష్ణ ఒక చేతిలో ఖడ్గం, మరో చేతిలో యాంకర్‌ పట్టుకుని తిరుగులేని రాజసంతో కనిపించారు. గడ్డం, పొడవాటి జుట్టు, శక్తివంతమైన తీరుతో సమరశూరుడిలా అదరగొట్టారు. అదే సమయంలో ఈ పోస్టర్‌లో కోట, సముద్రం మెయిన్‌గా కనిపిస్తున్నాయి. ఇందులో బాలయ్య హీరోగా, విలన్‌గా కనిపించబోతున్నారనే మరో టాక్‌ వినిపిస్తోంది. దీంతో సినిమాపై క్యూరియాసిటీ పెరిగింది. హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం భావోద్వేగాలు, యాక్షన్‌, విజువల్ వండర్ గా ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని పంచబోతోందని టీమ్‌ చెప్పడం విశేషం.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
నందమూరి బాలకృష్ణ
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Pawan Kalyan Net Worth: మెగా హీరో, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆస్తి ఎంతో తెలుసా? పవర్ స్టార్ రెమ్యునరేషన్ ఎంతంటే?
Recommended image2
Jabardasth: సుధీర్ మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయాడు.. బోరున ఏడ్చిన రష్మీ గౌతమ్.. జబర్దస్త్ లో ఎమోషనల్ సీన్..
Recommended image3
OTT Horror Movie: ఆ రోడ్డులో వెళ్తే మాయం.. ప్రయాణికులను భయపెడుతున్న దెయ్యం సినిమా
Related Stories
Recommended image1
నయనతార వద్ద అత్యంత ఖరీదైన కారు, ధర తెలిస్తే ఫ్యూజులు ఔట్‌.. విజయ్‌ కారు కంటే కాస్ట్లీ
Recommended image2
ఆంధ్ర కింగ్‌ తాలూకా మూవీ బాక్సాఫీసు టార్గెట్‌.. రామ్‌ పారితోషికం వెనక్కి ఇవ్వాలంటూ నిర్మాతల డిమాండ్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved