Brahmamudi: అప్పు ప్రవర్తనికి షాక్ లో కళ్యాణ్.. కన్నీళ్లు పెట్టుకున్న కావ్య తల్లితండ్రులు!
Brahmamudi: స్టార్ మా లో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ ప్రేక్షకుల హృదయాలని గెలుచుకొని మంచి టిఆర్పి రేటింగ్ ని సంపాదించుకుంటుంది. తాతకి ఇచ్చిన మాట కోసం భార్యతో నాటకం ఆడుతున్న ఒక భర్త కథ ఈ సీరియల్. ఇక ఈరోజు అక్టోబర్ 5 ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దాం.
ఎపిసోడ్ ప్రారంభంలో స్వప్న, రాహుల్ ఇద్దరు కలిసి ఆర్చరీ ఆడుతారు. గురి తప్పి బాణం పక్కకి వెళ్ళిపోతుంది. నీవల్లే అంటే నీ వల్లే అనుకుంటారు ఇద్దరు. ఆ తర్వాత కళ్యాణ్ ఆడతాను అంటాడు. ఈ ఆట నీకు బాగా ఆడటం వచ్చు కదా రా అని అప్పుని పిలుస్తాడు కళ్యాణ్. కావ్య కూడా వెళ్ళమనటం తో అప్పు కళ్యాణ్ వెనక వెళుతుంది. తల్లిదండ్రులు సైగ చేయడంతో అనామిక కళ్యాణ్ వెనక వెళ్లి బ్రో ఇది జంటలు ఆడే ఆట ఇక్కడ నీకేం పని, మేము ఆడతాము అనటంతో అక్కడినుంచి వెళ్ళిపోతుంది అప్పు.
ఆ తర్వాత కళ్యాణ్ తో నేను కాబోయే భార్యని నేను కదా నీతో నేను ఆడాలి కానీ తనని ఎందుకు పిలిచావు అంటుంది. అప్పుడే జెలసీ స్టార్ట్ అయిందా అని నవ్వుతాడు కళ్యాణ్. గేమ్ స్టార్ట్ చేయమని సీతారామయ్య చెప్పడంతో గేమ్ ఆడుతారు కళ్యాణ్ అనామిక. కానీ గురితప్పి ఓడిపోతారు. యూత్ అంటారు కానీ ఎవరూ గెలవడం లేదు అని ఆటపట్టిస్తాడు సీతారామయ్య.
మీ వల్ల కాకపోతే చెప్పండి నేను బావ కొట్టి చూపిస్తాము అంటుంది చిట్టి. మీకెందుకు తాతయ్య అంత శ్రమ మీ వారసుడిని నేను ఉన్నాను కదా మీ పరువు నేను నిలబడతాను అంటూ రాజ్ దంపతులు ఆ గేమ్ ఆడుతారు. అందులో విన్ అవుతారు రాజ్ దంపతులు. అందరూ సంతోషంతో క్లాప్స్ కొడతారు.అనామిక మాత్రం నువ్వు గెలవలేదు కానీ అన్నయ్యకు మాత్రం బాగా సపోర్ట్ ఇస్తున్నావు అంటుంది.
ఎవరు గెలిస్తే ఏంటి మేమిద్దరం ఒకటే అంటాడు కళ్యాణ్. గెలిచిన ఆనందంలో భర్తని హత్తుకుంటుంది కావ్య. ఆ తర్వాత ఎవరు లేనప్పుడుభర్త రాసిన చీటీ తీసి చదువుదాం అనుకుంటుంది. కానీ ఇంతలో చిట్టి పిలవడంతో ఆ చీటీని కొంగును కట్టేసుకుని వెళ్ళిపోతుంది. మరోవైపు మూడిగా ఉన్న అప్పుని ఎందుకలా ఉన్నావు అంటుంది ధాన్యలక్ష్మీ.
ఏం లేదండి నేను బాగానే ఉన్నాను, మీరే బాగా అలసిపోయినట్లుగా ఉన్నారు అంటుంది అప్పు. అవునమ్మా పండగ కదా పనులు ఎక్కువైపోయాయి. ఈ దండలు కాస్త గుమ్మానికి కట్టేయ్యవా అని అడుగుతుంది ధాన్యలక్ష్మి. అలాగే అనే ఆమె చేతిలో దండలు తీసుకొని అక్కడి నుంచి గుమ్మం దగ్గరకి వెళ్ళబోతుంటే అక్కడికి కళ్యాణ్ వస్తాడు. బ్రో ఎందుకు నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు. అనామిక వస్తుందని నీకు చెప్పాలనుకున్నాను అంటాడు.
నీ లొల్లి అంతా నాకెందుకు అయినా నాతో అవసరం తీరిపోయింది కదా. ఇప్పుడు నీ అనామిక తో మాట్లాడుకో పో అంటుంది అప్పు. నువ్వు ఎందుకలా మాట్లాడుతున్నావు, నాకేమీ అర్థం కావడం లేదు. నావల్ల ఏమైనా తప్పు జరిగిందా అని అడుగుతాడు కళ్యాణ్. ఇంతలో అనామిక కళ్యాణ్ ని రెండుసార్లు పిలుస్తుంది. ఇంకా వెళ్లకపోతే వచ్చి లాక్కుపోయేలాగా ఉంది వెళ్ళు అని అప్పు చెప్పడంతో అక్కడినుంచి వెళ్ళిపోతాడు కళ్యాణ్.
తర్వాత అందరూ కలిసి పూజ దగ్గరికి వెళ్తారు.కావ్య దంపతులు పూజ చేస్తూ ఉంటారు. అక్కడ కూడా అనామిక మనం గెలిస్తే మనమే పూజ చేసే వాళ్ళం కదా అంటుంది. నువ్వు ఇంకా ఆ విషయం వదలలేదా, ఎవరు పూజ చేస్తే ఏంటి అంతా మన ఇంట్లో వాళ్ళే కదా అంటాడు కళ్యాణ్. అలా అని కాదు కాబోయే కొత్త కోడల్ని కదా హైలెట్ అవ్వాలని నాకు కూడా ఉంటుంది కదా అంటుంది అనామిక.
ఏం పర్వాలేదులే దగ్గర్లోనే దీపావళి ఉంది కదా అప్పుడు ట్రై చేద్దాం అంటాడు కళ్యాణ్. పూజ అయిపోయిన తర్వాత ఇంటి పత్రాలు తెచ్చి భర్త చేతిలో పెట్టి తల్లిదండ్రులకి ఇమ్మంటుంది. ఇప్పుడు ఎందుకు అంటాడు రాజ్. చెడు చెవిలో చెప్పాలి, మంచి అందరిలోనూ చెప్పాలి ఇప్పుడే ఇవ్వండి అంటుంది కావ్య. సరే అని అత్తమామల చేతిలో ఇంటి పత్రాలు పెట్టి మీకు ఇంక ఎలాంటి కష్టం రాకూడదు అంటాడు.
మీరు తోడుగా ఉండగా మాకు ఎలాంటి కష్టము రాదు. మా ఇద్దరు కూతుర్లు ఈ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ బ్రతుకు ఎలా ఉంటుందో అని భయపడ్డాము కానీ ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది అని కృష్ణమూర్తి దంపతులు ఇద్దరు ఆనందంతో కన్నీరు పెట్టుకుంటారు. తరువాయి భాగంలో జంటలు జంటలుగా డాన్స్ వేస్తారు. తర్వాత కావ్య పక్కకు వెళ్లి భర్త లెటర్ చదివి షాక్ అవుతుంది.