- Home
- Entertainment
- తెగిన రీతూ, డీమాన్ పవన్ బంధం, ప్రేమ జంట హార్ట్ బ్రేక్.. 11వ వారం నామినేషన్‌లో ఉన్నది వీరే
తెగిన రీతూ, డీమాన్ పవన్ బంధం, ప్రేమ జంట హార్ట్ బ్రేక్.. 11వ వారం నామినేషన్‌లో ఉన్నది వీరే
బిగ్ బాస్ తెలుగు 9 11వ వారం నామినేషన్ల ప్రక్రియ చాలా వాడి వేడీగా జరిగింది. ఇందులో డీమాన్ పవన్, రీతూల మధ్య నామినేషన్ హార్ట్ బ్రేక్ చేసేలా, గుండెని బరువెక్కించేలా సాగడం విశేషం.

బిగ్ బాస్ తెలుగు 9 11వ వారం నామినేషన్
బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్ పది వారాలు విజయవంతంగా పూర్తి చేసుకుంది. పదోవారం ఇద్దరు కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. శనివార నిఖిల్, ఆదివారం ఎపిసోడ్‌లో గౌరవ్‌లను ఇంటికి పంపించారు బిగ్ బాస్. ప్రస్తుతం హౌజ్‌లో తనూజ, కళ్యాణ్, ఇమ్మాన్యుయెల్, సుమన్ శెట్టి, భరణి, సంజనా, రీతూ చౌదరీ, డీమాన్, దివ్య ఉన్నారు. ఇక పదకొండవ వారం నామినేషన్ల ప్రక్రియ షురూ అయ్యింది. సోమవారం వచ్చిందంటే బిగ్ బాస్ హౌజ్ రణరంగంగా మారుతుంటుందనే విషయం తెలిసిందే. ఈ సోమవారం ఏకంగా ప్రేమ జంట గుండె బద్దలయ్యింది. రీతూ, పవన్ ఒకరిపై ఒకరు అరవడంతో హౌజ్ మొత్తం హీటెక్కిపోయింది.
కెప్టెన్ చేతిలో అసలైన నామినేషన్ పవర్
సోమవారం ఎపిసోడ్‌లో 11వ వారం నామినేషన్ల ప్రక్రియ జరిగింది. ఈ వారానికి సంబంధించిన నామినేషన్‌లో ఎవరు ఇద్దరిని నామినేట్ చేయాలి, ఎవరు ఒక్కరినే నామినేట్ చేయాలనేది కెప్టెన్‌గా అయిన తనూజ చేతిలో ఉంటుందని తెలిపారు బిగ్ బాస్. దీంతో ఇమ్మాన్యుయెల్‌కి రెండు అవకాశాలు ఇచ్చింది తనూజ. ఆయన భరణి, రీతూ చౌదరీలను నామినేట్ చేశాడు. రీతూ గేమ్ విషయానికి వచ్చినప్పుడు ఎక్కడో కాన్ఫిడెన్స్ లూజ్ అవుతుందని తెలిపాడు ఇమ్మూ. నువ్వు కన్‌ఫ్యూజ్ కావడం లేదా? అంటూ రీతూ ప్రశ్నించింది. నువ్వు కన్‌ఫ్యూజ్ అయ్యావు కాబట్టే బెలూన్‌ని నొక్కితే అది ఫౌల్ గేమ్ అయ్యిందని, నువ్వు అంత కాన్ఫిడెంట్ అయితే బొమ్మల దాంట్లో మీ మమ్మీకి ఇవ్వొచ్చుగా అని వాదించింది రీతూ.
ఇమ్మాన్యుయెల్‌పై ఫైర్ అయిన భరణి
అనంతరం భరణి నామినేషన్‌లోనూ ఇమ్మాన్యుయెల్‌తో గొడవ అయ్యింది. ఇంతకు ముందులాగా భరణి అన్న ఎఫర్ట్స్ పెట్టడం లేదనిపిస్తుందని తెలిపాడు ఇమ్మాన్యుయెల్. దీనికి భరణి స్పందిస్తూ, నాకు తగిలిన దెబ్బలు నీకు తగిలితే ఇంతకు ముందులాగా ఎఫర్ట్స్ పెట్టగలవా అని అన్నాడు. ఇమ్మూ ఏదో చెప్పబోతుండగా, నేను అడిగిన దానికే సమాధానం చెప్పాలని, పర్‌ఫెర్మెన్స్ అంటే 360 డిగ్రీలో ఉంటుందని, కేవలం గేమ్‌లు మాత్రమే కాదన్నాడు భరణి. ప్రతి టాస్క్ 100శాతం తన ఎఫర్ట్స్ పెట్టి ఆడుతున్నట్టు తెలిపారు భరణి. ఈ సారి వాయిస్‌రైజ్ చేసి రచ్చ చేశాడు. కానీ నాకు అలా అనిపించలేదని ఇమ్మాన్యుయెల్ చెప్పడం హైలైట్‌గా నిలిచింది.
రీతూ, పవన్ హార్ట్ బ్రేక్
అనంతరం డీమాన్ పవన్.. రీతూ చౌదరీని నామినేట్ చేశాడు. నువ్వు అరవడం వల్ల నా తప్పు లేకపోయినా, నా వల్లే తప్పు జరుగుతుందనేది పోట్రే అవుతుందని నాకు బాధగా ఉంది. ప్రతిసారి తన తప్పు లేదని, వెనక్కి తీసుకోవడానికి మాట్లాడానికి ట్రై చేశాను, కానీ ట్రస్ట్ లేదు, అది లేదు, ఇది లేదంటూ చాలా హర్ట్ చేశావ్. కానీ ప్రతి సారి నేను మీ మంచే కోరుకున్నాను. నేనైతే చాలా బాధపడుతున్నాను అని తెలిపాడు పవన్. పవన్ తన కుండని పగలగొట్టినప్పట్నుంచి రీతూ కన్నీళ్లు పెట్టుకుంటూనే ఉంది. హార్డ్ బ్రేక్ అయినంత పనైంది ఆమెకి. ఏం మాట్లాడలేని దీన స్థితిలో కనిపించింది. నమ్మిన వాడే ఇలా చేస్తున్నాడనే ఆవేదన తన కళ్లల్లో కనిపించింది.
రీతూపై పవర్ అరుపులు, హీటెక్కిన హౌజ్
చివరగా వచ్చి నాతో మాట్లాడొద్దు అని చెప్పాను కదా పవన్ అంటూ గట్టిగా అరిచింది రీతూ. ఎందుకు అరుస్తున్నావని పవన్ అనగా, నాకు అవడం లేదు పవన్ అని రీతూ అరిచింది. దీంతో నాకూ అవడం లేదంటూ పవన్ గట్టిగా అరవడంతో ఒక్కసారిగా హౌజ్ హీటెక్కిపోయింది. మొత్తంగా ఈ ఇద్దరి మధ్య హార్ట్ బ్రేక్ అయ్యింది. ఇన్నాళ్లు తన ప్రేమ బాండింగ్‌తో రాణిస్తూ వస్తోన్న ఈ ఇద్దరు ఇప్పుడు తమ బంధానికి గుడ్ బై చెప్పినట్టుగానే ఈ నామినేషన్ సాగింది. ఈ దెబ్బతో ఈ ఇద్దరు సెపరేట్ అవుతారా? మళ్లీ కలిస్తారా? అనేది చూడాలి.
ఇమ్మాన్యుయెల్‌కి భరణి క్రేజీ కౌంటర్
అనంతరం భరణి.. ఇమ్మాన్యుయెల్‌ని నామినేట్ చేస్తూ, టెడ్డీ బేర్ టాస్క్ లో నా కంటే వెనకాలే ఉన్నావని భరణి చెప్పగా, ఫాస్ట్ గా ఉరికావంటే ఆరోగ్యం బాగానే ఉన్నట్టుగా అని ఇమ్మూ కౌంటర్ ఇచ్చారు. తనని మాట్లాడనివ్వూ ఇమ్మాన్యుయెల్ అంటూ ఫైర్ అయ్యాడు భరణి. అనారోగ్యం నా బాడీకి, నా మైండ్‌కి కాదంటూ మండిపడ్డాడు భరణి. అనంతరం డీమాన్ పవన్ ని కళ్యాణ్ నామినేట్ చేస్తూ, స్టాండ్ తీసుకోవడం లేదు, నా దగ్గర నుంచి రావాల్సిన సపోర్ట్ నీకు రావడం లేదని కళ్యాణ్ అనగా, నన్ను మ్యాన్ హ్యాండ్లింగ్ అన్నప్పుడు బాధపడుతుంటే, నేను దేని గురించి బాధపడుతున్నానో నువ్వు పట్టించుకోలేదని పవన్ తెలిపారు.
తనూజదే తప్పని తేల్చిన కళ్యాణ్
అందులో తప్పెవరిదీ అని పవన్ అడగ్గా, పట్టుకున్నప్పుడు అలా జరిగింది, కానీ అందులో తప్పు తనూజదే అని తెలిపారు కళ్యాణ్. దీంతో అటు పవన్, తనూజ, కళ్యాణ్ ల మధ్య వాడివేడీగా వాదనలు జరిగాయి. అనంతరం దివ్యనీ రీతూ నామినేట్ చేసింది. ఇలా అలా అంటూ తన గేమ్‌ని లో చేస్తున్నావని రీతూ అనగా, ఎవరి గేమ్ బెటరో నేను చెప్పుకోవద్దా అంటూ దివ్య రియాక్ట్ అయ్యింది. నీకు ఇచ్చిన ఈ టాస్క్ పట్టుకోవడం కూడా రాదు, నువ్వేం మాట్లాడుతున్నావ్ గేమ్స్ గురించి అంటూ గట్టిగా కౌంటర్ ఇచ్చింది దివ్య. అనంతరం రీతూని నామినేట్ చేసింది దివ్య. ఈ క్రమంలోనూ ఇద్దరి మధ్య వాదనలు జరిగాయి. దీంతో మరోసారి హౌజ్ హీటెక్కింది.
11వ వారం నామినేషన్ లిస్ట్
ఓవరాల్‌గా 11వ వారం నామినేషన్‌లో డీమాన్ పవన్.. రీతూతోపాటు కళ్యాణ్‌ని, భరణి.. రీతూతోపాటు ఇమ్మాన్యుయెల్‌ని, ఇమ్మాన్యుయెల్.. భరణి, రీతూని, కళ్యాణ్..డీమాన్ పవన్, సంజనాలను, రీతూ.. దివ్య, సంజనాలను, సుమన్.. కళ్యాణ్‌ని, దివ్య.. రీతూని, సంజనా.. కళ్యాణ్‌ని నామినేట్ చేశారు. కానీ ఫైనల్‌గా సంజనా, డీమాన్ పవన్, కళ్యాణ్, భరణి, దివ్య, ఇమ్మాన్యుయెల్ నామినేషన్‌లో ఉండటం విశేషం. మరి మూడు నాలుగు నామినేషన్స్ వచ్చిన రీతూ ఈ నామినేషన్‌లో లేకపోవడం ఆశ్చర్యపరుస్తుంది. ఆ ట్విస్ట్ ఏంటనేది చూడాలి.