Brahmamudi: అట్టర్ ఫ్లాపైన కళ్యాణ్ ప్లాన్.. కావ్యను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న రాజ్?
Brahmamudi: స్టార్ మా లో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ టాప్ రేటింగ్ ని సంపాదించుకుంటూ టాప్ సీరియల్స్ సరసన స్థానం సంపాదించుకుంటుంది. కష్టాల్లో ఉన్న మరదలికి సాయం చేయాలనుకుని తిప్పలు పడుతున్న ఒక బావ కధ ఈ సీరియల్. ఇక ఈరోజు జూలై 20 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.
ఎపిసోడ్ ప్రారంభంలో పోలీసుల కైనా క్రైమ్ జరిగాకే తెలుస్తుంది. అలాంటిది ఇది ఎలాంటి తప్పులు చేస్తుందో మాకెలా తెలుస్తుంది అని రాజ్ ని అడుగుతుంది రుద్రాణి. అదంతా మాకు తెలియదు బతిమాలుతారో, బుజ్జగిస్తారో తెలియదు కానీ మరొకసారి ఇలాంటి తప్పు మళ్లీ జరగకుండా చూసుకోవలసిన బాధ్యత మీదే అని తల్లి కొడుకులకి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు రాజ్. మిగిలిన వాళ్ళందరూ కూడా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఈ ఇంట్లో ఎవరు తప్పు చేసినా నన్నే అంటారేంటి అంటూ ఫ్రెష్టేట్ అవుతుంది రుద్రాణి.
ఆ తర్వాత రాజ్ ఆఫీస్ రూమ్ లో ఉండగా శృతి డిజైన్స్ తీసుకొని వస్తుంది. ఫ్రీ లాన్సర్ వచ్చిన తర్వాత వర్క్ చాలా ఫాస్ట్ గా అవుతున్నట్లుంది అంటాడు రాజ్. అవును సార్ అంటూ రాజ్ చేతిలో డిజైన్స్ పెడుతుంది శృతి. డిజైన్స్ చూసిన రాజ్ డిజైన్స్ చాలా బాగున్నాయి ఇంత బాగా గీసిన అమ్మాయిని అప్రిషియేట్ చేయకపోతే బాగోదు తనకి ఫోన్ చేసి ఇవ్వు నేను మాట్లాడతాను అంటాడు రాజ్. ఇబ్బందిగా మొహం పెడుతుంది శృతి. కానీ రాజ్ మరొకసారి చెప్పడంతో కావ్య పేరు డిలీట్ చేసి ఆ ప్లేస్ లో శిరీష అని మార్చి కావ్య కి ఫోన్ చేసి నీతో సార్ మాట్లాడుతారంట ఒకసారి మాట్లాడు అంటుంది శృతి.
ఆ మాటలు విన్న రాజ్ అవతలి వైపు మహానటి అనుకుంటే ఇవతల వైపు సహజనటి అని శృతిని, కావ్యని అనుకుంటాడు రాజ్. శృతి ఫోన్ రాజ్ కి ఇచ్చిన తర్వాత నేను మాట్లాడి తర్వాత ఫోన్ ఇస్తాను ఈ లోపు వెళ్లి నీ పని చేసుకో అంటాడు రాజ్. శృతి ఇబ్బందిగానే అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత కావ్య తో మాట్లాడుతూ డిజైన్స్ చాలా బాగా గీసారు మా ఆవిడ ఉంది మంచి డిజైన్ గీస్తుందేమో అనుకుంటే 11 చుక్కల ముగ్గు వేసుకుంటుంది అందరికీ మీలాగా టాలెంట్ ఉండదు అని కావ్య ని కావాలనే తిడతాడు రాజ్.
భర్త వెటకారాన్ని అర్థం చేసుకున్న కావ్య నా భర్త కూడా అంతే సార్ సంస్కారం లేకుండా భార్యని అందరి ముందు తిడతాడు భార్య మనసు అర్థం చేసుకొని కర్కోటకుడు అంటూ రివర్స్ కౌంటింగ్ ఇస్తుంది. ఫోన్ పెట్టేసిన తర్వాత మాట్లాడుతున్నది నేనని తెలిసే ఇలా చేస్తుంది. ఇది మరీ ఇంత ముదురు అనుకోలేదు అనుకుంటాడు రాజ్. మరోవైపు కళ్యాణ్ పిజ్జా షాప్ కి వెళ్లి అప్పుచేత పది పిజ్జాలు డెలివరీ ఇచ్చేలాగా షాపు వాడితో మాట్లాడుతాడు ఈ విషయం అప్పుకి తెలియకూడదు అంటాడు.
షాప్ అతను అప్పుని పిలిచి పది డెలివరీలు డెలివరీ చేసి రా అని చెప్పి పంపిస్తాడు. తర్వాత కళ్యాణ్ తో డెలివరీలు ఇప్పిస్తే తనకి ఎలా హెల్ప్ అవుతుంది అని అడుగుతాడు. అదే నా స్కీం అని చెప్పి అప్పుని ఫాలో అవటానికి వెళ్ళిపోతాడు కళ్యాణ్. తర్వాత అప్పు ఒక ఇంటికి వెళ్తుంది. ఆమె వెనకే ఉన్న కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి పిజ్జా డెలివరీ తీసుకొని నేను చెప్పినట్లు చేయు అని ఆర్డర్ వేస్తాడు. సరే అని అప్పు దగ్గర పిజ్జా తీసుకొని వేయి రూపాయలు ఎక్స్ట్రా ఇస్తాడు ఆ ఫ్రెండ్.
ఎందుకు ఎక్కువ డబ్బులు ఇస్తున్నారు అని అప్పు అడుగుతుంది. వయసులో ఉన్నావు కదా అవసరానికి పనికొస్తుంది అంటూ ఆమె చేయి పట్టుకొని మాట్లాడుతాడు. అతని చెంప పగలగొట్టి బయటికి వచ్చేస్తుంది అప్పు. ఈ మాటలు అన్నీ ఫోన్లో నుంచి విన్న కళ్యాణ్ తన ప్లాన్ అట్టర్ ఫ్లాప్ చేసినందుకు తన ఫ్రెండ్ ని తిడతాడు. మరోవైపు డైటింగ్ లో ఉన్న స్వప్న కళ్ళు తిరిగి పడిపోతుంది. అందరూ కంగారు పడతారు డాక్టర్ కి ఫోన్ చేయటంతో ఆమె వచ్చి అందం కోసం ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు ఈ రోజుల్లో పిల్లలు.
ఈ అమ్మాయి కూడా నీరసంతోనే కళ్ళు తిరిగి పడిపోయింది అని చెప్పి బలానికి మందులు రాసి వెళ్ళిపోతుంది. అప్పుడే ఆఫీసు నుంచి రాజ్ కూడా వస్తాడు. కడుపుతో ఉన్న దానివి బలమైన ఆహారం తినాలి కదా అని మందలిస్తుంది చిట్టి. తినాలని ఉన్న చేసి పెట్టే వాళ్ళు ఎవరూ లేరు. కావ్యని జీరా రైస్ చేసి పెట్టమంటే చేసి పెట్టలేదు. ఈ ఇంట్లో నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అని నిష్టూరంగా మాట్లాడుతుంది స్వప్న. అబద్ధం చెప్పకు అని చెప్పి జీరా రైస్ అందరి ముందుకి తీసుకొస్తుంది ధాన్యలక్ష్మి.
పని మనిషిని పారేయమంటే పారేయలేనట్లు ఉంది అని మనసులోనే తిట్టుకుంటుంది స్వప్న. ఎందుకు అబద్ధం చెప్పావు ఇప్పుడు పిన్ని ఆ రైస్ తీసుకొచ్చింది కాబట్టి సరిపోయింది లేదంటే అందరూ కావ్య అని తప్పు పట్టేవారు అని భార్యని వెనకేసుకొస్తూ స్వప్నకి చివాట్లు పెడతాడు రాజ్. తరువాయి భాగంలో సోఫా వెనకాతల కూర్చొని డిజైన్స్ వేస్తున్న కావ్యని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటాడు రాజ్.