- Home
- Entertainment
- Brahmamudi: కావ్య చేసిన పనికి కన్నీరు పెట్టుకున్న కళ్యాణ్.. షాకింగ్ నిర్ణయం తీసుకున్న కృష్ణమూర్తి?
Brahmamudi: కావ్య చేసిన పనికి కన్నీరు పెట్టుకున్న కళ్యాణ్.. షాకింగ్ నిర్ణయం తీసుకున్న కృష్ణమూర్తి?
Brahmamudi: స్టార్ మా లో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ టాప్ సీరియల్స్ కి గట్టి పోటీ ఇస్తూ మంచి రేటింగ్ ని సంపాదించుకుంటుంది. మరిది లోని టాలెంట్ ని బయట ప్రపంచానికి తెలియజేసిన ఒక వదిన కధ ఈ సీరియల్. ఇక ఈరోజు జూలై 31 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం

ఎపిసోడ్ ప్రారంభంలో ఆరు నెలలలో 10 లక్షల రూపాయలు, రెండు రోజుల్లో 50 వేల రూపాయలు కట్టమని తీర్పు ఇస్తారు పెద్ద మనుషులు. అంత డబ్బు రెండు రోజుల్లో కట్టలేము అంటాడు కృష్ణమూర్తి. అనవసరంగా లేనిపోని కేసుల్లో ఇరుక్కోవటం ఎందుకు డబ్బు కట్టేయండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు పెద్ద మనుషులు. అంత డబ్బు ఎలా కట్టడం అని ఆలోచనలో పడతారు కృష్ణమూర్తి దంపతులు.
మరోవైపు కావ్య కుటుంబ సభ్యులందరికీ కాఫీఇస్తూ ఉంటుంది. ఇంతలో కొరియర్ వస్తుంది. కళ్యాణ్ ని పెళ్లి తీసుకోమంటుంది కావ్య. కొరియర్ తీసుకున్న కళ్యాణ్ వదిన ఇది మీకోసమే వచ్చింది అని చెప్తాడు. కానీ నిజానికి అది మీకోసమే అది తెరిచే అర్హత మీకేముంది అని చెప్పి కళ్యాణ్తో కొరియర్ ఓపెన్ చేస్తుంది కావ్య. కొరియర్ ఓపెన్ చేసిన కళ్యాణ్ ఇదేదో వీక్లీ లాగా ఉంది వదిన అంటూ అయోమయంగా అంటాడు. అవును కవి గారు పూర్తిగా చూడండి అంటుంది కావ్య.
అప్పుడు అందులో తన కవిత ఫోటోతో సహా ప్రింట్ అయి ఉండడం చూసి బాగా ఎమోషనల్ అవుతాడు. ఆనందంతో కన్నీరు పెట్టుకుంటాడు. అందరూ కంగారు పడిపోతారు ఏం జరిగింది అని అడుగుతారు. వదిన నా కవిత ప్రింట్ చేయించింది. ఇంట్లో నా కవితని కనీసం ఎవరు తినే వాళ్ళు కూడా ఉండేవారు కాదు మీరు నా టాలెంట్ గుర్తించి బయట ప్రపంచానికి తెలిసేలాగా చేశారు అని కావ్యకి కృతజ్ఞతలు చెప్తాడు. ఇందులో నా గొప్పతనం ఏముంది.
మీ టాలెంట్ వల్లే ఆ కవిత ప్రింట్ అయింది. ఇప్పుడు ప్రపంచం మొత్తం మీ టాలెంట్ గుర్తిస్తుంది. ఇకపై మీరు పెద్ద కవి అవుతారు అంటుంది కావ్య. ఇంట్లో వాళ్ళందరూ కళ్యాణ్ కి కంగ్రాట్స్ చెప్తారు. ఇప్పుడు ఈ కవితని ఎంతమంది చదువుతారో అనుకుంటాడు కళ్యాణ్. మరోవైపు అదే కవితని చదువుతూ ఆనంద పడుతూ ఉంటుంది ఒక గుర్తు తెలియని కొత్త క్యారెక్టర్. మరోవైపు తన కవితని తీసుకొని అప్పు దగ్గరికి వెళ్తాడు కళ్యాణ్. జరిగినదంతా చెప్తాడు.
ఆ పుస్తకంలోని కవిత అచ్చు వేయించడానికి ఎంత డబ్బులు ఖర్చు పెట్టావు అసలు నీకు వెళితే నాకు ఏమీ అర్థం కావడం లేదు అంటుంది అప్పు. నీకు మా వదినకి ఎంత తేడా.. అయినా గార్డభానికి ఏం తెలుసు గంధం వాసన అంటాడు కళ్యాణ్. అయినా కళ్యాణ్ కవితని చులకనగా మాట్లాడుతుంది అప్పు. ఇంతలో ఒక అమ్మాయి వచ్చి మీ కవిత నిన్న పుస్తకంలో పడింది చాలా బాగుంది రేపటి రోజున మీరు పెద్ద కవి అవుతారు అంటూ కళ్యాణ్ దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకుని వెళ్ళిపోతుంది.
చూసావా నా టాలెంటు అన్నట్టు అప్పువైపు చూస్తాడు కళ్యాణ్. ఆ అమ్మాయిని సెట్ చేయడానికి ఎంత ఖర్చు పెట్టావు అని వెటకారంగా అడుగుతుంది అప్పు. కోపంగా చూస్తాడు కళ్యాణ్. మరోవైపు కళ్యాణ్ టాలెంట్ ని బయటికి తీసినందుకు కావ్యకి థాంక్స్ చెప్తాడు రాజ్. నేనేమీ మీ కోసం మీ పిన్ని కోసం చేయలేదు మా మరిది గారి ఆనందం కోసం చేశాను. తాటి మనిషి అనుకొని కాదు సొంత మనిషి అనుకొని చేశాను అంటూ భర్తని దెప్పుతుంది కావ్య. ఒక మంచి పని చేశావు అని మెచ్చుకునే లోపు ఇంకేదో తింగరి పని చేస్తావు అంటూ కావ్య ని చివాట్లు పెడతాడు రాజ్.
నీ తింగరి వేషాలు ఆపేసి ముందు నేను చెప్పేది విను. రేపు నాతోపాటు ఆఫీస్ కి రావాలి. మిడిల్ క్లాస్ వాళ్ళని టార్గెట్ చేసుకొని నగలు డిజైన్స్ చేయడానికి క్లైంట్స్ వస్తున్నారు. వాళ్ళతో నువ్వు మాట్లాడాలి రేపు పొద్దున్నే త్వరగా బయలుదేరు అనటంతో సరే అంటుంది కావ్య. మరోవైపు కృష్ణమూర్తి చేసిన అప్పు తీర్చడానికి ఇల్లు అమ్మటానికి నిర్ణయించుకుంటాడు. అలా చేస్తే నా వల్లే ఇదంతా జరిగింది అని జీవితాంతం నన్ను నేను క్షమించుకోలేను అంటుంది కనకం.
నీ తింగరి వేషాలు ఆపేసి ముందు నేను చెప్పేది విను. రేపు నాతోపాటు ఆఫీస్ కి రావాలి. మిడిల్ క్లాస్ వాళ్ళని టార్గెట్ చేసుకొని నగలు డిజైన్స్ చేయడానికి క్లైంట్స్ వస్తున్నారు. వాళ్ళతో నువ్వు మాట్లాడాలి రేపు పొద్దున్నే త్వరగా బయలుదేరు అనటంతో సరే అంటుంది కావ్య. మరోవైపు కృష్ణమూర్తి చేసిన అప్పు తీర్చడానికి ఇల్లు అమ్మటానికి నిర్ణయించుకుంటాడు. అలా చేస్తే నా వల్లే ఇదంతా జరిగింది అని జీవితాంతం నన్ను నేను క్షమించుకోలేను అంటుంది కనకం.
తప్పు నీది మాత్రమే కాదు నాది కూడా ఉంది. ఇంటి బాధ్యత నువ్వు చూసుకుంటున్నావు అని ఏమి పట్టించుకోకుండా వదిలేసాను అంటాడు కృష్ణమూర్తి. మీరు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేశాను అని గిల్టీగా ఫీల్ అవుతుంది కనకం. ఈ మాటలన్నీ అప్పు వింటుంది. తరువాయి భాగంలో ఇంటి పరిస్థితి గురించి కావ్యకి చెప్తాడు కళ్యాణ్. అదే గమనించిన రాజ్ ఏం జరిగింది అని కావ్యని అడుగుతాడు ఏమీ జరగలేదు అని ముభావంగా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది కావ్య కానీ కళ్యాణ్ ద్వారా అసలు విషయం తెలుసుకుంటాడు రాజ్.