కాజోల్, శిల్పాశెట్టి, కిరణ్‌రావు పిల్లలు మిస్ క్యారేజ్ హీరోయిన్లు..షాకిచ్చే విషయాలు బహిర్గతం!
First Published Jan 7, 2021, 2:22 PM IST
మాతృత్వం అనేది మహిళకి గొప్ప వరం. అదొక గొప్ప అనుభూతి. మాతృత్వం మించిన ఆనందం ఓ మహిళకి మరోటి లేదు. కానీ మన హీరోయిన్లు ఓ సందర్భంలో మాతృత్వాన్ని కోల్పోయారు. మిస్ క్యారేజ్‌తో ఇబ్బంది పడ్డారు. కాజోల్, శిల్పాశెట్టి, కిరణ్ రావు, సైరా బాను వంటి తారల జీవితంలో చేతు జ్ఞాపకంలా మిగిలిన ఆ విషయాలేంటో ఓ సారి చూద్దాం.

`సాగర కన్య`గా తెలుగు ఆడియెన్స్ ని అలరించి, తన స్లిమ్ అందంతో మంత్రముగ్దుల్ని చేసిన శిల్పా శెట్టి ముంబయికి చెందిన వ్యాపారవేత్త రాజ్‌కుంద్రాని 2009లో వివాహం చేసుకుంది. అయితే తన మొదటి కుమారుడు వియాన్ జన్మించడానికి ముందు ఓ బేబీని కోల్పోయింది శిల్పా. తాను మొదట అబార్షన్ చేయించుకుంది.

బాలీవుడ్ స్టార్ హీరో, స్టార్ హీరోయిన్ అజయ్ దేవగన్, కాజోల్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లైన రెండేళ్లకే ఆమెకి మిస్ క్యారీ అయ్యింది. `కభీ ఖుషీ కభీ గమ్` సినిమా టైమ్‌లో కాజోల్ ఆసుపత్రి పాలయ్యింది. ఆ సమయంలోనే ఇది జరిగిందట. దీంతో కాజోల్ చాలా బాధపడింది.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?