- Home
- Entertainment
- కమ్ బ్యాక్ కోసం కాజల్ ఆరాటం.. ఫిట్‌నెస్ కా బాప్ అనిపిస్తూ హాట్ పోజులు.. ఏమాత్రం తగ్గడం లేదుగా
కమ్ బ్యాక్ కోసం కాజల్ ఆరాటం.. ఫిట్‌నెస్ కా బాప్ అనిపిస్తూ హాట్ పోజులు.. ఏమాత్రం తగ్గడం లేదుగా
కాజల్ ఇటీవల కుమారుడికి జన్మనిచ్చి సినిమాలకు దూరమైంది. తల్లైన తర్వాత కాజల్ జోరు పెంచుతున్నట్టు కనిపిస్తుంది. ఆమెలోని హాట్ నెస్ కూడా ఓవర్‌లోడ్ అయ్యింది. ఇప్పుడు ఫోటో షూట్లతో మైండ్ బ్లాక్ చేస్తుంది.

టాలీవుడ్ అందాల చందమామ కాజల్ తెలుగుతెరపై చేసిన సందడి అంతా ఇంతా కాదు. దశాబ్దన్నరపాటు టాలీవుడ్‌లో ఊపేసింది. స్టార్ హీరోయిన్‌గా రాణించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ సినిమాలకు గ్యాపిచ్చిన విషయం తెలిసిందే. పెళ్లి, ఆ తర్వాత కుమారుడు నీల్ కిచ్లుకి జన్మనివ్వడంతో బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది. కానీ తన అందం మాత్రం ఏమాత్ర తగ్గలేదని నిరూపిస్తుంది.
ఇటీవల వరుసగా ఫోటో షూట్లతో కనువిందు చేస్తుంది కాజల్. తాను వెండితెరపైకి వచ్చే అవకాశం లేకపోవడంతో ఇలా ఫోటో షూట్లతో అభిమానులను కనువిందు చేస్తుంది. వారికి నిత్యం టచ్‌లోనే ఉంటుంది. హాట్ ఫోటో షూట్లతో మైండ్ బ్లాక్ చేస్తుంది. రెట్టింపు గ్లామర్, హాట్‌నెస్‌తోపాటు ఫిట్‌నెస్ విషయంలోనూ తాను తగ్గేదెలే అని నిరూపించుకుంటుంది.
తాజాగా కాజల్ కలర్‌ఫుల్ డ్రెస్‌లో కనువిందు చేస్తుంది. ఆమె నిండైన దుస్తులు ధరించి మత్తెక్కించే పోజులిచ్చింది. ఓర చూపులతో హోయలు పోతూ కాజల్ ఇచ్చిన పోజులు నెటిజన్లకి మైండ్ బ్లాక్ చేస్తున్నాయి. సిట్టింగ్‌లో కిల్లింగ్ పోజులతో ఇంటర్నెట్‌ని షేక్ చేస్తుంది కాజల్.
ప్రస్తుతం కాజల్ లేటెస్ట్ ఫోటో షూట్ పిక్స్ వైరల్ అవుతున్నాయి. ఆమె అభిమానులను ఖుషి చేస్తున్నాయి. కాజల్‌ని ఇంత ఫిట్‌గా చూసిన ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. కాజల్ ఈజ్ బ్యాక్ అంటున్నారు. ఇందులో కాజల్ అంతే నాజుక్కాగా, అంతే స్లిమ్‌గా ఉండటం విశేషం. అంతేకాడు ఆమె ఫిట్‌నెస్ కూడా ఏమాత్రం చెక్కుచెదరలేదనే విషయం స్పష్టమవుతుంది. మొత్తంగా పూర్వవైభవానికి చేరుకుంది కాజల్.
అంతేకాదు రీఎంట్రీ కూడా ప్లాన్ చేసుకుంటుంది. త్వరలో కాజల్ `భారతీయుడు 2`లో పాల్గొనబోతుంది. ఈ చిత్రాన్ని గతంలోనే ఒప్పుకుంది కాజల్. కానీ సినిమా వాయిదా పడిన విషయం తెలిసిందే. దాన్ని మళ్లీ పున ప్రారంభించారు. ఇప్పటికే రకుల్, బాబీ సింహా వంటి నటులు షూటింగ్‌లో పాల్గొంటున్నారు. త్వరలోనే కమల్ హాసన్, కాజల్ కాంబినేషన్‌లో సీన్లు చిత్రీకరించనున్నారట. అందుకోసం ఈ అందాల చందమామ సన్నద్ధమవుతుందని సమాచారం.
మరి కాజల్ ఒప్పుకున్న సినిమాలు కంప్లీట్ చేస్తుందా? లేక యాక్టింగ్‌ని కంటిన్యూ చేస్తుందా అనేది తెలియాల్సి ఉంది. ఆమె అభిమానులు మాత్రం తిరిగి సినిమాల్లోకి రావాలని బలంగా కోరుకుంటున్నారు. మరోసారి వెండితెరపై సందడి చేయాలని భావిస్తున్నారు. ఇక కాజల్ చివరగా `ఆచార్య` చిత్రంలో నటించింది. కానీ ఆమె సన్నివేశాలను చివరి నిమిషంలో తొలగించారు. అంతకు ముందు `హే సినామిక`, `మోసగాళ్లు` చిత్రాల్లో మెరిసింది కాజల్.