MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • Upasana: చిరంజీవికి ఉపాసన క్లోజ్‌ ఫ్రెండ్.. అది చాలా డేంజర్‌ అంటూ రామ్‌ చరణ్‌ షాకింగ్‌ కామెంట్‌

Upasana: చిరంజీవికి ఉపాసన క్లోజ్‌ ఫ్రెండ్.. అది చాలా డేంజర్‌ అంటూ రామ్‌ చరణ్‌ షాకింగ్‌ కామెంట్‌

Upasana-Ram Charan: చిరంజీవికి ఉపాసన క్లోజ్‌ ఫ్రెండ్‌ అయ్యారట. నాన్నతో మాట్లాడాలంటే తాము భయపడతామని, కానీ తను మాత్రం ఫ్రీగా వెళ్తుందని చెప్పాడు. అయితే ఇది చాలా డేంజర్‌ అంటూ కామెంట్‌. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Jul 20 2026, 02:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మల్టీ టాలెంటెడ్‌గా రాణిస్తోన్న ఉపాసన
Image Credit : Facebook/@Upasana Konidela

మల్టీ టాలెంటెడ్‌గా రాణిస్తోన్న ఉపాసన

మెగా కోడలు ఉపాసన.. మల్టీ టాలెంటెడ్‌గా రాణిస్తున్నారు. ఆమె ఓ వైపు తల్లిగా, మరోవైపు భార్య, ఇంకోవైపు మెగా కోడలిగా, ఇవన్నీ కాకుండా అపోలో ఆసుపత్రి బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ఇవన్నీ ఆమె బ్యాలెన్స్ చేస్తూ ఉత్తమ కోడలు అనిపించుకుంటున్నారు. అంతేకాదు అత్తమ్మ సురేఖతో కలిసి `అత్తమ్మ కిచెన్‌` పేరుతో మంచి రెడీమేడ్‌ ఫుడ్‌ ఐటెమ్స్ ప్రిపేర్‌ చేస్తూ బిజినెస్‌ చేస్తున్నారు. ఇలా తనలోని మల్టీ టాలెంట్‌ని ఆవిష్కరిస్తూ రాణిస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
రామ్‌ చరణ్‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఉపాసన
Image Credit : Facebook/@Upasana Konidela

రామ్‌ చరణ్‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఉపాసన

ఉపాసన నేడు తన 40వ పుట్టిన రోజుని జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఆమెకి సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు రామ్‌ చరణ్‌. ఉపాసన, చరణ్‌ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరిది ఏడేళ్ల ప్రేమ. అంటే కామన్‌ ఫ్రెండ్‌గా ప్రారంభమై అది ప్రేమగా మారింది. ఆ తర్వాత ప్రపోజ్‌ చేసుకున్నారు. దీనికి పెద్దలు కూడా ఒప్పుకోవడంతో పెళ్లి చేసుకున్నారు. చరణ్‌, ఉపాసన పెళ్లై 15ఏళ్లు అవుతుంది. ఇటీవల వాళ్లు మొదట కూతురు క్లీంకారకి జన్మనివ్వగా, ఆ తర్వాత కవలలకు జన్మనిచ్చారు. కొడుకు, కూతురు జన్మించారు.

35
చిరంజీవి క్లోజ్‌ ఫ్రెండ్‌ ఉపాసన
Image Credit : Facebook/@Upasana Konidela

చిరంజీవి క్లోజ్‌ ఫ్రెండ్‌ ఉపాసన

ఇదిలా ఉంటే రామ్‌ చరణ్‌ ది సినిమా ఫ్యామిలీ, ఉపాసన వాళ్లు మెడికల్‌ రంగంలో ఉన్నారు. ఈ రెండు కుటుంబాలకు ఎలా సెట్‌ అయ్యిందనేది ప్రశ్న. కానీ చిరంజీవి ఫ్యామిలీ తనని చాలా ప్రేమగా చూసుకుంటారని, మరో కూతురుగా భావిస్తారని తెలిపింది ఉపాసన. అదే సమయంలో ఉపాసన గురించి ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు చరణ్‌. చిరంజీవితో మాట్లాడాలంటే తామే భయంగా, ఇబ్బందిగా ఫీలవుతుంటామని, కానీ ఉపాసన మాత్రం ఈజీగా ఆయనతో కలిసిపోతుందని, డైరెక్ట్ గా వెళ్లి మాట్లాడుతుందని, మామయ్య ఎలా ఉన్నారని అడిగేస్తుందని, ఆయనతోపాటు కూర్చొని సరదాగా మాట్లాడుకుంటారని తెలిపారు చరణ్‌.

45
చిరంజీవి, ఉపాసన బాండింగ్‌పై చరణ్‌ బోల్డ్ కామెంట్‌
Image Credit : Facebook/@Upasana Konidela

చిరంజీవి, ఉపాసన బాండింగ్‌పై చరణ్‌ బోల్డ్ కామెంట్‌

`నాన్నగారితో మా కంటే ఉపాసనే క్లోజ్‌ అయ్యారు, ఓ రకం ఓ రకంగా నాన్నకి క్లోజ్‌ ఫ్రెండ్‌. ఏదున్నా, ఇద్దరు ఫ్రీగా మాట్లాడుకుంటారు. ఇది చాలా డేంజర్‌ ఎందుకంటే. నాన్నగారి నుంచి సపోర్ట్ మొత్తం ఆమెకే వెళ్తుంటుంది` అని తెలిపారు చరణ్‌. ఓపెన్‌ హార్ట్ విత్‌ ఆర్కే షోలో ఈ విషయాన్ని పంచుకున్నారు. ఉపాసనది ఈజీగా కలిసిపోయే మనస్తత్వం అని తెలిపారు చరణ్‌. ఇంట్లో చిరంజీవికే కాదు, అందరికి తనే బెస్ట్ ఫ్రెండ్‌ అని చెప్పారు.

55
సుకుమార్‌ సినిమా కోసం రెడీ అవుతున్న చరణ్‌
Image Credit : Asianet News

సుకుమార్‌ సినిమా కోసం రెడీ అవుతున్న చరణ్‌

రామ్‌ చరణ్‌ ఇటీవలే `పెద్ది` సినిమాతో విజయాన్ని అందుకున్నారు. ఈ మూవీ సుమారు నాలుగు వందల కోట్లు వసూలు చేసింది. చరణ్‌కి పెద్ద హిట్‌ ఇచ్చింది. దీనికి బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించగా, జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటించింది. ఇక ప్రస్తుతం చరణ్‌.. సుకుమార్‌తో సినిమాకి రెడీ అవుతున్నారు. వీరి కాంబినేషన్‌లో సినిమా ఈ ఏడాది చివర్లో ప్రారంభం కానుందట.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
రామ్ చరణ్ కొణిదెల
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Shruti Haasan: సీరియస్ సమస్యతో బాధపడుతున్న శ్రుతి హాసన్.. అందుకే పిల్లల్ని దత్తతకు రెడీ
Recommended image2
Baby Do Die Do OTT: రామ్ చరణ్ కి నచ్చిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి.. ఎప్పుడు, ఎందులో స్టీమింగ్ అంటే
Recommended image3
Kaaka Title Leak: యాంకర్ ని పొగుడుతూ ఇలా చేశావేంటి బాసూ.. 'కాకా' వెనకున్న అసలైన టైటిల్ లీక్ చేసిన చిరు
Related Stories
Recommended image1
Lenin 10 Days Collections: పదో రోజు అఖిల్‌ దెబ్బకి బాక్సాఫీస్ షేక్‌.. `లెనిన్‌`కి టోటల్‌ కలెక్షన్లు ఎంతంటే?
Recommended image2
The Odyssey: ఇండియాకు రానున్న వరల్డ్ ఫేమస్ డైరెక్టర్.. ముంబైలో 'ది ఒడిస్సీ' గ్రాండ్ ప్రీమియర్ షో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved