నల్ల చీరలో సీతాకోక చిలుకలా కాజల్ అగర్వాల్.. భగవంత్ కేసరి కోసం మెరుపులు, బ్యూటీ క్వీన్ అంటూ కామెంట్స్
తన కెరీర్ బిగినింగ్ నుంచి ఇప్పటి వరకు గ్రాఫ్ స్టడీగా మైంటైన్ చేస్తున్న హీరోయిన్ కాజల్ అగర్వాల్. తెలుగు, తమిళ భాషల్లో కాజల్ దాదాపుగా స్టార్ హీరోలందరితో స్క్రీన్ షేర్ చేసుకుంది.
తన కెరీర్ బిగినింగ్ నుంచి ఇప్పటి వరకు గ్రాఫ్ స్టడీగా మైంటైన్ చేస్తున్న హీరోయిన్ కాజల్ అగర్వాల్. తెలుగు, తమిళ భాషల్లో కాజల్ దాదాపుగా స్టార్ హీరోలందరితో స్క్రీన్ షేర్ చేసుకుంది. టాలీవుడ్ లో ఎక్కువ విజయాల శాతం ఉన్న హీరోయిన్ కూడా కాజలే.
కమర్షియల్ చిత్రాలతో కాజల్ తిరుగులేని స్టార్ డమ్ సొంతం చేసుకుంది. వివాహం తర్వాత కూడా కాజల్ అగర్వాల్ మంచి అవకాశాలతో రాణిస్తోంది. కాజల్ కెరీర్ మొత్తంలో ఆమె సక్సెస్ గ్రాఫ్ ఎప్పుడూ పడిపోలేదు. ఇది కాజల్ కు మాత్రమే సాధ్యమైన ఘనత.
కాజల్ అగర్వాల్ 2020 అక్టోబర్ లో తన స్నేహితుడు గౌతమ్ కిచ్లుని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వివాహం తర్వాత ఈ జంట వెకేషన్స్ కి వెళుతూ మ్యారేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు.
ప్రస్తుతం కాజల్ బాలయ్య సరసన భగవంత్ కేసరి చిత్రంలో నటిస్తోంది. ఆదివారం రోజు వరంగల్ లో జరిగిన భగవంత్ కేసరి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ తో ఈ చిత్రం హంగామా మొదలయింది. బాలయ్య, శ్రీలీల, కాజల్ అగర్వాల్ ఈ ఈవెంట్ లో తెగ హంగామా చేశారు.
ట్రైలర్ కూడా ఫ్యాన్స్ కి నచ్చేయడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఇదే జోష్ ని రిలీజ్ వరకు కొనసాగించేందుకు భగవంత్ కేసరి టీం వరుసగా ప్రమోషన్స్ నిర్వహించనుంది. భగవంత్ కేసరి ప్రమోషన్స్ కోసం కాజల్ అగర్వాల్ హాట్ గా, ఘాటుగా అందాలతో ముస్తాబవుతోంది. ఆ ఫొటోస్ ని తాజాగా కాజల్ షేర్ చేసింది.
శారీలో కాజల్ అగర్వాల్ మెరుపులు మెరిపించే సీతాకోక చిలుకలా హొయలు పోతోంది. భగవంత్ కేసరి ప్రమోషన్స్ లో కాజల్ తన వన్నె తరగని అందంతో హైలైట్ అవుతోంది.
కాజల్ సిగ్గు మొగ్గలేస్తూ ఇస్తున్న ఫోజులు మైండ్ బ్లాక్ చేస్తున్నాయి. అదిరిపోయే స్కిన్ టోన్ తో హాట్ హాట్ గా అదరగొడుతోంది. కాజల్ గ్యాప్ తర్వాత తెలుగులో నటిస్తున్న చిత్రం ఇదే.