కొత్తింట్లో అడుగుపెట్టిన కాజల్ అగర్వాల్.. భర్తతో కలిసి పూజలు.. ఫ్యామిలీ పిక్స్
స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ శుభవార్తను షేర్ చేసుకుంది. భర్త, కొడుకుతో హ్యాపీగా ఉంటున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా కొత్త ఇంటిని కొనుగోలు చేసింది.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) తాజాగా సర్ ప్రైజింగ్ న్యూస్ చెప్పింది. భర్త గౌతమ్ కిచ్లును పెళ్లి చేసుకున్న తర్వాత ఈ ముద్దుగుమ్మ తన ఫ్యామిలీతోనే ఎక్కువ సమయం గడుపుతోంది. కుటుంబ సభ్యులను చక్కగా చూసుకుంటూ తన మ్యారేజ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది.
ఇక పండంటి మగబిడ్డకు జన్మిచ్చిన తర్వాత ఈ ముద్దుగుమ్మ తరుచూగా కొడుకుతో కలిసి ఫొటోలను షేర్ చేస్తూనే వస్తోంది. ఫ్యామిలీ పిక్స్ ను షేర్ చేస్తూ అభిమానులను ఖుషీ చేస్తూ ఉంది. ఈ క్రమంలో తాజాగా మరో సర్ ప్రైజింగ్ న్యూస్ చేసింది.
ముంబైలో ఈ ముద్దుగుమ్మ ఓ ఇంటిని కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. గతంలోనూ ఇల్లు ఖరీదు చేసినట్టు సమాచారం. ఏదేమైనా తాజాగా మరో కొత్త ఇంటిలో కాజల్ అడుగుపెట్టింది. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి గృహప్రవేశ పూజను నిర్వహించింది.
ఈ సందర్భంగా పూజా కార్యక్రమంలో భర్త, కొడుకు నీల్ కిచ్లు, అమ్మ, ఇతర బంధువులతో కలిసి పాల్గొంది. పూజ అనంతరం ఫ్యామిలీతో కలిసి ఫొటోలకు ఫోజులిచ్చింది. తన కుటుంబంతో కాజల్ ఫొటోలను పంచుకోవడం బహుశా ఇదే మొదటి సారి. దీంతో కాజల్ ఫ్యామిలీ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
ఫొటోలు షేర్ చేస్తూ.. ఇంట్రెస్టింగ్ నోట్ రాసుకొచ్చింది. ‘ఈ వారం ప్రారంభంలో మా గృహ ప్రవేశ పూజ జరిగింది. మీతో ఈ విషయాన్ని పంచుకోవడం సంతోషంగా ఉంది. ఇది ఇప్పుడు మా ఇల్లు. చాలా ఆశీర్వాదంగా భావిస్తున్నాను. ఈ సందర్భంగా మా హృదయాలు అపారమైన కృతజ్ఞతతో నిండి ఉన్నాయి.’ అంటూ చెప్పుకొచ్చింది.
ఇక కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత సినిమాలకు చాలా దూరంగా ఉంది. ‘ఘోస్ట్’, ‘ఆచార్య’, వంటి సినిమాలనూ వదులుకుంది. తాజాగా ‘భగవంత్ కేసరి’ చిత్రంతో సక్సెస్ అందుకుంది. నెక్ట్స్ Indian 2, Satyabhama, uma వంటి చిత్రాలతో అలరించనుంది.