- Home
- Entertainment
- భర్తతో మాల్దీవుల్లో కాజల్, ఇంత రొమాంటిక్ గా ఎప్పుడైనా చూశారా.. స్టార్ బ్యూటీ బికినీ ఫోజులు వైరల్
భర్తతో మాల్దీవుల్లో కాజల్, ఇంత రొమాంటిక్ గా ఎప్పుడైనా చూశారా.. స్టార్ బ్యూటీ బికినీ ఫోజులు వైరల్
కాజల్ అగర్వాల్ సోషల్ మీడియాలో షేర్ చేసిన బికినీ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. భర్త, కొడుకుతో కలిసి కాజల్ వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది.

కాజల్ అగర్వాల్ సౌత్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ హీరోయిన్ లలో ఒకరు. సౌత్ లో ఆమె దాదాపుగా స్టార్ హీరోలందరితో నటించి విజయాలు అందుకుంది. రికార్డ్ బ్రేకింగ్ చిత్రాల్లో కూడా ఆమె నటించింది. రెండు దశాబ్దాలుగా కాజల్ నటిస్తోంది. పెళ్లి తర్వాత కాజల్ హవా కాస్త తగ్గింది. ఇప్పటికీ కూడా కాజల్ భారీ చిత్రాల్లో అవకాశాలు అందుకుంటోంది.
పెళ్లి తర్వాత కాజల్ ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తోంది. తన భర్త గౌతమ్, కొడుకు నీల్ తో సంతోషంగా గడుపుతోంది. 2020లో కాజల్, గౌతమ్ కిచ్లు వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ అన్యోన్యంగా జీవిస్తున్నారు. తరచుగా కాజల్ అగర్వాల్ తన భర్తతో కలిసి వెకేషన్స్ కి వెళ్లడం, ఆ ఫోటోలని సోషల్ మీడియాలో పంచుకోవడం చూస్తూనే ఉన్నాం.
రీసెంట్ గా కాజల్, గౌతమ్ తమ కొడుకుతో కలిసి మాల్దీవులకు వెళ్ళింది. మోస్ట్ రొమాంటిక్ గా కనిపిస్తూ బికినీ ఫోటోలని కాజల్ షేర్ చేసింది. భర్తతో బీచ్ లో రొమాన్స్ చేస్తున్న దృశ్యాలని కూడా పంచుకుంది. ఈ ఫోటోలు చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
బికినీ తో పాటు డిఫెరెంట్ అవుట్ ఫిట్స్ లో కాజల్ మాల్దీవుల్లో మెరిసింది. మాల్దీవులపై నా ప్రేమ ఎప్పటికీ చెరిగిపోదు. ప్రకృతిని ఎంతో గ్లామరస్ గా చూపించే ప్రదేశం అది. మాల్దీవులకు వెళ్లిన ప్రతిసారి నాకు కొత్త అనుభూతి కలుగుతుంది అని కాజల్ పోస్ట్ చేసింది.
కాజల్ అగర్వాల్ ప్రస్తుతం బాలీవుడ్ లో తెరకెక్కుతున్న రామాయణం చిత్రంలో నటిస్తోంది. మండోదరి పాత్రలో ఈ మూవీలో కాజల్ నటిస్తుండడం విశేషం. కాజల్ అగర్వాల్ 2007లో లక్ష్మీ కళ్యాణం చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.
చందమామ చిత్రంతో కాజల్ కి గుర్తింపు లభించింది. ఆ తర్వాత రాజమౌళి, రాంచరణ్ ల మగధీర చిత్రంలో నటించే అవకాశం దక్కించుకుంది. మగధీర మూవీ కాజల్ కెరీర్ ని మలుపు తిప్పింది. ఈ మూవీతో కాజల్ టాలీవుడ్ లో తిరుగులేని హీరోయిన్ గా మారిపోయింది.
ఆ తర్వాత కాజల్.. అల్లు అర్జున్, ప్రభాస్, ఎన్టీఆర్, చిరంజీవి, నాగ చైతన్య, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు ఇలా స్టార్ హీరోలందరితో నటించింది. కాజల్ అగర్వాల్ వివాదాలకు దూరంగా ఉండే నటి.