- Home
- Entertainment
- 30 ఏళ్ళ తర్వాత స్టార్ హీరోయిన్ ని బతిమాలుకున్న కృష్ణ..నాకు ఇష్టం లేదు అని ఒక్క మాటతో తేల్చేసింది
30 ఏళ్ళ తర్వాత స్టార్ హీరోయిన్ ని బతిమాలుకున్న కృష్ణ..నాకు ఇష్టం లేదు అని ఒక్క మాటతో తేల్చేసింది
సూపర్ స్టార్ కృష్ణకి ఓ స్టార్ హీరోయిన్ కి మధ్య చాలా ఏళ్ళ పాటు మాటల్లేవు. కానీ కృష్ణ ఆమెకి ఒకసారి ఫోన్ చేసి రిక్వస్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందట. వాళ్ళిద్దరి మధ్య అసలేం జరిగింది అనేది ఈ కథనంలో తెలుసుకుందాం.

సూపర్ స్టార్ కృష్ణ వెండితెరపై ఎన్నో అద్భుతాలు చేశారు. ఎందరో హీరోయిన్లతో నటించారు. కృష్ణ, స్టార్ హీరోయిన్ వాణిశ్రీ మధ్య విభేదాలు ఉన్నాయని అప్పట్లో వార్తలు వచ్చాయి. వాణిశ్రీ కూడా ఓ ఇంటర్వ్యూలో కృష్ణ గారు, నేను ఇద్దరం మా 30 ఏళ్ళ కెరీర్ లో ఎప్పుడూ సరిగ్గా మాట్లాడుకున్నది లేదు. కనీసం సెట్స్ లో కూడా పలకరించుకోము. అలా మేమిద్దరం ఎందుకు ఉంటామో నాకు కూడా తెలియదు.
సెట్స్ కి రాగానే ఆయన వేరే వాళ్ళతో మాట్లాడుతూ కూర్చుంటారు. నేను పక్కనే సైలెంట్ గా కూర్చుంటాను. షూట్ రెడీ అనగానే వెళ్లి నటించి వచ్చేస్తాం. మేమిద్దరం సినిమాల్లో రొమాంటిక్ గా, ఎమోషనల్ గా నటించాం. అయినప్పటికీ రియల్ లైఫ్ లో మా మధ్య బాండింగ్ లేదు అని తెలిపింది. కానీ తన కెరీర్ లో ఒకే ఒక్కసారి మాత్రం కృష్ణ గారు స్వయంగా తనకి ఫోన్ చేసి మాట్లాడారని వాణిశ్రీ పేర్కొంది.
నేను సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన తర్వాత జరిగిన సంఘటన ఇది. 1987లో తమిళంలో 'ఎంగా చిన్న రాసా' అనే చిత్రం విడుదలై మంచి విజయం సాధించింది. ఈ చిత్రాన్ని సూపర్ స్టార్ కృష్ణ తెలుగులో రీమేక్ చేయాలని అనుకున్నారు. హీరో చదువు సంధ్య లేని పల్లెటూరి కుర్రాడు. తల్లి చనిపోవడంతో సవతి తల్లి పెంచి పెద్ద చేస్తుంది. సవతి తల్లి కాబట్టి హీరోపై ఆమెకి ప్రేమ ఉండదు. ఒక పనివాడిలాగా వాడుకుంటూ ఉంటుంది. క్లైమాక్స్ లో తల్లి ఇచ్చిన విషంతోనే హీరో చావుబతుకుల స్థితికి వెళతాడు. తల్లి పాత్ర కంప్లీట్ గా నెగిటివ్ గా ఉంటుంది.
తెలుగులో తల్లి పాత్రకి ఎవరిని ఎంపిక చేసుకోవాలి అని అనుకున్నప్పుడు కృష్ణకి వాణిశ్రీ గుర్తుకు వచ్చారు. వెంటనే ఆయన వాణిశ్రీకి ఫోన్ చేశారట. కృష్ణ గారు తనకి ఫోన్ చేయడంతో ఆశ్చర్యపోయాను అని వాణిశ్రీ అన్నారు. ఒక తమిళ సినిమా రీమేక్ చేస్తున్నాను.. అందులో నువ్వు నాకు తల్లిగా నటించాలి. నువ్వు ఒకే చెబితేనే ఈ సినిమా నేను చేస్తాను. లేకుంటే చేయను అని అడిగారట. నేను మీకు తల్లిగా నటించాలా ? అసలు ఏం సినిమా అండీ అది అని వాణిశ్రీ అడిగారు. కృష్ణ ఆ మూవీ పేరు చెబితే వాణిశ్రీ ఆ చిత్రం చూశారు. చివర్లో హీరోకి తల్లే విషం పెట్టే సన్నివేశాలు వాణిశ్రీకి నచ్చలేదు.
నేను ఇలాంటి పాత్ర చేయలేను అని వాణిశ్రీ కృష్ణకి తేల్చి చెప్పేశారు. దీనితో చేసేది లేక కృష్ణ ఆ చిత్రాన్ని ఆపేశారు. కొన్నేళ్ల తర్వాత మరో హీరో ఆ చిత్రంలో నటించారు. ఇంతకీ ఆ సినిమా ఏంటంటే అబ్బాయి గారు. విక్టరీ వెంకటేష్, మీనా జంటగా నటించారు. వెంకటేష్ తల్లి పాత్రలో ప్రముఖ నటి జయచిత్ర నటించారు. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో తెరకెక్కిన అబ్బాయి గారు చిత్రం సూపర్ హిట్ అయింది.