చెల్లితో కలసి అందాల వరద పారిస్తున్న కాజల్.. లెహంగాలో అక్కా చెల్లెళ్ళ హొయలు చూస్తే మైకమే..
తన కెరీర్ బిగినింగ్ నుంచి ఇప్పటి వరకు గ్రాఫ్ స్టడీగా మైంటైన్ చేస్తున్న హీరోయిన్ కాజల్ అగర్వాల్. తెలుగు, తమిళ భాషల్లో కాజల్ దాదాపుగా స్టార్ హీరోలందరితో స్క్రీన్ షేర్ చేసుకుంది.
తన కెరీర్ బిగినింగ్ నుంచి ఇప్పటి వరకు గ్రాఫ్ స్టడీగా మైంటైన్ చేస్తున్న హీరోయిన్ కాజల్ అగర్వాల్. తెలుగు, తమిళ భాషల్లో కాజల్ దాదాపుగా స్టార్ హీరోలందరితో స్క్రీన్ షేర్ చేసుకుంది. టాలీవుడ్ లో ఎక్కువ విజయాల శాతం ఉన్న హీరోయిన్ కూడా కాజలే.
కమర్షియల్ చిత్రాలతో కాజల్ తిరుగులేని స్టార్ డమ్ సొంతం చేసుకుంది. వివాహం తర్వాత కూడా కాజల్ అగర్వాల్ మంచి అవకాశాలతో రాణిస్తోంది. కాజల్ కెరీర్ మొత్తంలో ఆమె సక్సెస్ గ్రాఫ్ ఎప్పుడూ పడిపోలేదు. ఇది కాజల్ కు మాత్రమే సాధ్యమైన ఘనత.
కాజల్ అగర్వాల్ 2020 అక్టోబర్ లో తన స్నేహితుడు గౌతమ్ కిచ్లుని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వివాహం తర్వాత ఈ జంట వెకేషన్స్ కి వెళుతూ మ్యారేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు.
గత ఏడాది కాజల్, కిచ్లు దంపతులు తల్లిదండ్రులు అయిన సంగతి తెలిసిందే. కాజల్ ప్రస్తుతం తన ముద్దుల కొడుకుతో మాతృత్వాన్ని ఆస్వాదిస్తోంది. తరచుగా భర్తతో, కొడుకుతో ఉన్న ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది.
గత ఏడాది ప్రెగ్నన్సీ కారణంగా సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన కాజల్.. ఈ ఏడాది తిరిగి యాక్టింగ్ తో బిజీ కానుంది. ప్రస్తుతం కాజల్ కమల్ హాసన్ సరసన ఇండియన్ 2లో నటిస్తోంది. వర్కౌట్స్ చేస్తూ మునుపటి ఫిజిక్ పొందే ప్రయత్నం చేస్తోంది.
తాజాగా కాజల్ షేర్ చేసిన ఫొటోస్ ఆమె అభిమానులకు ఐఫీస్ట్ అని చెప్పొచ్చు. కాజల్ చేసిన ఈ ఫోటో షూట్ ఫ్యాన్స్ కి డబుల్ ధమాకా. ఎందుకంటే ఈ ఫోటో షూట్ లో కాజల్ తో పాటు ఆమె చెల్లి నిషా అగర్వాల్ కూడా పాల్గొంది.
ఇద్దరూ ఒకే తరహా లెహంగాలో మతులు పోగొట్టేస్తున్నారు అనే చెప్పాలి. నెవర్ బిఫోర్ అనిపించే విధంగా అక్కాచెల్లెళ్లు అందాలతో విజువల్ ఫీస్ట్ అందించారు.
సాధారణంగానే చందమామలా అందంతో అదరహో అనిపించే కాజల్ ఈ ఫోటో షూట్ లో తన గ్లామర్ తో మరోస్థాయిలో ఫ్యాన్స్ ని ఉక్కిరి బిక్కిరి చేసింది. అందాల మహారాణిలా కాజల్ హొయలు పోతూ మెరుపులు మెరిపించింది.
కాజల్ అగర్వాల్ చిరునవ్వులు చిందిస్తూ తన చెల్లితో కలసి మెస్మరైజ్ చేసింది. అక్కకి పోటీగా నిషా అగర్వాల్ కూడా ఎక్కడా తగ్గలేదు. నిషా కూడా గ్లామర్ హొయలు ఒలికించింది.
నడుము సొగసుతో కాజల్ మెరుపులు మెరిపించింది. కాజల్ పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తూ చెక్కు చెదరని సొగసుతో ఇలా ఫోటో షూట్స్ తో కూడా అలరిస్తోంది.
క్లోజప్ గా కాజల్ తన పెదవుల అందంతో యువతలో నిషా నింపుతోంది. కాజల్ మత్తుగా ఇస్తున్న ఫోజులకు నెటిజన్లు మైకంలో మునుగుతున్నారు. కాజల్ రీసెంట్ గా వరుస ఫోటో షూట్స్ తో ఫ్యాన్స్ కి అందాల విందు వడ్డిస్తోంది.
కాజల్ చివరగా ఘోస్టీ అనే చిత్రంలో నటించింది. ప్రస్తుతం కాజల్ బాలయ్య 108లో హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా కాజల్ తన భర్తతో కలసి రాంచరణ్ బర్త్ డే వేడుకలకు హాజరైంది.