- Home
- Entertainment
- ఆ సమయంలో చాలా నొప్పిగా ఉండేది ప్రేమతో భరించాను... గుండెల్ని పిండేసే కాజల్ కామెంట్స్
ఆ సమయంలో చాలా నొప్పిగా ఉండేది ప్రేమతో భరించాను... గుండెల్ని పిండేసే కాజల్ కామెంట్స్
కెరీర్ పీక్స్ లో ఉండగానే కాజల్ అగర్వాల్ వివాహం చేసుకున్నారు. పెళ్ళైన రెండేళ్లలో ప్లానింగ్ చేసి పిల్లల్ని కన్నారు. ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న కాజల్ అగర్వాల్ మాతృత్వం గురించి గొప్పగా చెప్పారు.

Kajal Agarwal and Gautam Kitchlu
సుధీర్ఘ కెరీర్ కాజల్ కలిగి ఉన్నారు. స్టార్ హీరోయిన్ గా ఆమె హైట్స్ చూశారు. టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు అన్ని పరిశ్రమల్లో పని చేశారు. 2020లో కరోనా కారణంగా లాక్ డౌన్ విధించారు. అని. ఆ సమయంలో షూటింగ్స్ పూర్తిగా బంద్ అయ్యాయి. వివాహానికి అదే రైట్ టైం గా భావించిన కాజల్ అక్టోబర్ నెలలో గౌతమ్ కిచ్లుని పెళ్లి చేసుకున్నారు.
వీరి వివాహా వేడుక అత్యంత సన్నిహితుల మధ్య నిరాడంబరంగా జరిగింది. పెళ్లి కూతురిగా కాజల్ చోళీ లెహంగాలో మెరిసిపోయారు. పెళ్ళయాక ఏకంగా నెల రోజుల పాటు మాల్దీవ్స్ లో హనీమూన్ జరుపుకున్నారు. పెళ్లయిందే తడవుగా ఫ్యామిలీ ప్లానింగ్ చేశారు. కాజల్ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. నీల్ కిచ్లు అని నామకరణం చేశారు
తల్లిగా మాతృత్వపు అనుభూతిని కాజల్ ఆస్వాదిస్తున్నారు. ఆమె ఇటీవల ఫ్రీడమ్ టు ఫీడ్ కార్యక్రంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొన్ని ఎమోషనల్ వర్డ్స్ మాట్లాడారు. వర్క్ కారణంగా కొడుకుకి సమయం కేటాయించలేకపోయినట్లు కాజల్ బాధపడ్డారు.
కాజల్ మాట్లాడుతూ... నీల్ కీచులు కోసం నేను జిమ్ కూడా మానేశాను. అయితే తల్లయ్యాక ప్రొఫెషనల్ లైఫ్, పర్సనల్ లైఫ్ బ్యాలన్స్ చేయడం కష్టమైంది. షూటింగ్ ఉంటే నీల్ ని వదిలేసి బయటికి వెళ్లాల్సి వచ్చేది. అప్పుడు నా ప్రాణం అల్లాడిపోయేది. వర్క్ లో ఉన్నా నీల్ గుర్తొస్తూ ఉండేవాడు. వాడికి సమయం కేటాయిచలేకపోతున్నందుకు చాలా బాధగా ఉండేది.
నీల్ కి పాలిచ్చే టప్పుడు చాలా నొప్పిగా ఉండేది. తల్లిగా ఆ బాధను నేను అనుభవించాను. నిజం చెప్పాలంటే నేను ఆ నొప్పి ప్రేమగా ఆస్వాదించాను. ఆ ఫీలింగ్ జీవితంలో మర్చిపోలేను. పిల్లల కోసం వర్క్ లైఫ్ బాలన్స్ చేసుకోవాలి. వాళ్లకు సమయం కేటాయించాలి. తల్లులుగా అది మన బాధ్యత అంటూ కాజల్ తెలియజేశారు.
కాగా ‘ఆచార్య’ చిత్రంలో కనిపించాల్సి ఈ బ్యూటీ అభిమానులను కాస్తా డిజాయింట్ చేసింది. తను ప్రెగ్నెన్సీతో పాటు కొరటాల శివ స్క్రిప్ట్ లో చేసినా మార్పులు చేర్పులు కారణంగా ఆ మూవీలో నటించలేదు. భారీ చిత్రాల దర్శకుడు ఎస్ శంకర్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ‘ఇండియన్ 2’ చిత్రంలో కాజల్ నటిస్తోంది. ఇటీవలే ఈ చిత్ర షూటింగ్ తిరిగి ప్రారంభమైంది.
శంకర్-కమల్ హాసన్ లాంటి క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారతీయుడు 2 పై చాలా అంచనాలు ఉన్నాయి. కెరీర్ లో రెండో సారి శంకర్, కమల్ చేతులు కలిపారు. అలాగే మరికొన్ని ప్రాజెక్ట్స్ ఆమె చేతిలో ఉన్నాయి.