MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • `K ర్యాంప్‌` ఫస్ట్ రివ్యూ.. హైలైట్స్ ఇవే.. కిరణ్‌ అబ్బవరంకి మరో హిట్‌ పడినట్టేనా?

`K ర్యాంప్‌` ఫస్ట్ రివ్యూ.. హైలైట్స్ ఇవే.. కిరణ్‌ అబ్బవరంకి మరో హిట్‌ పడినట్టేనా?

కిరణ్‌ అబ్బవరం ఇప్పుడు `K ర్యాంప్‌`(కే ర్యాంప్‌) చిత్రంతో రాబోతున్నారు. ఈ మూవీ ఎలా ఉండబోతుందనేది ఫస్ట్ రివ్యూ వచ్చింది. దాని ప్రకారం దీపావళి విన్నర్‌ లక్షణాలు ఈ మూవీలో ఉన్నాయట. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Oct 16 2025, 08:33 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
దీపావళి స్పెషల్‌గా విడుదల కాబోతున్న `కే ర్యాంప్‌`
Image Credit : Asianet News

దీపావళి స్పెషల్‌గా విడుదల కాబోతున్న `కే ర్యాంప్‌`

కిరణ్‌ అబ్బవరం `క` మూవీతో హిట్‌ అందుకున్నాడు. మళ్లీ హీరోగా ఫామ్‌లోకి వచ్చాడు. ఆ తర్వాత చేసిన `దిల్‌రూబా` ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. రెగ్యూలర్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద డిజప్పాయింట్‌ చేసింది. ఈ క్రమంలో ఇప్పుడు మరో మూవీతో వస్తున్నారు కిరణ్‌ అబ్బవరం. `కే ర్యాంప్‌` అంటూ రచ్చ చేసేందుకు వస్తున్నారు. ఆ చిత్రానికి జైన్స్ నాని దర్శకత్వం వహించగా, హాస్య మూవీస్‌, రుద్రాంశ్‌ సెల్యులాయిడ్‌ బ్యానర్లపై రాజేష్‌ దండ, శివ బొమ్మకు సంయుక్తంగా నిర్మించారు. ఇందులో యుక్తి తరేజా హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం దీపావళి పండుగని పురస్కరించుకుని ఈ నెల 18న విడుదల కాబోతుంది. ఈ క్రమంలో ఇప్పటికే విడుదలైన టీజర్‌, ట్రైలర్ ఆకట్టుకున్నాయి. యూత్‌ఫుల్‌ కంటెంట్‌తో సినిమా ఉండబోతుందని అర్థమవుతుంది. బోల్డ్ డైలాగ్‌లు, కిస్‌ సీన్లు పుష్కలంగా ఉన్నట్టు టాక్‌.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
కే ర్యాంప్‌ సెన్సార్‌ రిపోర్ట్.. పెద్దలకు మాత్రమే
Image Credit : Asianet News

కే ర్యాంప్‌ సెన్సార్‌ రిపోర్ట్.. పెద్దలకు మాత్రమే

`K-ర్యాంప్`పై అంచనాలు బాగానే ఉన్నాయి. ఈ దీపావళి చిత్రాల్లో మంచి బజ్‌ ఉన్న మూవీస్‌లో ఇదొకటని చెప్పొచ్చు. ఇందులో కిరణ్‌ అబ్బవరం కూడా కొత్తగా కనిపిస్తున్నారు. బాడీ లాంగ్వేజ్‌ పరంగానూ చాలా ఫ్రీగా కనిపిస్తున్నారు. ఓ రకంగా తనలోని మరో కోణం చూపించబోతున్నట్టుగా అనిపిస్తోంది. బోల్డ్ డైలాగ్‌లు, ట్రెండీ అంశాలుండటంతో యూత్‌కి బాగా కనెక్ట్ అవుతున్నాయి. ఇవి సినిమాపై అంచనాలు పెరగడానికి కారణమవుతోంది. ఇప్పటికే సెన్సార్‌ రిపోర్ట్  వచ్చింది. సెన్సార్‌ బోర్డ్ `ఏ` సర్టిఫికేట్‌ ఇచ్చింది.  రెండు గంటల ఇరవై నిమిషాల నిడివితో సినిమా ఉంటుందట. సెన్సార్ నుంచి పాజిటివ్‌ టాక్ వచ్చినట్టు సమాచారం. ఈ క్రమంలో సినిమా ఎలా ఉండబోతుందనేది ఫస్ట్ రిపోర్ట్ బయటకు వచ్చింది. సినిమా యూనిట్‌ నుంచి తెలుస్తోన్న సమాచారం మేరకు ఈ మూవీ డీసెంట్‌గా ఉండబోతుందట.

34
కే ర్యాంప్‌ ఫస్ట్ రివ్యూ
Image Credit : Asianet News

కే ర్యాంప్‌ ఫస్ట్ రివ్యూ

టీజర్‌ లో ఉన్నట్టుగా బోల్డ్ డైలాగ్‌లు ఉండబోవని, ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా చూసేలా ఉంటాయని, ఎంటర్‌టైన్‌మెంట్స్ తోపాటు ఎమోషన్స్ కూడా బలంగా ఉంటాయని టాక్‌. పైకి యూత్‌ఫుల్‌, రొమాంటిక్‌ మూవీగా కనిపించినా, సినిమాలో ఫ్యామిలీ కంటెంట్‌ చాలా ఉందని కిరణ్‌ అబ్బవరం చెబుతున్నారు. ఏదీ ఓవర్‌ బోర్డ్ ఉండదని, ఏది ఎంత ఉండాలో అంతే ఉంటుందని, మంచి దీపావళి పండగ మూవీ అవుతుందని అంటోంది టీమ్‌. అయితే సినిమా ఫస్ట్ రివ్యూ విషయానికి వస్తే ఫస్ట్ ఆఫ్‌ ఫర్వాలేదు అనేలా ఉంటుందట. బోర్‌ లేకుండా సాగుతుందని, ఫన్‌, పాటలు ఆకట్టుకుంటాయని తెలుస్తోంది. అయితే ఇంటర్వెల్‌ మాత్రం అదిరిపోయేలా ఉంటుందట. ఇక సెకండాఫ్‌ని హిలేరియస్‌ ఎంటర్‌టైనర్‌గా సాగుతుందట. క్లైమాక్స్ లో సందేశం కూడా ఉంటుందని తెలుస్తోంది. కిరణ్‌ అబ్బవరం సినిమాల్లో ఏదో ఒక చిన్నపాటి సందేశం ఉంటుంది. ఇందులోనూ సందేశం ఉంటుందని సమాచారం.

44
కే ర్యాంప్‌ కథ ఇదే, దీపావళి విన్నర్ గా నిలుస్తుందా?
Image Credit : Asianet News

కే ర్యాంప్‌ కథ ఇదే, దీపావళి విన్నర్ గా నిలుస్తుందా?

హీరో పాత్ర తీరుతెన్నులు కొత్తగా ఉంటాయని, యూత్‌కి బాగా కనెక్ట్ అవుతుందని తెలుస్తోంది. నరేష్‌, వెన్నెల కిశోర్‌ ట్రాక్‌ అదిరిపోతుందట. అయితే సినిమాలో హీరో బాగా రిచ్‌ అని, కానీ అవన్నీ వదిలేసి అవారాగా బిహేవ్‌ చేస్తుంటాడని, అలా ఆయన ఎందుకు చేస్తున్నాడు? ఆయనలో వచ్చిన రియలైజేషన్‌ ఏంటి? ఆయన ఫ్యామిలీ కథేంటనేది ఆసక్తికరంగా ఉండబోతుందని సమాచారం. సైకలాజికల్‌ సమస్యతో బాధపడే ఒక అమ్మాయి చిల్లర్‌గా తిరిగే రిచ్‌ కుర్రాడి ప్రేమలో పడితే ఆ తర్వాత పరిణామాలేంటనేది కొత్తగా ప్రయత్నించారని, కాకపోతే అది ఆడియెన్స్ కి ఏవిధంగా కనెక్ట్ అవుతుందనేదాన్ని బట్టి సినిమా ఫలితం ఆధారపడి ఉంటుందని సమాచారం.  ఇది మినిమమ్‌ గ్యారంటీ చిత్రమని టీమ్‌ చెబుతుంది. దీపావళి విన్నర్‌ అయ్యే లక్షణాలు ఈ మూవీలో ఉన్నట్టు టాక్‌. మరి సినిమా నిజంగానే ఆ స్థాయిలో ఆకట్టుకుంటుందా?  కిరణ్‌ అబ్బవరం దీపావళి విన్నర్‌గా నిలుస్తాడా అనేది చూడాలి.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Michael Jackson: రజనీకాంత్ కోసం మైఖేల్ జాక్సన్ పాడాల్సింది.. 16 ఏళ్ల తర్వాత తమన్ చెప్పిన సీక్రెట్!
Recommended image2
P N Ramachandra Rao: సీనియర్ దర్శకుడికి అరుదైన పురస్కారం.. గవర్నర్‌ చేతుల మీదుగా ప్రదానం
Recommended image3
Samantha: 7 నెలల ప్రెగ్నెన్సీ తో సమంత.. అభిమానుల కోసం ఇంత రిస్క్ చేస్తోందా?
Related Stories
Recommended image1
మిత్ర మండలి మూవీ రివ్యూ, రేటింగ్‌.. జాతిరత్నాలు లా కడుపుబ్బ నవ్వించిందా?
Recommended image2
Telusu Kada Review: తెలుసు కదా ఫస్ట్ రివ్యూ, టిల్లుగాడి సినిమా ఎలా ఉండబోతుందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved