MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Telusu Kada Review: తెలుసు కదా ఫస్ట్ రివ్యూ, టిల్లుగాడి సినిమా ఎలా ఉండబోతుందంటే?

Telusu Kada Review: తెలుసు కదా ఫస్ట్ రివ్యూ, టిల్లుగాడి సినిమా ఎలా ఉండబోతుందంటే?

Telusu Kada Movie: సిద్ధు జొన్నలగడ్డ హీరోగా రాశీఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా రూపొందిన రొమాంటిక్‌ మూవీ `తెలుసు కదా` ఎలా ఉండబోతుందో ఫస్ట్ రిపోర్ట్ వచ్చింది. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Oct 16 2025, 12:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
తెలుగు కదా మూవీతో అలరించేందుకు వస్తోన్న సిద్ధు జొన్నలగడ్డ
Image Credit : X/people media factory

తెలుగు కదా మూవీతో అలరించేందుకు వస్తోన్న సిద్ధు జొన్నలగడ్డ

సిద్ధు జొన్నలగడ్డ `టిల్లు` సినిమాలతో తెలుగు ఆడియెన్స్‌కి దగ్గరయ్యాడు. `డీజే టిల్లు`, `టిల్లు స్వ్కేర్‌` మూవీస్‌ తో బ్యాక్‌ టూ బ్యాక్‌ హిట్‌ కొట్టాడు. డైలాగ్‌ కామెడీతో, సిచ్చ్యూవేషన్‌ కామెడీతో నవ్వులు పూయించాడు. ముఖ్యంగా సిద్ధు క్యారెక్టరైజేషన్‌ ఆద్యంతం ఆకట్టుకుంది. సినిమా సక్సెస్‌ లో భాగమయ్యింది. సిద్ధు కూడా టిల్లుగా రెచ్చిపోయి చేశారు. ఇలాంటి క్యారెక్టర్‌ తెలుగు ఆడియెన్స్ కి కొత్త కావడంతో బాగా ఆదరించారు. రెండు సినిమాలను పెద్ద హిట్‌ చేశారు. ఈ క్రమంలో మధ్యలో `జాక్` అంటూ మరో మూవీ చేశాడు సిద్ధు. కానీ ఇది ఆడియెన్స్ ని ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు `తెలుసు కదా` చిత్రంతో రాబోతున్నాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
తెలుసు కదా ఫస్ట్ రిపోర్ట్
Image Credit : X/people media factory

తెలుసు కదా ఫస్ట్ రిపోర్ట్

సిద్ధు జొన్నలగడ్డ హీరోగా రాశీఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటించిన `తెలుసు కదా` మూవీకి లేడీ డైరెక్టర్‌ నీరజ కోన దర్శకత్వం వహించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వ ప్రసాద్‌, ఆమె కూతురు కలిసి నిర్మించారు. దీపావళి పండగ సీజన్‌ని పురస్కరించుకుని శుక్రవారం(అక్టోబర్‌ 17)న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ క్రమంలో మూవీ ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది. సెన్సార్‌ రిపోర్ట్ కూడా వచ్చింది. అయితే ఇండస్ట్రీలో చూసిన కొందరి అభిప్రాయం ప్రకారం ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ రిపోర్ట్ వచ్చింది. మూవీ ఎలా  ఉండబోతుందనేది తెలుస్తోంది.

35
తెలుసు కదా సెన్సార్‌ రిపోర్ట్
Image Credit : X/people media factory

తెలుసు కదా సెన్సార్‌ రిపోర్ట్

`తెలుసు కదా` మూవీ ఇప్పటికే సెన్సార్‌ పూర్తి చేసుకుంది. యూ/ఏ సర్టిఫికేట్‌ పొందింది. సినిమా రెండు గంటల 16 నిమిషాల నిడివి ఉండబోతుందని సెన్సార్‌ బోర్డ్ తెలిపింది. నిడివి పరంగా డీసెంట్‌గానే ఉంది. ఇంకా చెప్పాలంటే ఇటీవల కాలంలో సుమారు మూడు గంటలు ఉంటున్న నేపథ్యంలో వాటితో పోల్చితే తక్కువే అని చెప్పొచ్చు. అయితే సినిమా ట్రయాంగిల్‌ లవ్‌ స్టోరీగా రూపొందిందని ట్రైలర్‌ని బట్టి అర్థమవుతుంది. హీరో సిద్ధు, హీరోయిన్లు రాశీఖన్నా, శ్రీనిధి శెట్టిల మధ్య లవ్‌ ట్రాక్‌ని బలంగా చూపించబోతున్నారట. సినిమా చాలా బోల్డ్ గా, రొమాంటిక్‌గా ఉంటుందని తెలుస్తోంది. రొమాంటిక్‌ కామెడీ ఇందులో హైలైట్‌గా ఉంటుందని, లవ్‌ ట్రాక్‌ విషయాలు చాలా కొత్తగా, ట్రెండీగా ఉండబోతున్నాయని సమాచారం.

45
తెలుసు కదా మూవీ స్టోరీ ఇదేనా?
Image Credit : X/people media factory

తెలుసు కదా మూవీ స్టోరీ ఇదేనా?

ఈ నేపథ్యంలో కథ ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది. ఇందులో హీరో అమ్మాయిల విషయంలో రొమాంటిక్‌గా ఉంటాడని, తన వెంటపడేలా చేసుకుంటాడని, అలా రాశీని, శ్రీనిధిని ఒకేసారి ప్రేమిస్తాడట. ఇద్దరికీ ఈ విషయం తెలుస్తోంది. ఇద్దరితోనే ఒకేసారి రొమాన్స్ చేయడం ఇందులో హైలైట్‌గా, క్రేజీగా ఉంటుందట. ఏ ప్రేమైలో అయినా ఒక దశలో కాన్ల్ఫిక్ట్ స్టార్ట్ అవుతుంది. గొడవ అవుతుంది. బ్రేకప్‌ల వరకు వెళ్తాయి. అలా ఇందులోనూ గొడవ వల్ల వారి మధ్య గ్యాప్‌ వస్తుందని, మళ్లీ కొంత టైమ్‌ తర్వాత కలుస్తారని అప్పటి వరకు చోటు చేసుకున్న పరిణామాలే ఆసక్తికరంగా ఉంటాయని సమాచారం. అంతేకాదు ఫెర్టిలిటీ సెంటర్లకి సంబంధించిన అంశం కూడా ఇందులో చర్చించబోతున్నారట. చాలా సెన్సిటివ్‌ అంశాలను ఇందులో చూపించబోతున్నట్టు తెలుస్తోంది.

55
ఏ సెంటర్లకి కనెక్ట్ అయ్యే కథతో తెలుసు కదా
Image Credit : X/people media factory

ఏ సెంటర్లకి కనెక్ట్ అయ్యే కథతో తెలుసు కదా

ట్రైలర్‌లో చూపించినంత బోల్డ్ గా సినిమా ఉండదని, అది కేవలం ట్రైలర్ కోసం కట్‌ చేసిన ఎలిమెంట్లు అని సమాచారం. ఏ క్లాస్‌ ఆడియెన్స్ కి కనెక్ట్ అయ్యేలా ఉంటుందని, చాలా కూల్‌గా సాగే మూవీ అని సమాచారం. అయితే మ్యూజిక్‌ సినిమాకి పెద్ద అసెట్‌ అవుతుందని, అదే ఎంగేజ్‌ చేస్తుందని, అది ఆడియెన్స్ ని ఎంగేజ్‌ చేసే స్థాయిని బట్టి మూవీ ఫలితం ఆధారపడి ఉంటుందని తెలుస్తోంది. సినిమాలో హీరో సిద్ధు జొన్నలగడ్డ ఇన్‌ వాల్వ్ అయ్యారు. ఆయన మార్క్ డైలాగ్‌లుంటాయట. అవి నవ్వులు పూయిస్తాయని సమాచారం. అవే సినిమాకి అసెట్‌గా నిలుస్తాయని అంటున్నారు. అయితే సినిమాలో కేవలం బోల్డ్ అంశాలే కాదు, ఎమోషనల్‌ అంశాలతో సాగుతుందట. అది మూవీకి మరో హైలైట్‌ పాయింట్‌ అని టాక్‌. ఈ ఎమోషన్స్, లవ్‌ ట్రాక్‌, సిద్ధు పాత్ర కనెక్ట్ అయ్యేదాన్ని బట్టి మూవీ ఫలితం ఆధారపడి ఉంటుందని చెప్పొచ్చు. మరి ఎంత వరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Nidhhi Agerwal: తెలుగు అబ్బాయిలంటేనే ఇష్టం, పెళ్లి కూడా చేసుకుంటా, నిధి అగర్వాల్ కామెంట్స్ వైరల్
Recommended image2
Ranabaali Sensor Review: ఒక్క కట్ కూడా లేదు.. విజయ్ దేవరకొండ సినిమాపై షాకింగ్ కామెంట్స్, రణబాలి సెన్సార్ రివ్యూ
Recommended image3
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పాడిన 10 పాటలు.. సింగర్‌గా అదరగొట్టిన పవర్ స్టార్!
Related Stories
Recommended image1
మిత్ర మండలి మూవీ రివ్యూ, రేటింగ్‌.. జాతిరత్నాలు లా కడుపుబ్బ నవ్వించిందా?
Recommended image2
చిరంజీవి చీఫ్‌ గెస్ట్ గా రాజశేఖర్‌ సినిమా సక్సెస్‌ పార్టీ.. టీమిండియా క్రికెట్‌ జట్టు రచ్చ, ఆ మూవీ ఏంటంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved