నితిన్, రవితేజ, అల్లు శిరీష్ హ్యాండిచ్చారు.. మీడియం బడ్జెట్ లో అద్భుతం, ఎన్టీఆర్ ఇన్వాల్వ్ అయిన ఆ మూవీ ఇదే
ఒక హీరో చేయాల్సిన చిత్రం మరో హీరో చేతుల్లోకి వెళ్లిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఉదాహరణకి వరుణ్ సందేశ్ రిజెక్ట్ చేయడంతో బొమ్మరిల్లు చిత్రం సిద్దార్థ్ చేతుల్లోకి వెళ్ళింది.ఇలాంటి అనుభవం రాజ్ తరుణ్, రవితేజ, నితిన్ లాంటి హీరోలకు కూడా ఎదురైంది.

Jr NTR
ఒక హీరో చేయాల్సిన చిత్రం మరో హీరో చేతుల్లోకి వెళ్లిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఉదాహరణకి వరుణ్ సందేశ్ రిజెక్ట్ చేయడంతో బొమ్మరిల్లు చిత్రం సిద్దార్థ్ చేతుల్లోకి వెళ్ళింది. బొమ్మరిల్లు ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. రాంచరణ్ రిజెక్ట్ చేసిన శ్రీమంతుడు మూవీ మహేష్ బాబుకి బ్లాక్ బస్టర్ హిట్ గా మారింది. పోకిరితో పాటు పూరి జగన్నాధ్ చాలా చిత్రాలని పవన్ కళ్యాణ్ రిజెక్ట్ చేశారు. ఇలాంటి అనుభవం రాజ్ తరుణ్, రవితేజ, నితిన్ లాంటి హీరోలకు కూడా ఎదురైంది.

Jr NTR, Kalyan Ram
బింబిసార డైరెక్టర్ వశిష్ఠ తొలి అవకాశం కోసం చాలా ఇబ్బందులు పడ్డారట. వశిష్ఠ తండ్రి నిర్మాత మల్లిడి సత్యనారాయణ రెడ్డి ఆసక్తికర విషయాలు రివీల్ చేశారు. తన తొలి చిత్రాన్ని రాజ్ తరుణ్ తో చేయాలని వశిష్ఠ భావించారు. అదే బింబిసార చిత్రం. అయితే ఈ చిత్రానికి బడ్జెట్ కాస్త ఎక్కువ కావాలి. పైగా రాజ్ తరుణ్ కి ఇలాంటి చిత్రం సెట్ కాదు అని ఒక నిర్మాత సలహా ఇచ్చారట.

అదే నిర్మాత సలహా మేరకు కళ్యాణ్ రామ్ ని కలసి బింబిసార కథని వశిష్ఠ చెప్పారు. కళ్యాణ్ రామ్ కి కథ బాగా నచ్చింది. తానే ఈ చిత్రాన్ని నిర్మించి నటిస్తానని కళ్యాణ్ రామ్ ముందుకు వచ్చారు. కథా చర్చలు జరుగుతున్న క్రమంలో తుగ్లక్ అనే టైటిల్ అనుకున్నారు. తన సోదరుడి చిత్రం కావడంతో జూనియర్ ఎన్టీఆర్ కూడా కథా చర్చల్లో ఇన్వాల్వ్ అయ్యారు. తుగ్లక్ వద్దు బింబిసార అని టైటిల్ పెట్టమని తారక్ సలహా ఇచ్చారు. ఆ విధంగా మీడియం బడ్జెట్ లో తెరకెక్కిన బింబిసార చిత్రం బాక్సాఫీస్ వద్ద 70 కోట్ల గ్రాస్ కొల్లగొట్టింది.

ఈ చిత్రానికి ముందు వశిష్ఠ.. నితిన్, రవితేజ, అల్లు శిరీష్ లకు కూడా కథలు వినిపించారట. అది బింబిసార కథే అని ప్రచారం ఉంది. కానీ వాళ్ళకి చెప్పింది వేరే కథలు అని సత్యనారాయణ రెడ్డి అన్నారు. ప్రస్తుతం వశిష్ఠ మెగాస్టార్ చిరంజీవితో విశ్వంభర చిత్రం తెరకెక్కిస్తున్నారు.