MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • టాలీవుడ్ చరిత్రలో ఎప్పుడైనా ఇది చూశారా.. అన్నదమ్ముల మధ్య అరుదైన సంఘటన, 20 రోజుల గ్యాప్ లో

టాలీవుడ్ చరిత్రలో ఎప్పుడైనా ఇది చూశారా.. అన్నదమ్ముల మధ్య అరుదైన సంఘటన, 20 రోజుల గ్యాప్ లో

టాలీవుడ్ సినీ చరిత్రలో ఎన్నో అద్భుతాలు జరిగాయి. కొన్ని అరుదైన సంఘటనలు కూడా ఉన్నాయి. ఒకే ఫ్యామిలీ నుంచి చాలా మంది హీరోలు రావడం అనేది టాలీవుడ్ లో మాత్రమే కాదు ఇతర చిత్ర పరిశ్రమలో కూడా ఉంది.

2 Min read
Author : Tirumala Dornala
Published : Jan 31 2025, 11:19 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

టాలీవుడ్ సినీ చరిత్రలో ఎన్నో అద్భుతాలు జరిగాయి. కొన్ని అరుదైన సంఘటనలు కూడా ఉన్నాయి. ఒకే ఫ్యామిలీ నుంచి చాలా మంది హీరోలు రావడం అనేది టాలీవుడ్ లో మాత్రమే కాదు ఇతర చిత్ర పరిశ్రమలో కూడా ఉంది. అయితే టాలీవుడ్ చరిత్రలో ఎప్పుడూ జరగని అరుదైన సంఘటన ఒక ఫ్యామిలిలో చోటు చేసుకుంది. అది కూడా అన్నదమ్ముల మధ్య. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

నందమూరి ఫ్యామిలిలో ప్రస్తుతం బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ప్రధానంగా హీరోలుగా రాణిస్తున్నారు. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ అన్నదమ్ములు అనే సంగతి తెలిసిందే. వీళ్ళిద్దరూ ఒకే తరహా కథతో వేర్వేరు చిత్రాల్లో నటించారు. విశేషం ఏంటంటే ఈ రెండు చిత్రాలు సూపర్ హిట్స్ అయ్యాయి. ఆ చిత్రాలు రెండూ ఒకే ఏడాది కేవలం 20 రోజుల గ్యాప్ లో రిలీజ్ అయ్యాయి. ఆ చిత్రాలు ఎన్టీఆర్ నటించిన టెంపర్, కళ్యాణ్ రామ్ నటించిన పటాస్. 

 

35

పటాస్ చిత్రం జనవరి 23, 2015న రిలీజ్ అయింది. టెంపర్ చిత్రం ఫిబ్రవరి 13న రిలీజ్ అయింది. కళ్యాణ్ రామ్ కెరీర్ లో వరుస పరాజయాలకు బ్రేక్ వేసిన చిత్రం పటాస్.. ఎన్టీఆర్ కి కూడా ఆ టైం లో హిట్ చాలా అవసరం. టెంపర్ సూపర్ హిట్ అయింది. పటాస్ చిత్రం అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కింది. టెంపర్ చిత్రాన్ని పూరి జగన్నాధ్ తెరకెక్కించారు. ఈ రెండు చిత్రాల కథలు దాదాపుగా ఒకేలా ఉంటాయి. 

 

45

బ్యాడ్ పోలీస్ అధికారి మంచిగా మారడం అనే కాన్సెప్ట్ తో ఈ చిత్రాలని తెరకెక్కించారు. కథలు ఒకే విధంగా ఉండడంపై గతంలో అనిల్ రావిపూడి స్పందించారు. టెంపర్ చిత్రానికి వక్కంతం వంశీ కథ అందించారు. మేమిద్దరం ఎప్పుడూ కలుసుకోలేదు..కథల గురించి మాట్లాడుకోలేదు. బహుశా ఇద్దరం ఒకే జోన్ లో కథని ఆలోచించాం ఏమో అని అనిల్ రావిపూడి అన్నారు.  కథ ఒకటే అయినప్పటికీ పూరి జగన్నాధ్ గారు తన స్టైల్ లో రెబల్ యాటిట్యూడ్ తో టెంపర్ చిత్రాన్ని చేశారు. 

 

55

పటాస్ చిత్రాన్ని  నేను నా స్టైల్ లో ఎంటర్టైనింగ్ గా తెరకెక్కించాను అని తెలిపారు. ఏ ఇద్దరు దర్శకులు ఒకే కథని ఒకేలా తెరకెక్కించలేరు అని అనిల్ రావిపూడి తెలిపారు. పటాస్, టెంపర్ చిత్రాలు ఒకే కథతో తెరకెక్కడం.. అన్నదమ్ములు హీరోలుగా నటించడం.. 20 రోజుల గ్యాప్ లో రిలీజ్ కావడం అనేది విచిత్రం మాత్రమే కాదు, అరుదైన విషయం కూడా. 

 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Hi Movie Review: 'హాయ్' మూవీ రివ్యూ.. నయనతార, కెవిన్ లవ్ స్టోరీ వర్కవుట్ అయిందా?
Recommended image2
Kiara Advani: టాక్సిక్ సెట్‌లో ప్రెగ్నెన్సీ విషయం చెప్పిన కియారా.. యశ్ ఎమోషనల్.. ఆ రోజు ఏం జరిగిందంటే!
Recommended image3
Bandla Ganesh: స్టార్ హీరోను మోసం చేసి 25 ఎకరాలు కొన్న బండ్ల గణేష్.. చివరకు సారీ చెబితే ఆయన ఏమన్నాడంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved