War 2 OTT Release : వార్ 2 ఇక్కడైనా హిట్ అవుతుందా ? ఓటీటీ రిలీజ్ డేట్ డీటెయిల్స్
War 2 OTT Release: ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటించిన వార్ 2 చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధం అవుతోంది. వార్ 2 ఓటీటీ రిలీజ్ డేట్ ఇతర వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి.

ఓటీటీలోకి వార్ 2
జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ డెబ్యూ చిత్రం వార్ 2 థియేటర్లలో విడుదలై మిశ్రమ స్పందనను అందుకుంది. అయితే హృతిక్ రోషన్, ఎన్టీఆర్ స్టార్ పవర్ తో కొంతమేర ఈ చిత్రం వసూళ్లు రాబట్టగలిగింది. ఈ చిత్రం ఇప్పటివరకు రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. థియేటర్లలో తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్న ఈ చిత్రం త్వరలోనే డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధమవుతుందనే వార్తలు వెలువడుతున్నాయి.సమాచారం ప్రకారం, వార్ 2 స్ట్రీమింగ్ హక్కులు ఇప్పటికే నెట్ ఫ్లిక్స్ దగ్గర ఉన్నాయి. బజ్ ప్రకారం ఈ సినిమా 2025 అక్టోబర్ 9న ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్టు తెలుస్తోంది. ఈ తేదీపై అధికారిక ధృవీకరణ ఇంకా రాలేదు కానీ సోషల్ మీడియాలో, ట్రేడ్ వర్గాల్లో ఇదే చర్చనీయాంశమైంది. ఈ చిత్రం హిందీ, తెలుగు సహా పలు భాషల్లో విడుదల కానుందని సమాచారం.
ఎన్టీఆర్, హృతిక్ కలిసి నటించిన మల్టీస్టారర్ మూవీ
వార్ 2లో జూనియర్ ఎన్టీఆర్‌తో పాటు బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రం యాష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో భాగంగా రూపొందించబడింది. భారీ యాక్షన్ సన్నివేశాలు, విజువల్ ఎఫెక్ట్స్ తో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఎంత భారీగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినప్పటికీ ప్రేక్షకులని ఆకట్టుకోలేకపోయింది. ముఖ్యంగా ఈ చిత్రంలో యాక్షన్ ఎపిసోడ్స్ సిల్లీగా ఉన్నాయంటూ ప్రేక్షకులు అభిప్రాయపడ్డారు. యష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ నుంచి ఇలాంటి సినిమా ఆశించలేదని విమర్శలు వెల్లువెత్తాయి. పలు భాషల్లో ఈ చిత్రానికి నష్టాలు తప్పలేదు.
ఎన్టీఆర్ కి పర్ఫెక్ట్ బాలీవుడ్ డెబ్యూ అవుతుందనుకుంటే..
ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించగా, అశుతోష్ రాణా, అనిల్ కపూర్, అరిస్టా మెహతా, మరికొందరు ముఖ్య పాత్రల్లో కనిపించారు. సంగీతాన్ని ప్రీతమ్, సంచిత్ బల్హారా, అంకిత్ బల్హారా అందించారు. యాక్షన్, స్పై ఎలిమెంట్స్‌తో కూడిన ఈ సినిమా బాలీవుడ్‌లో జూనియర్ ఎన్టీఆర్‌కు పర్ఫెక్ట్ డెబ్యూ అవుతుందని అంతా భావించారు. కథ, కథనం, యాక్షన్ సీన్స్ సోషల్ మీడియాలో ట్రోలింగ్ మెటీరియల్ గా మారింది.
ఓటీటీలో అయినా సక్సెస్ అవుతుందా ?
డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్న నెట్ ఫ్లిక్స్, పెద్ద సినిమాలను త్వరితగతిన ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నది. ఇప్పటికే నెట్ ఫ్లిక్స్ లో బాలీవుడ్, టాలీవుడ్ సినిమాలు విస్తృత ఆదరణ పొందుతున్నాయి. వార్ 2 కూడా డిజిటల్ ప్రీమియర్ తర్వాత మరింత మంది ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశముందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.థియేటర్స్ లో రాణించలేకపోయిన వార్ 2.. ఓటీటీలో అయినా మంచి రెస్పాన్స్ దక్కించుకుంటుందేమో చూడాలి.
ఎన్టీఆర్ నుంచి మరో పాన్ ఇండియా మూవీ
ఇక జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. థియేటర్లలో చూసిన వారు మళ్లీ ఒకసారి డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లో ఆస్వాదించేందుకు సిద్ధమవుతున్నారు. అదే సమయంలో చూసే అవకాశం రాని ప్రేక్షకులకు ఈ ఓటిటి ప్రీమియర్ ఒక పెద్ద గిఫ్ట్‌గా మారనుంది. అయితే నెట్ ఫ్లిక్స్ అధికారిక ప్రకటన వెలువడే వరకు ఈ వార్త బజ్ గానే మిగులుతుంది. అక్టోబర్ 9న నిజంగానే విడుదల అవుతుందా లేదా అనేది అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.దేవర తర్వాత ఎన్టీఆర్ నటించిన పాన్ ఇండియా చిత్రం ఇది.