MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • వార్ 2 ట్విట్టర్ రివ్యూ..ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే స్టఫ్, మైనస్ లు కూడా.. మూవీ హిట్టా ఫట్టా

వార్ 2 ట్విట్టర్ రివ్యూ..ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే స్టఫ్, మైనస్ లు కూడా.. మూవీ హిట్టా ఫట్టా

ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటించిన వార్ 2 చిత్ర ప్రీమియర్ షోలు మొదలయ్యాయి. భారీ అంచనాలతో విడుదలవుతున్న ఈ చిత్రానికి ట్విట్టర్ లో ఆడియన్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తోందో ఇప్పుడు తెలుసుకుందాం. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Aug 14 2025, 05:24 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
భారీ అంచనాలతో వార్ 2 రిలీజ్ 
Image Credit : instagram/Sithara Entertainments

భారీ అంచనాలతో వార్ 2 రిలీజ్ 

యంగ్ టైగర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటించిన వార్ 2 చిత్రం భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఆగష్టు 14 గురువారం రోజు ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతోంది. దీనితో ప్రీమియర్ షోలు ప్రారంభం అయ్యాయి. వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ చిత్రంగా తెరకెక్కిన ఈ మూవీలో ఎన్టీఆర్, హృతిక్ తొలిసారి కలిసి నటించారు. వార్ ప్రాంఛైజీలో ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉంది. దీనితో వార్ 2 ఎలా ఉంటుంది అనే ఉత్కంఠ నెలకొని ఉంది. అయాన్ ముఖర్జీ ఈ చిత్రానికి దర్శకుడు. కియారా అద్వానీ హీరోయిన్ గా నటించింది. స్పై యాక్షన్ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షుకులని ఆకట్టుకునే విధంగా ఉందా, థ్రిల్ పంచిందా అనే విషయాలు ట్విట్టర్ రివ్యూలో తెలుసుకుందాం. 

DID YOU
KNOW
?
ఎన్టీఆర్, హృతిక్ కలిసి ఇదే తొలిసారి
వైఆర్ఎఫ్ సంస్థ వార్ 2 చిత్రాన్ని 400 కోట్ల బడ్జెట్ లో నిర్మించారు. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటించడం ఇదే తొలిసారి.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
వార్ 2 ట్విట్టర్ రివ్యూ, ఎన్టీఆర్ ఎంట్రీ అదిరింది 
Image Credit : instagram

వార్ 2 ట్విట్టర్ రివ్యూ, ఎన్టీఆర్ ఎంట్రీ అదిరింది 

జపాన్ లో జరిగే హృతిక్ రోషన్ యాక్షన్ సన్నివేశంతో కథ మొదలవుతుంది. ఆ తర్వాత దర్శకుడు చాలా సేపు డ్రామా నడిపించారు. సినిమా ప్రారంభమైన దాదాపు 40 నిమిషాల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ ఉంటుంది. ఫ్యాన్స్ కి మాస్ ట్రీట్ ఇచ్చే విధంగా ఎన్టీఆర్ ఎంట్రీ సీన్ ఉంటుంది. ముందుగా ఊహించినట్లుగానే ఈ చిత్రంలో యాక్షన్ సన్నివేశాలకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. 

36
ఫస్ట్ హాఫ్ ఎలా ఉందంటే 
Image Credit : instagram

ఫస్ట్ హాఫ్ ఎలా ఉందంటే 

ఎన్టీఆర్, హృతిక్ మధ్య పోటా పోటీగా సాగిన సన్నివేశాలే ఈ చిత్రానికి హైలైట్. కొన్ని సన్నివేశాలు అత్యంత ఉత్కంఠకి దారి తీసేలా ఉంటాయి. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆకట్టుకుంది. ఫస్ట్ హాఫ్ లో హృతిక్ జపాన్ యాక్షన్ సీన్ ని, ఎన్టీఆర్ ఎంట్రీ సన్నివేశాన్ని దర్శకుడు చక్కగా డీల్ చేశారు. అయితే ఫస్ట్ హాఫ్ లో కొన్ని మైనస్ లు కూడా ఉన్నాయి. ఇది స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ అయినప్పటికీ ఫస్ట్ హాఫ్ లో రొటీన్ గా అనిపించే సన్నివేశాలు చాలానే ఉన్నాయి. 

46
సలాం అనాలి సాంగ్
Image Credit : youtube print shot/yrf

సలాం అనాలి సాంగ్

కథలో కూడా కొత్తదనం లేదు. కొన్ని యాక్షన్ సన్నివేశాలు, విజువల్ ఎఫెక్ట్స్ అతిగా అనిపిస్తాయి. కానీ ఎన్టీఆర్, హృతిక్ మాత్రం సాలిడ్ పెర్ఫామెన్స్ ఇచ్చారు. ఇంటర్వెల్ బ్లాక్ కూడా చక్కగా కుదిరింది. ఫస్ట్ హాఫ్ లో వచ్చే 'సలామ్ అనాలి' సాంగ్ ని చాలా బాగా చిత్రీకరించారు. కొందరు ఆడియన్స్ వార్ 2 ఫస్ట్ హాఫ్ యావరేజ్ గా ఉందని అంటున్నారు.

56
విజువల్ ఎఫెక్ట్స్ మైనస్ 
Image Credit : instagram

విజువల్ ఎఫెక్ట్స్ మైనస్ 

సినిమా టోగ్రఫీ చాలా వరకు బాగా కుదిరింది. కానీ విజువల్ ఎఫెక్ట్స్ మాత్రం 400 కోట్ల బడ్జెట్ చిత్రానికి ఉండాల్సిన విధంగా లేవని ఆడియన్స్ అంటున్నారు. కథలో ఎమోషనల్ డెప్త్ లేకపోవడంతో యాక్షన్ సన్నివేశాల కోసమే ఈ చిత్రం అన్నట్లుగా సాగుతుంది. 

66
ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే 
Image Credit : Youtube/YRF

ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే 

ఇంటర్వెల్ బ్యాంగ్ ని మంచి ట్విస్ట్ తో ఎండ్ చేసిన దర్శకుడు సెకండ్ హాఫ్ లో గ్రాఫ్ పెంచుతాడు అనుకుంటే అలా చేయలేదు. సెకండ్ హాఫ్ కూడా అక్కడక్కడ మాత్రమే ఫ్యాన్స్ కి వర్కౌట్ అయ్యే సీన్స్ పెట్టారు. యాక్షన్ సీన్స్ కోసం ఎన్టీఆర్, హృతిక్ పడ్డ కష్టం అర్థం అవుతోంది. ఎమోషనల్ సీన్స్ యావరేజ్ గా అనిపిస్తాయి. చాలా చోట్ల డైరెక్టర్ అయాన్ ముఖర్జీ సేఫ్ గేమ్ ఆడారు. దీనితో వార్ 2 చిత్రం నెక్స్ట్ లెవల్ మూవీ కాకుండా యావరేజ్ మూవీగా నిలిచే అవకాశాలు ఉన్నాయి. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Actress Roja: రోజా నిద్రపోతుంటే రజనీకాంత్ చేసిన అల్లరి పనికి అంతా షాక్‌.. సెట్‌లో సూపర్‌స్టార్‌ ఎలా ఉంటారంటే?
Recommended image2
Varanasi Update: మహేష్‌ `వారణాసి` నుంచి అదిరిపోయే అప్‌ డేట్‌.. అప్పట్నుంచే అసలైన పండగ షురూ
Recommended image3
Bigg Boss 10: బిగ్ బాస్ నుంచి బయటకొచ్చి షాకింగ్ కామెంట్స్ చేసిన నటుడు కృష్ణుడు.. మరో రచ్చ
Related Stories
Recommended image1
ఎన్టీఆర్ కూడా 4 లక్షలకు మించింది లేదు, ఏకంగా రూ. 7 లక్షలతో క్రేజీ హీరో సంచలనం.. ఇండస్ట్రీకే దిమ్మతిరిగింది
Recommended image2
రజినీకాంత్ పై హృతిక్ రోషన్ ఎమోషనల్ కామెంట్స్.. 'కూలీ X వార్ 2' రగులుతున్న వేళ ఇలా..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved