MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • డాన్సర్లు చేసిన పనికి స్టేజ్‌పైనే కోపంతో మైక్‌ పగలగొట్టిన జానీ మాస్టర్‌.. `ఢీ` షో హిస్టరీలోనే ఇలా జరిగి ఉండదు

డాన్సర్లు చేసిన పనికి స్టేజ్‌పైనే కోపంతో మైక్‌ పగలగొట్టిన జానీ మాస్టర్‌.. `ఢీ` షో హిస్టరీలోనే ఇలా జరిగి ఉండదు

ఎప్పుడూ కూల్‌గా నవ్వుతూ ఉండే జానీ మాస్టర్‌ ఒక్కసారిగా ఊగిపోయాడు, కోపంతో అరిచేశాడు, ఢీ షోలో మైక్‌ పగలగొట్టి రచ్చ రచ్చ చేశాడు. ఇదిప్పుడు హాట్‌ టాపిక్‌ అవుతుంది.  

2 Min read
Author : Aithagoni Raju
| Updated : Apr 12 2024, 10:47 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19
photo dhe promo

photo-dhe promo

`ఢీ` షో.. తెలుగు బేస్డ్ డాన్సింగ్‌ రియాలిటీ షో. ఈ షో ద్వారా ఎంతో మంది డాన్సర్లు, కొరియోగ్రాఫర్లు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. తమ ప్రతిభని చూపించుకునే అవకాశాన్ని పొందారు. స్టార్స్ గానూ ఎదిగారు. డాన్సింగ్‌ విభాగంలో ఈషో ఎంతో మందికి లైఫ్‌ ఇస్తుందని చెప్పొచ్చు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29
photo-dhe promo

photo-dhe promo

అలాంటి ఢీ షోలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఒక జడ్జ్ కోపంతో ఊగిపోవడం, డాన్సర్‌ చేసిన పనికి ఆయన కోపంతో మైక్‌ పగలగొట్టడం జరిగింది. అంతేకాదు షో నుంచి వెళ్లిపోవడం కూడా అయ్యింది. జనరల్‌గా `జబర్దస్త్` షోస్‌లో ఇలాంటివి చూస్తుంటాం. కానీ `ఢీ` షోలో మాత్రం చాలా అరుదు, ఏదైనా మిస్టేక్‌ ఉంటే సున్నితంగా మందలించడం ఉంటుంది, హైపర్‌ ఆది లాంటి వాళ్లు చేసే స్కిట్లు ఉంటాయి. కానీ ఒక జడ్జ్ ఇలా రియాక్ట్ కావడం ఆశ్చర్యంగా మారింది. 
 

39
photo-dhe promo

photo-dhe promo

మరి ఇంతకి `ఢీ` షోలో ఏమైందనేది చూస్తే, తాజాగా `ఢీ` లేటెస్ట్ ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమో వచ్చింది. ఇందులో భీకరంగా జరిగిన డాన్స్ పర్‌ఫెర్మెన్స్ అనంతరం ఫైనల్‌గా ఇద్దరు డాన్సర్లు వీక్‌గా ఉన్నారు. వీరిలో ఒకరు మాత్రమే ఉండాలి, మరొకరు ఎలిమినేట్‌ కావాల్సి ఉంటుంది. మిగిలిన డాన్సర్లకి ఓటు వేసే అవకాశం వచ్చింది. 

49
photo-dhe promo

photo-dhe promo

ఈ క్రమంలో ఓ డాన్సర్‌.. స్టేజ్‌పైన ఉన్న సాత్విక్‌ అనే డాన్సర్‌కి కాకుండా పక్కన్న ఉన్న లేడీ డాన్సర్‌కి ఓటు వేశారు. ఇలా ఇద్దరు అలానే చేశారు. దీన్ని ఇష్యూ చేశాడు జడ్జ్ గా ఉన్న జానీ మాస్టర్‌. `మనకు ఒక పవర్‌ ఇచ్చారంటే, ఆ పవర్‌ని ఒకరిపై ఉపయోగిస్తున్నామంటే దానికి ప్రాపర్‌ రీజన్‌ ఉండాలి` అంటూ జానీ మాస్టర్‌ చెప్పాడు. 
 

59
photo-dhe promo

photo-dhe promo

దీనికి స్పందించిన డాన్సర్.. నిజం చెప్పాడు. ఓటు వేసే ముందు అన్న.. అక్కకి ఓటు వేయమని సైగ చేశాడని వెల్లడించారు. అంతే జానీ మాస్టర్‌ కోపంతో ఊగిపోయాడు. `దీన్ని అన్‌ఫెయిర్‌ అనకుండా ఏమంటారో చెప్పు, నేను ఎందుకు కూర్చున్నాను ఇక్కడ, నేను ఎర్రిపప్పనా, బాయ్‌ అంటూ షో నుంచి వెళ్లిపోయాడు జానీ మాస్టర్‌. 

69
photo-dhe promo

photo-dhe promo

అంతేకాదు డాన్సర్లపై ఫైర్‌ అయ్యాడు. రేయ్‌ సైలెన్స్.. ఎవరో సైగ చేశాడట, వీడు ఇచ్చాడట. ఇది లైఫ్‌రా, ఒక్క అవకాశం మిస్‌ అయితే ` అంటూ కోపంతో ఊగిపోయాడు. అతనిపై ఫైర్‌ అయ్యాడు. ఆ తర్వాత మళ్లీ స్టేజ్‌పైకి వచ్చాడు. `ఢీ` అంటే ఆటలుగా అనిపిస్తుందా మీకు, చెప్పరా అంటూ ఆ ఓటు వేసిన డాన్సర్‌ని నిలదీశాడు జానీ మాస్టర్‌. నా కొడుకా అంటూ మైక్‌ పగలగొట్టాడు. 
 

79
photo-dhe promo

photo-dhe promo

మాట్లాడాలన్నా కూడా లోపలి నుంచి అంటూ ఆవేశాన్ని కంట్రోల్‌ చేసుకోలేకపోయాడు. మళ్లీ షో నుంచి వెళ్లిపోయాడు. ఢీ షో మొత్తం రచ్చ రచ్చ అయ్యింది. బహుశా.. ఢీ షోలో ఇలాంటి సంఘటనలు జరగడం చాలా అరుదు. ఇంతటి సీరియస్‌గా ఏదీ ఉండదు, కానీ ఇప్పుడు ఇలా జరగడం ఆశ్చర్యంగా మారింది. నందు యాంకర్‌గా ఉన్న ఈ షోలో హైపర్‌ ఆది కూడా ఎంటర్‌టైన్‌ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ షో వచ్చే బుధవారం ఈటీవీలో ప్రసారం కానుంది. 

89
photo-dhe promo

photo-dhe promo

ఇదిలా ఉంటే ఈ ప్రోమోపై నెటిజన్లు స్పందిస్తూ హాట్‌ కామెంట్లు పెడుతున్నారు. జానీ మాస్టర్‌ రియాక్ట్ అయిన విధానం కరెక్ట్ అని, ఆయన సూపర్‌ అని, నువ్వు రియల్‌ డాన్సర్‌ అంటూ ఆయన్ని ప్రశంసిస్తున్నారు. దీంతోపాటు నెగటివ్‌ కామెంట్లు కూడా వస్తున్నాయి. 
 

99
photo-dhe promo

photo-dhe promo

ఇలాంటివి జబర్దస్త్ లో చేస్తారు, ఇక్కడ కూడా చేస్తారా? ఆపండ్రా ఈ కామెడీ, ప్రాంక్‌లతో చంపకండ్రా అంటూ కామెంట్లు పెడుతున్నారు. `జబర్దస్త్`లో ఇలాంటివి జరుగుతుంటాయి. దీంతో ఇందులోనూ అదే కామెడీ ప్రయోగించారనేది నెటిజన్ల అభిప్రాయం. మరి ఇది నిజమా? లేక ప్రాంకా అనేది తెలియాలంటే వచ్చే బుధవారం వరకు ఆగాల్సిందే. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
The Paradise: ది ప్యారడైజ్ సెన్సార్ రివ్యూ, అణచివేతకు వ్యతిరేకంగా జడల్ చేసిన విధ్వంసం.. నాని నటనకు జయహో
Recommended image2
Village Backdrop Movies: రాంచరణ్ నుంచి రవితేజ వరకు, హీరోలకు సవాల్..వందల కోట్లు తెచ్చిన ముసుగు విలన్లు వీళ్ళే
Recommended image3
SJ Surya Villain Movies: ఇండియన్ 2 నుంచి సర్దార్ 2 వరకు.. ఎస్.జే.సూర్య విలనిజం ఎందుకు ఫ్లాప్ అవుతోంది? జైలర్ 2 గట్టెక్కిస్తుందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved