Janaki Kalaganaledu: రామ అప్పు విషయం తెలుసుకొని షాకైనా జ్ఞానాంబ.. సంతోషంలో మల్లిక?
Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ మంచి కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కుటుంబం పరువుతో కూడిన కాన్సెప్ట్ తో ఈ సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు డిసెంబర్ 28 వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
ఈరోజు ఎపిసోడ్ లో జ్ఞానాంబ గుడిలో నుంచి తీసుకువచ్చిన కలశాన్ని ఇంటి మధ్యలో పెట్టడంతో అందరూ ఏమీ అర్థం కాక అలాగే చూస్తూ ఉంటారు. అప్పుడు మల్లిక అత్తయ్య గారు ఎందుకు అత్తయ్య గారు కలిశాన్ని ఇంటి మధ్యలో పెట్టారు అని అడగగా అప్పుడు జ్ఞానాంబ మన ఇంటికి ఏదైనా దిష్టి ఉంటే తొలగిపోవడానికి ఈ కలశాన్ని ఇక్కడ ప్రతిష్టించాను అని అంటుంది. గుడిలో నేను తిన కొబ్బరికాయ కుళ్ళిపోయింది. అందుకోసం పరిహారంగా ఈ పని చేస్తే ఏవైనా దోషాలు ఉంటే తొలగిపోతాయని పంతులుగారు చెప్పారు అని అంటుంది.
అప్పుడు కొబ్బరికాయలు కుళ్ళిపోవడానికి దోషాలకు అరిస్టాలకు సంబంధం ఏంటమ్మా అని అడుగుతాడు అఖిల్. కొబ్బరికాయలు బాగోలేక కుళ్ళిపోయింది ఏమో అనడంతో వెంటనే గోవిందరాజులు కొన్ని నమ్మకాలను అలా పొట్టి పాడేయకూడదు. ఏవైనా కొన్ని శుభకార్యాలు అశుభాలు జరిగేటప్పుడు దేవుడు ఇలా సూచిస్తూ ఉంటాడు. అప్పుడు మనం పరిహారం పాటించడం వల్ల అందుకు సంబంధించిన దోషాలు ఏవైనా ఉంటే తొలగిపోతాయి అని అంటాడు. అప్పుడు జ్ఞానాంబ జరిగిన పరిణామాలు దృష్టిలో పెట్టుకుని జాగ్రత్త పడాలి లేదంటే అని జెస్సిని చూసి మాట్లాడుతుంది.
మరో పరిణామం జరిగే అవకాశం ఉంది అప్పుడు జానకి జెస్సి కి పుట్టబోయే బిడ్డ విషయంలో అత్తయ్య గారు చాలా భయంగా ఉన్నట్టున్నారు అనుకుంటూ ఉంటుంది. అప్పుడు జానకి అత్తయ్య గారి బాధను అర్థం చేసుకోవాలి మనం తెలిసి తెలియక చేసే కొన్ని పనుల వల్ల కొందరి మనసులు బాధపడతాయి అనడంతో మల్లిక సరే అని తల ఊపుతూ ఉంటుంది. ఈవిడ గారు నాకు ఇండైరెక్టుగా వార్నింగ్ ఇస్తుంది చికిత మనకు పని ఉంది ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం పద అని వెళ్ళిపోతుంది మల్లిక. అప్పుడు జెస్సిని జాగ్రత్తగా ఉండమని చెబుతుంది జానకి. తర్వాత బయటకు వెళ్లిన మల్లిక జ్ఞానాంబ జానకి అన్న మాటలు గురించి ఆలోచిస్తూ ఉంటుంది.
అప్పుడు మల్లిక చికితని పిలిచి ఇలా గుడిలో కొబ్బరికాయ కుళ్ళిపోతే ఏమైనా జరుగుతుందంటావా అనడంతో అవునా అమ్మగారు అని అంటుంది. అప్పుడు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో ఒక అతను అక్కడికి వస్తాడు. అప్పుడు మల్లికా అక్కడికి వెళ్లి ఏం కావాలండి అనడంతో రామచంద్ర ఉన్నాడా అని అడగగా బావగారు లేరండి చెప్పండి అనడంతో నాకు రామచంద్ర సంతకాలు కావాలి అని అంటాడు. అప్పుడు డాక్యుమెంట్స్ మీద సంతకాలు ఎందుకు అనడంతో రామచంద్రకి డబ్బు అవసరమైతే నా దగ్గర డబ్బులు తీసుకున్నాడు దానికోసమే సంతకం అని అంటాడు.
అప్పుడు ఈ విషయం గురించి ఎలా అయినా ఇంకా తెలుసుకోవాలి అనుకొని అతని వెనకాలే పడుతుంది మల్లిక. అప్పుడు అతను 20 లక్షలు అనడంతో మల్లిక షాక్ అవుతుంది. అప్పుడు ఆ విషయాలు అన్నీకూపి లాగిన మల్లిక ఎలా అయినా చిచ్చు పెట్టాలి అనుకుంటూ ఉంటుంది. ఇంటి పట్టాలు తాకట్టు పెట్టాడు అనడంతో మల్లిక షాక్ అవుతుంది. ఇప్పుడు మల్లిక కావాలని అందరి ముందు రామచంద్రని ఇరికించాలి అని మా అత్తయ్య గారు ఉన్నారు ఈ ఇల్లు మా అత్తయ్య గారి పేరు మీదే ఉంది లోపలికి వెళ్దాం పదండి అని పిలుచుకొని వెళుతుంది. అప్పుడు లోపలికి వెళ్లిన అత్తయ్య గారు అని అందర్నీ ఎక్కడికి రమ్మని పిలుస్తుంది.
అప్పుడు అతన్ని చూసి గోవిందరాజులు ఐదు లక్షల సంతకం కోసం వచ్చావా అని అడగడంతో మీ పెద్దబ్బాయి తీసుకున్న అప్పుకి సంతకం తీసుకుందామని వచ్చాను అని అనడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. రామచంద్రకి అవసరం ఉందని 20 లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు అనడంతో జ్ఞానాంబతో పాటు అక్కడ అందరూ షాక్ అవుతారు. ఎందుకు తీసుకున్నారు అనడంతో నాకు కారణం తెలియదు అని అంటాడు. ఇప్పుడు గోవిందరాజులు అంత డబ్బు నీ మావాడు ఏం తాకట్టు పెట్టి తీసుకున్నాడు అనడంతో మీ ఇంటి పత్రాలు తాకట్టు పెట్టాడు అనడంతో అందరూ షాక్ అవుతారు.