- Home
- Entertainment
- హీరో రాజశేఖర్ దగ్గరకు చేరిన జబర్దస్త్ పంచాయతీ, మరోసారి ఆది, భాస్కర్ లను తంతా అంటూ రోజా విశ్వరూపం..!
హీరో రాజశేఖర్ దగ్గరకు చేరిన జబర్దస్త్ పంచాయతీ, మరోసారి ఆది, భాస్కర్ లను తంతా అంటూ రోజా విశ్వరూపం..!
బుల్లి తెరపై రోజా క్రేజీ సెలబ్రిటిగా మారిపోయారు. జబర్దస్త్ షోతో పాటు పలు కార్యక్రమాల్లో ఆమె పాల్గొంటున్నారు. బుల్లితెరపై నవ్వులు పూయిస్తున్నారు.

Hyper Aadi
బుల్లి తెరపై రోజా క్రేజీ సెలబ్రిటిగా మారిపోయారు. జబర్దస్త్ షోతో పాటు పలు కార్యక్రమాల్లో ఆమె పాల్గొంటున్నారు. బుల్లితెరపై నవ్వులు పూయిస్తున్నారు. ప్రముఖ టీవీ ఛానల్ లో ఉగాది సందర్భంగా అంగరంగ వైభవంగా అనే స్పెషల్ ప్రోగ్రాం ప్లాన్ చేస్తున్నారు. ఆ ప్రోగ్రాం కి సంబందించిన ప్రోమో తాజాగా విడుదల చేశారు. ఈ ప్రోమోలో రోజా, హైపర్ ఆది, బుల్లెట్ భాస్కర్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.
Hyper Aadi
వీరికి జీవిత రాజశేఖర్ దంపతులు కావడంతో మరింత రచ్చగా మారింది. ప్రోమో ఆసక్తికరంగా ఉంది. రౌడీ బాయ్స్ చిత్రంలోని బృందావనం సాంగ్ కి రష్మీ డ్యాన్స్ పెర్ఫామెన్స్ తో ప్రోమో ప్రారంభం అవుతుంది. వైట్ డ్రెస్ లో రష్మీ అందంగా డ్యాన్స్ చేస్తూ ఆకట్టుకుంది. ఆ తర్వాత అసలు రచ్చ షురూ అవుతుంది.
Hyper Aadi
రోజా మమ్మల్ని కొట్టింది అంటూ బుల్లెట్ భాస్కర్, హైపర్ ఆది పంచాయతీ పెడతారు. ఆ పంచాయతీకి జీవిత రాజశేఖర్ దంపతులు పెద్దమనుషులుగా హాజరవుతారు. వాళ్ళని ఎందుకు కొట్టావు అని జీవిత రోజాని ప్రశ్నిస్తుంది. దీనితో రోజా ఫైర్ అవుతూ వాళ్ళు అన్న మాటలకు ఖచ్చితంగా కొడతాను అని అంటుంది. ముందు నువ్వు చేయి దించి మాట్లాడు అంటూ జీవిత రోజాకి వార్నింగ్ ఇస్తుంది.
Hyper Aadi
ఇంతలో రోజా మరోసారి ఫైర్ అవుతూ తంతా మిమ్మల్ని అంటూ ఆది, భాస్కర్ పైకి దూకుతుంది. ఆవిడ మా పైకి వస్తోంది.. మీరేమైనా చేయండి సర్ అని ఆది రాజశేఖర్ ని అడుగుతాడు. దీనితో 'శేఖర్' మూవీ తప్పకుండా చూడండమ్మా అని రాజశేఖర్ సమాధానం ఇవ్వడం నవ్వులు పూయించింది.
Hyper Aadi
ఇంతలో ఇది నా కుర్చీ పైకి లేవమని జీవితని రోజా అడుగుతుంది. ఇది నీ కుర్చీ మాత్రమే కాదు నాది కూడా. నీది బండ (రచ్చ బండ), నాది బండి (బతుకు జట్కా బండి) అని జీవిత కామెడీ పంచ్ లు పేల్చుతుంది. మీరు ఏదైనా చేయండి అని అడిగిన ప్రతి సారీ 'శేఖర్' సినిమా చూడండి అంటూ రాజశేఖర్ నవ్వులు పూయిస్తుంటారు.
Hyper Aadi
మరోసారి రోజా కొట్టడానికి హైపర్ ఆది, బులెట్ భాస్కర్ పై దూకుతుంది. దీనితో జీవిత ఇన్వాల్వ్ అయి గొడవని ఆపుతుంది. అసలు గొడవ ఎందుకు వచ్చింది అని జీవిత అడగగా.. నా ప్రజల్ని తిట్టారు అంటూ రోజా సమాధానం ఇస్తుంది. దీనితో ఆగ్రహానికి గురైన జీవిత.. హైపర్ ఆది, బుల్లెట్ భాస్కర్ లని కొడుతుంది.
Hyper Aadi
మీ ముందే మీ భార్య మమ్మల్ని కొడుతోంది.. ఏమైనా చేయండి సర్ అని ఆది.. రాజశేఖర్ అని అడుగుతాడు. దీనితో రాజశేఖర్.. నా బతుకే జట్కా బండి.. ఇక నేనేం చేయను అని చెప్పడంతో ఒక్కాసారిగా అంతా నవ్వుల్లో మునిగిపోతారు. ఎంటర్టైనింగ్ గా ఉన్న ఈ ప్రోగ్రాం వైరల్ అవుతోంది.