- Home
- Entertainment
- Jeevitha: కులాన్ని కించపరిచిన జీవిత రాజశేఖర్.. తన కూతుళ్ల గురించి చెబుతూ ఇలాంటి వ్యాఖ్యలా ..
Jeevitha: కులాన్ని కించపరిచిన జీవిత రాజశేఖర్.. తన కూతుళ్ల గురించి చెబుతూ ఇలాంటి వ్యాఖ్యలా ..
యాంగ్రీ స్టార్ రాజశేఖర్ నటించిన శేఖర్ చిత్రం మే 20న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. యాక్షన్ , థ్రిల్లర్ అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రానికి రాజశేఖర్ సతీమణి జీవిత రాజశేఖర్ దర్శకత్వం వహించారు.
- FB
- TW
- Linkdin
Follow Us

యాంగ్రీ స్టార్ రాజశేఖర్ నటించిన శేఖర్ చిత్రం మే 20న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. యాక్షన్ , థ్రిల్లర్ అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రానికి రాజశేఖర్ సతీమణి జీవిత రాజశేఖర్ దర్శకత్వం వహించారు. ఇటీవల ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరిగింది. ఈ చిత్రంలో రాజశేఖర్ కుమార్తెగా రియల్ లైఫ్ డాటర్ శివాని నటించింది.
jeevitha
ఇదిలా ఉండగా రాజశేఖర్, జీవిత ఇద్దరూ తరచుగా ఏదో ఒక వివాదంలో కనిపిస్తూనే ఉంటారు. ఇటీవల గరుడవేగ చిత్ర ఫైనాన్సియల్ వ్యవహారం పెద్ద రచ్చగా మారిన సంగతి తెలిసిందే. తాజాగా జీవిత మరో వివాదంలో చిక్కుకున్నారు. శేఖర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వేదికపై తమ కుమార్తెలు శివాని, శివాత్మిక ప్రసంగిస్తుండగా.. వారితో సరదాగా మాట్లాడుతున్న సమయంలో జీవిత ఓ కులం గురించి ప్రస్తావించారు. ఆమె చేసిన కామెంట్స్ ఆ కులాన్ని కించపరిచేలా ఉన్నాయి అంటూ జీవితపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది.
తమ కుమార్తెలు ఇద్దరికీ ఫుడ్ అంటే బాగా ఇష్టం అని జీవిత సరదాగా కామెంట్స్ చేసింది. స్విగ్గి వాళ్లందరికీ శివాని పేరు బాగా తెలుసు అని కామెంట్స్ చేసింది. వాళ్ళు డబ్బులు తిరిగి ఇచ్చేవరకు ఊరుకోదు. అది కోమటిదాని లెక్క అంటూ కులాన్ని కించపరిచేలా జీవిత వ్యాఖ్యలు చేసింది.
భాద్యతాయుతమైన సెలేబ్రిటిగా ఉన్న జీవిత ఇలా కులాన్ని కించపరుస్తూ మాట్లాడడం ఏంటని నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. డబ్బు విషయంలో ఆ కులాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియాలో బాగా వ్యాపించిన రోజుల్లో సెలెబ్రిటీలు చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాలని ఈ సంఘటన మరోసారి గుర్తు చేస్తోంది.
మరి జీవిత కామెంట్స్ పై ఆ సామాజిక వర్గం ఎలా స్పందిస్తుందో చూడాలి. శేఖర్ చిత్రంపై రాజశేఖర్ ఫ్యామిలీ భారీ ఆశలే పెట్టుకుంది. త్వరలో జీవిత కుమార్తెలు శివాని, శివాత్మిక ఇద్దరూ టాలీవుడ్ లో హీరోయిన్లుగా రాణిస్తున్నారు.