రివల్యూషనరీ లీడర్ `తలైవి` వర్కింగ్ స్టిల్స్.. జయ పాత్రలో కంగనాని చూస్తే వాహ్ అనాల్సిందే..
First Published Dec 5, 2020, 1:43 PM IST
కోలీవుడ్ సినిమాలోనే కాదు, తమిళ రాజకీయాల్లోనూ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన తిరుగులేని నాయకురాలు జయలలిత జీవితం ఆధారంగా రూపొందుతున్న బయోపిక్ `తలైవి`లో కంగనా ప్రధాన పాత్ర పోషిస్తుంది. తాజాగా జయలలిత వర్ణంతి సందర్భంగా ఈ చిత్రం వర్కింగ్ స్టిల్స్ ని పంచుకుంది కంగనా.

జయలలిత జీవితం ఆధారంగా `తలైవి` పేరుతో బయోపిక్‌ని దర్శకుడు ఏ.ఎల్ విజయ్ రూపొందిస్తున్నారు. ఇందులో జయలలితగా కంగనా రనౌత్ నటిస్తుంది. ఎంజీఆర్‌గా అరవిందస్వామి నటిస్తున్నారు.

ఈ సినిమా చిత్రీకరణ చివరిదశకు చేరుకుంది. తాజాగా శనివారం జయలలిత వర్ణంతి సందర్భాన్ని పురస్కరించుకుని `తలైవి` చిత్రంలోని వర్కింగ్ స్టిల్స్ ని పంచుకున్నారు.
Today's Poll
ఎంత మంది ఆటగాళ్లతో ఆడడానికి ఇష్టపడుతారు?